సమస్యాపూరణం (తాత్పర్య సహితం ) - అచ్చంగా తెలుగు
సమస్యాపూరణం (తాత్పర్య సహితం )
-      మల్లాది వేంకట సత్యనారాయణ మూర్తి



1.    ఆటవెలది : చిన్న ఎవరు ? యిందు మిన్న ఎవరు ?
  గౌరిపూజ కూడ గంగలేనిదె యెట్లు 
 చేయశక్యమగును మాయలేల ? 
 గౌరిగంగ లిర్వురారాధ్య దేవతల్ 
  చిన్న ఎవరు ? యిందు మిన్న ఎవరు ? 
భావం : పార్వతీ దేవి యొక్క పూజ కూడా నీరు లేకుండా చేయటం కుదరదు కదా ! కనుక చిన్న, మిన్న అన్న వ్యత్యాసం లేక, పార్వతీ –గంగ లిద్దరూ ఆరాధించదగ్గ దేవతలే !  
  2.    కందము : ధరకొసగెడు నవ సుమధురతర రాగమ్ముల్ ! 
హరు పంచాక్షరి మంత్రము 
 సరిగమపదనీయని యెడి సప్తస్వరముల్ 
 హరి అష్టాక్షరి మంత్రము 
  ధరకొసగెడు నవ సుమధురతర రాగమ్ముల్   
భావం : హరి పంచాక్షరీ మంత్రము , సప్తస్వరములు, విష్ణువు యొక్క అష్టాక్షరీ మంత్రము ఈ భూమికి కొత్తవగు , మధురమైనవగు రాగములను ఇచ్చును .   
3.    కందము : పరమేశా ! గంగ విడుము పార్వతి చాలున్ !   
ధరణిని నీరము కఱువయె 
 గిరిసుత చేయించు నీకు గిరిజానాధా ! 
 కరుణను స్నానము నిత్యము ,
 పరమేశా ! గంగ విడుము పార్వతి చాలున్ !  
భావం : భూవాసులకు నీరు కరువగుచున్నది. ఓ పరమేశా, నీకు స్నానం చేయించేందుకు పార్వతీదేవి ఉన్నది కదా ! మాకు గంగను ప్రసాదించు.

No comments:

Post a Comment

Pages