సరదా సంఘటన
-వసంతశ్రీ
ఒక అమవాస్య రాత్రి ఘాట్ రోడ్ లో-సింగిల్ గా నడుస్తున్నా.నా బండి ట్రబుల్ ఇవ్వడం వల్ల ఏదైనా లిఫ్ట్ట్ దొరుకుతుందేమో అని ప్రయత్నిస్తూ నడుస్తున్నా.దూరంగా ఏవో నక్కల అరుపులు భయం వేసి ఆగా.పక్కనే ఒక కార్ కనబడింది.డోర్ తీసే ఉంది అదేంటో.ఏదైనా బండి దొరికేదాకా కూర్చుoదామనిపించి ఆగా. ఆగి ఉన్న కార్లోకి ఎక్కేసా.సడన్ గా అది కదలడం మొదలైంది. నాకు నోట మాట రాలేదు.బిక్క చచ్చినట్టు ఊరుకున్నా...అటూ,ఇటూ తల తిప్పిచూసా..చిమ్మ చీకటి.కారు ఆగకుండా కదులుతూనే ఉంది.నేను నిర్ఘాంతపోయి-కిమ్మనకుండా కూర్చున్నా. ఒకవేళ డౌన్ అవడం వల్ల కారు జారిపోయి,ఏ లోయలోనో దొర్లి పొతున్దెమొఅనె ఆలోచన భయం తెప్పించింది.కానీ అదృష్ట వశాత్తు రోడ్ మీదే వెళ్తోంది.పైగా up లో వెళ్తోంది.ఇదేదో దెయ్యం సినిమాలా అనిపించి, నాలుక పిడచ కట్టుకు పోతోంది.అరవాలంటే- మాట పెగాలటం లేదు. దిగాలనుకున్నా కాళ్ళు సహకరించడం లేదు,లోపల్నించి వణుకు.కదలనివ్వటం లేదు నన్ను. ఈలోగా ఏదో కాంతి-రోడ్ మీద ఏదో ఊరు సమీపిస్తున్నట్టు.పోయిన ప్రాణం లేచి వచ్చింది.హమ్మయ్య అని ఊపిరి తీసుకున్నా.కార్ నెమ్మదిగా ఆగింది.తలతిప్పి చూసా పెట్రోల్ బంకు లోకి వచ్చి ఆగింది కారు,కార్ కి ఇక్కడ ఆగాలని ఎలా తెలిసిందబ్బా!!ఆశ్చర్యం!! ఇంతలో వెనక నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆగారు. నన్ను చూపిస్తూ-" రారా.ఆగిపోయిన కారు తోస్తుంటే గబగబా ఎక్కికూర్చున్నావా ?ఆపితే కారు వెనక్కి జారుతుందని చచ్చి తోసాం .పెద్ద లార్డ్ లా!!"వగరుస్తూ అన్నాడు.
No comments:
Post a Comment