రుద్రదండం -10 - అచ్చంగా తెలుగు

రుద్రదండం -10

Share This

రుద్రదండం -10

- రాజ కార్తీక్


(జరిగిన కధ : పార్వతికి తంత్ర విద్య నేర్పుతుండగా ఆమె పరాకును గమనించిన శివుడు, కోపించి, తన చేతిలో ఉన్న రుద్ర దండాన్ని విసిరివేస్తాడు. అది ముక్కలై జంబూద్వీపంలో అనేకచోట్ల పడుతుంది. అవన్నీ దక్కించుకుని, జోడించిన వాడు శివుడే అవుతాడు. రుద్రదండం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు కపాలుడు. కాశీ నగరంలోని శివాలయంలో  రుద్రదండాన్ని సాధించబోయే కారణ జన్ముడు పుడతాడు… ఆ సమయంలో అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు ఒక ఒంటి కన్ను రాక్షసుడు… ఆ రాక్షసుడిని బారి నుంచి రాజకుటుంబాన్ని, ప్రజల్ని రక్షిస్తాడు విష్ణునంది అనే ముని. బాలుడికి రుద్రసేన కార్తికేయుడు అని పేరు పెడతారు... ఇక చదవండి...) “సమయం వచ్చినప్పుడు తప్పక అన్నీ అర్ధమవుతాయి.. అయినా లోకమాతవి నీకు తెలీకుండా ఏమీ జరగదు కదా లక్ష్మి” అన్నారు విష్ణు దేవుడు.. లక్ష్మిమాత “నారాయణ.. మాకు అన్నీ తెలిసినా మీ నోటి వెంట వినాలని నా ఆశ”.. విష్ణు దేవా “ఆ..” అయితే చూడు ఇక మీద అసలు కథ మొదలవబోతుంది... జంబు ద్వీపం... భరత ఖండం... మహారాజ కేశవసేనుడు పాలించే రాజ్యం.. ప్రధమశివపురం.. రుద్రసేన కార్తికేయుడు... చిన్నగా పెరుగుతున్నాడు... ఇప్పుడు చిన్నబలుడు అయ్యాడు అయినా.. విష్ణు నంది ఆ రాజ్యం లో వుంది.. యువరాజుకి తగిన విధంగా శిక్షణ ఇస్తున్నాడు... ఇక యువరాజు రుద్రుడు కి గురుకుల శిక్షణ సమయం ఆసన్నం అయింది. మహారాజ మరియు రాణి రుద్రుడ్ని అన్ని విధాలుగా తర్ఫీదు ఇవ్వవలసిందిగా ప్రార్ధించి అన్ని విద్యలు తెలిసిన శివపాదుడు అనే మహర్షి దగ్గరకు పంపుదాము అని తన ఆశ్రమ పోషణ కోసం రాజు దగ్గరకు వచ్చిన మహర్షి తో పంపుదాము అని నిర్ధారించుకున్నారు... శివపాద “రాజ ఏడి మీ రాజకుమారుడు?” ఇంతలో రుద్రా అక్కడికి వచ్చాడు.... కేసవసేనుడు “కుమారా రుద్రా ఈ రోజు దివ్యమైన ముహూర్తం కావున.. ముందు అనుకున్న విధంగా.. నీవే వెళ్లి విద్యాభ్యాసం మొదలెట్టాలి.. అదిగో నీ గురువుగారు” శివపాద రుద్రని చూసి.. “బాలుడా.. ఏమి నీ నుదుటి మీద ఈ విభూతిరేఖలు?” అన్నారు. రాణి చంద్రప్రభ రుద్రా జన్మ వృత్తాంతం మొత్తం చెప్పింది. శివపాద “ఇతను సహజ పరాక్రమాలు కలిగిన వ్యక్తి.. కేవలం మరొకసారి అన్ని గుర్తుచేయటమే ఇతనికి..” అంటూ ఆశీర్వదించాడు. రుద్రా “గురుదేవా.. మాతపిత సమానులు, దైవం కన్నా గొప్పవారు నాకు విద్యాదానం చేసి నన్ను ఆదర్శవంతమైన పౌరునిగా తయారు చెయ్యండి. శాస్త్రాల ద్వారా నాకు జ్ఞానం ప్రసాదించండి. శివపాద “ తప్పక నాయన.. నిన్ను చూస్తుంటేనే ఏదో ఆనందం కలుగుతుంది.. నువ్వు నిండా నూరేళ్ళు వర్దిల్లుతావు..” రుద్ర అమ్మ నాన్న విష్ణునంది ఆశీర్వాదం తీసుకున్నాడు. విష్ణునంది వెంటనే రుద్రుని ఎత్తుకుని వాత్సల్యం తో ఒక ముద్దు పెట్టుకుని.. “రుద్రా.. ఈ బాకు నీ దగ్గర పెట్టుకో ఇది అన్ని వేళల్లో నిన్ను కాపాడుతుంది.. అంటూ బాకు పనితనం