గణ తంత్ర దినోత్సవం...
- సుజాత తిమ్మన
భారతీయుల ఆత్మస్తైర్యానికి ప్రతీకగా ..
అమర వీరుల త్యాగ నిరతిని చాటుతూ...
గగనసీమలో రెప రెప లాడుతుంది మూడు రంగుల పతాకం
అహింసనే ఆయుధంగా చేసుకొని..
1947 లో సత్యాగ్రహం ...
సహనంతో సాదించిన స్వాతంత్రం
1950 లో అధికారికంగా ప్రకటితమై....
ప్రజలందరికీ వరమై నిలిచింది.....
కుల మత జాతి బెదాలను మరచి
ప్రాంతీయ తేడాలను విడిచి ...
.దేశమంతా ఒకటిగా ..
"జనగణ మన " అంటూ ఠాగూర్ గీతం
హృదయాలను మేల్కొలిపే.... అమర దీపమై...
సైనికుల క్రమ విన్యాసాలతో....
బాలబాలికల నృత్య సంగీతాలతో...
అభివృద్ధి ....సమైక్య సంస్కృతుల ప్రదర్శనలతో..
డిల్లీ రాజ్ భవన్ మార్గమంతా...సందడే..
దూర దర్శన్ లో చూస్తున్న మనకి కన్నుల పండుగే..
జై హింద్ నినాదాల సంబరమే కాదు ...
ప్రతి వ్యక్తీ ఒక శక్తి అయి ..
దేశాభ్యున్నతికి పాటు పడతానని
ఎవరికీ వారు ప్రతిజ్ఞ చేసుకోవాలి..
ఈ గణతంత్ర దినోత్సవమున.....
**************************************************
No comments:
Post a Comment