నదీ ప్రస్థానం - అచ్చంగా తెలుగు

నదీ ప్రస్థానం

Share This
నదీ ప్రస్థానం
- వసంతశ్రీ

బిందువుగా మొదలై సింధువులో కలిసే వరకు నదీ ప్రయాణం,
మేఘపు ఒడిలో ఘనంగా నిదురించే శిశువు,
తనతోటి చినుకు నెచ్చెలితో విడివడదు చల్లగాలి సోకే వరకు
విడిన తర్వాత కదలి తరలి వెళ్ళే యానం,
తన తోవ ఏటేపో తనకే తెలియదు మరి.
పైనుండి ఉరికి పడిన చోటనే మొదలు చలనం,
సన్నగా మొదలైన ధారతో కలసి వాగు,వంకలతో
కొండలపైనుండి జాలువారే సన్నాహం,
యవ్వనపు ఉత్సాహానికి ప్రతీక ఈ ఘట్టం.
జలపాత హోరులో,ఉరుకుతూ నీరైనా పలల్లా మెరిసే ఊపు....
జలమై,వాగై-నదిలో కలిసే వేళ..
ముందున్న హడావిడి కొంత తగ్గినదై నిండైన నడకతో
గృహస్తాశ్రమంస్వీకరించినదై సంసారపక్ష పోలికతో
తేట పడి స్వచ్చతతోమందగమనయై
ఎన్నో,ఎన్నెన్నో పిల్లకాలువలను చేర్చుకుంటూ నదీనదం,
ఎన్నో జీవరాసులకు జలమందించే పవిత్రత ఒనరేలా తేటనీటినందిస్తుంది.
మునపటి ఉత్సాహపు పాలు తగ్గి,గాంభీర్యపు నది- ఇప్పుడు ప్రౌఢ ,
పరోపకారంలోని మాధుర్యాన్ని తెలిసివచ్చిన పరిపక్వతలా
సాగుతోన్న గమనంలో సంతృప్తిని పొందిన ప్రస్థానం,
ఇంక చివరుకి చేరేది సాగరానికేనని తెలిసి.....
పరమాత్ముని చేరే మార్గం లో-
ఈ గమ్యంతో తన ఉనికినే కోల్పోయినా సరియైన అంతరార్ధం నెరవేరిన తృప్తి.
ఇదీ నదీగమనం-జీవన ఆదర్శం.

No comments:

Post a Comment

Pages