కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపం (గేయము)
- చెరుకు రామమోహనరావు
అని తలచుచు ఒక సంసారి
ఆలు పిల్లలను ఇంటిని వదలి
అడవి దారి బడె కౌపీనముతో
సగముదారి తాబోయిన పిమ్మట
ఇంకొక గోచియు అవసరమనుకొనె
ఇల్లుజేరి వేరోక్కటి గైకొని
అడవి జేరే నత డాత్రముగా
మొదటి రోజు తా గడిపిన పిమ్మట
వానగాలి శీతోష్ణ స్థితులకు
వలనుగ కుటీర మవసరమనుకొని
అడవి కట్టెలకు వచ్చినవారిని
అడిగి సహాయము, నిర్మించె
ఏటి స్త్నానమును చేసిన పిమ్మట
తడిగోచిని తన ఇంటివద్ద తా
నారవేసి వేరోక్కటి కట్టెను
దైనందిన సద్విధులకునై
ఒకనా డొక చిట్టెలుక వచ్చియా
కౌపీనమ్మును కొరికె కొద్దిగా
చింతించిన యా తాపసి యంతట
బిడాలమును తా బిరబిర తెచ్చి
పెంచగనుంచెను పర్ణశాలలో
అప్పుడాతనికి అర్థం బయ్యెను
పిల్లికి కావలె పాలనుచు
పాలకొరకు ఒక ఆవును తెచ్చెను
ఆవు గడ్డికై భూమిని దున్నెను
నాట్లువేసి పంటను పండించెను
పిల్లి త్రాగగా మిగిలిన పాలను
అమ్మ దలచె నాసన్యాసంతట
అడవికి వచ్చిన అబ్బాయొకనిని
అందుకొరకు తా వినియోగించెను
పంటను కూడా అమ్మ సాగెను
వ్యవసాయమ్మును పెంచి వేసెను
రాను రాను సన్యాసము మరచి
సంపద మార్గము ననుసరించెను
అతని జాడ తా వెదుకుచు సతియు
సంతానముతో ఆతని జేరెను
బ్రహ్మచర్యమతి దుర్భరమనుచు
సంసారమ్మును చేర దీసెను
ఒకనాడంతట ఒక్క విలేఖరి
ఆతని కడకుజని యడిగెనిటు
అయ్యా నీకడ ఫ్రిజ్జీ ,టీవీ
గ్యాసుగొయ్యి మరియాపై పొయ్యి
భార్యా పిల్లలు సిరులు సంపద
అన్నీ చేరె నదా సన్యాసము
అంతట యాతను బదులు పల్కెను
'కౌపీనార్థము పటాటోప'మిది
ఎరిగితి సంసారమె 'సై' యంచును
దేశామంతటిని జంటల జేసెద
ఎన్నిక గుర్తును 'పుట్టగోచిగా'
ఎంచుచు నిలిచెద నేనెన్నికలో
దేశమెల్ల సంసారుల నింపుచు
సన్యాసుల లేకుండ జేసెదను
గోచిపాత నా పార్టీ పేరు
గోచిపాత నా పార్టీ జెండా
గోచిపాత నా పార్టి ఎజెండా
గోచిపాత గా పేరును మార్చి
మహారాజుగా దేశమునేలెద
No comments:
Post a Comment