కేశవా అని దలతు నిన్ను
- పెయ్యేటి రంగారావు
ప|| కేశవా అని దలతు నిన్ను
క్లేశములను బాపరావా-దేవదేవా
క్లేశములను బాపరావా ||
1. ఆపదలలో ఆదుకొనుచు - ఆర్తరక్షణ జేతువే
ఆర్తి తోడను పిలుచుచుంటి - కరుణ బ్రోవవె
శ్రీమనోజా మాధవా అని మదిని దలతు
మహిమ జూపవ మురళిధారీ - ఓ మురారీ
మహిమ జూపవ మురళిధారీ ||
2. శోకపీడిత చెల్లి ద్రౌపది - నిండుసభలో నిన్ను
వేడ చీరలిచ్చి శీలరక్షణ జేసినావే కరుణ తోడ
గోవిందా అని కోరి బిలతు గోడు వినవా దురితహారీ - ఓ కంసారీ
గోడు వినవా దురితహారీ ||
3. ప్రాణభయముతొ హస్తి నిన్ను - తలచినంతనె పరుగిడి
మకరి జంపి ప్రాణ రక్షణ జేసినావే - మృదుల హృదయా
అచ్యుతా అని దలతు నిన్ను ఆర్తి బాపవ చక్రధారీ - ఖలవిదారీ
ఆర్తి బాపవ చక్రధారీ ||
*******************
No comments:
Post a Comment