సమాజమా మేలుకో......!!!!
- తలారి కారుణ్య
కుళ్ళిపోతున్న సామ్రాజ్యంలో
మనలేక మగ్గిపోతూ
జవసత్వాలుడిగి నిల్చున్నా
చలించవేం సమాజమా
మనం బ్రతికితే చాలనుకునే
స్వాతిశయంతో భవిష్యత్తుని
పరాయిదేశాలకు అమ్ముకుంటున్నా
నీచమైన నిజంలో నుండి
కదలి రావేం సమాజమా
కాళ్ళక్రింద భూమి కరిగిపోతున్నా
పూర్వపు పునాదులు కూలిపోతున్నా
కష్టపడి తెచ్చుకున్న స్వాతంత్య్రమంతా
రాబందులు తన్నుకుపోతున్నా
చేష్టలుడిగి చూస్తావేం సమాజమా
నాయకుల వాగ్దానాలు నీటిమీద రాతలౌతున్నా
కడుపుకింత ముద్ద కోసం
పేదవాడి గుండె అన్నార్తియై
ఎదురుచూస్తోంది
చొరవ చూపవేం సమాజమా
ఆశనిరాశల మధ్య కొట్టుకుంటూ
ఆశయాలు లేని సంఘర్షణలెందుకు
మనుగడ నీదే
భవిష్యత్తు బాట నీదే
నేటి పునాదిరాళ్ళే
రేపటి గౌరవ నాందీ గీతాలు......సమాజమా మేలుకో......!!!!
No comments:
Post a Comment