ప్రతి రోజు సంక్రాంతి....
- సుజాత తిమ్మన
చలి (పులి )ని తరిమి తరిమి కొడుతున్నాయి ..
ముంగిళ్ళలో..రకరకాల ముగ్గులు
మెలికలు...గీతలు..అన్నీ మావేనంటూ...
గుమ్మడి పూలతో సింగారించుకున్న గొబ్బెమ్మలకావాసమవుతూ...
గాలి పటాలెగరవేస్తూ..మెడ మీద పిల్లల అల్లరులు..
రంగుల పతంగులు...వినీలాకాశంలో..
ఒకదానితో ఒకటి పోటీ పడుతూ...
హరి కీర్తనతో వంత పాడుతూ..గోడమీద కోడి పుంజులు..
రాచ మర్యాదలు మావేనంటూ..
లేని మీసాలను మెలేయాలనుకునే కొత్తళ్ళుళ్ళు
అరిసెలైనా..నువ్వులడ్డూలయినా..బెల్లం పాకమే..
జంతికలైనా..సఖినాలయినా.. విందులకు వాడుకలే ..
ప్రాంతీయ భేదం మరపించే పండుగ సంబరాలు..
కొసరి కొసరి రుచి చూపించుకునే కౌగిళ్ళ ఆనందాలు ...
అన్నం పెట్టే రైతన్న..
పెనుతుఫాను ప్రాణం మీదికి తెచ్చినా..
పండిన పంటను కాపాడుకోను తల్లడిల్లి పోయినా...
సంక్రాంతి లక్ష్మికి మాత్రం..
తన శక్తి మేర స్వాగతం పలుకుతునే ఉంటాడు...
ఆకలి లేని లోకమై ...
పేదరికం..పారిపోయి ..
ప్రజలంతా..ఒకటిగా మెలగాలి..
అప్పుడే..నిజమయిన సంక్రాంతి..!! ప్రతి రోజూ సంక్రాంతి !!
No comments:
Post a Comment