తెలిపి.. తను ఇది వరకు కాసి ఆలయంలో రాక్షసుడిని చంపిన బాకుని ఇచ్చాడు”. ఇక రుద్రుడుతో పాటు శివపాదునకు కూడా రాజపరివారంతో ఆశ్రమానికి కావాల్సిన వస్తువులు ఇచ్చి పంపించారు. విష్ణునంది “మహారాజా ఇక రుద్రా గురుకులానికి వెళ్ళాడు. నేను వెళ్లి కాశిలో సాధన చేసుకుని వస్తాను.. రుద్రుడిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. అతను పెద్దవాడు ఐన తర్వాత.. అతన్ని ఏ శక్తి ఏమి చెయ్యలేదు.. అతని జాతకం లో పూర్ణ ఆయుష్షు.. రాజవైభావం.. నీతి న్యాయం.. అన్నీ వున్నాయి..” అంటూ శెలవు తీసుకున్నాడు. రుద్రుడు శివపాదుడు అరణ్యం వైపు పయనించారు.. ఇదంతా మాయా దుర్భిణి లో చూస్తున్న మార్తాండుడు ప్రధమపురానికి పయనించాడు.. క్రమేణా యువరాజు పెరిగి పెద్దవాడు అవుతూ.. సకల విద్యలలో ఆరితేరాడు. రుద్ర రుద్రా అని అందరూ అతన్ని కలవరిస్తారు.. మహర్షి.. శివపాదుడికి కూడా రుద్రా ఇష్టమైన శిష్యుడు లాగ ఉండేవాడు.. అన్ని విద్యల్లో అతనికి అతనే సాటి. అక్కడ ఒక గుర్రాల మంద వుంది.. ఎందుకో తెలీదు.. అన్ని గుర్రాలు పచ్చిక తింటున్నాయి.. ఉన్నట్లుండి ఒక గుర్రం విదిలిస్తుంది.. ఎందుకో అర్ధం కాలేదు ఎవరికీ.. ఆ గుర్రాలు బెదిరిపోతున్నాయి.. అవి గనక బెదిరి పరిగెత్తి వస్తే శివపాదుని ఆశ్రమం నేల మట్టం కావటం ఖాయం.. అవి ఎంతో బలమైన గుర్రాలు.. వాటిని వంచటం ఎవరి తరం కాదు.. ఆ గుర్రాలు బెదిరాయి.. ఎందుకో అర్ధం కాలేదు.. అవి పరుగు మొదలెట్టాయి.. ఉన్నట్లుండి ఎక్కడి నుండో ఎవరో చెట్ల మీద నుండి చెట్ల మీదకి దూకుతున్నాడు.. ఎవరో అర్ధం కావటం లేదు.. ఆశ్రమానికి అడ్డంగా కొన్ని చెట్ల చివరి కొమ్మకి వేళ్ళాడుతున్నాడు.. ఆ కొమ్మని వంచి తన బలం మొత్తం ఉపయోగించి అలా కొన్ని చెట్లకి తాడుని కట్టాడు.. ఎవరికీ ఏమీ అర్ధం కావటం లేదు.. మిగతా శిష్యులు అందరూ ఏమి చెయ్యాలా అని అనుకుంటున్నారు.. అందులో ఒక తుంటరి వాడు “అయ్యో గురువుగారు బయటకు వెళ్ళారే.. ఈ గుర్రాలు మన ఆశ్రమాన్ని పడగొడితే ఎలా.. అసలు మధ్యాహ్న్నం భోజనం కూడా చెయ్యలేదు” అంటున్నాడు, తన పొట్ట మీద చెయ్యి వేసి.. ఇప్పుడు అర్ధం అయింది అతనికి ఆ ముడులు వేయటం వల్ల చాలా గుర్రాలు చెట్లు దాటి రాలేకపోయాయి.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. కానీ ఒక గుర్రం మాత్రం ఒక్కసారిగా అంత ఎత్తు మీద నుండి దూకి ఆశ్రమం వైపు పరుగుపెడుతుంది.. ఇక ఇందాక ముడులు వేసిన వీరుడు ఒక్కసారిగా ఆ గుర్రం మీదకు దూకాడు.. అది లొంగట్లా.. ఆ వీరుడు తన మొహం మీద ముసుగుని తీసి గుర్రం మెడకు కట్టాడు.. అయినా అది లొంగలా.. దాన్ని స్వారీ చేస్తున్నాడు.. అది వచ్చి సరిగ్గా ఆశ్రమంలో గురువుగారి స్థానాన్ని కొట్టబోయింది.. అది మట్టిది కావున ఒకవేళ ఆ గుర్రం డీకొంటే ఆ గురు స్థానం పగిలిపోయేది.. అందరూ చూస్తున్నారు వెనక నుండి.. సరిగ్గా అది గురువుగారి స్థానం మీదకి లంఘించబోయేసరికి ఒక్కసారిగా దాన్ని లొంగ దీసి వెనక్కి తిప్పాడు ఆ వీరుడు.. ఎవరో కాదు ఆ వీరుడు “రుద్రా.. రుద్ర సేన కార్తికేయుడు” అందరూ చప్పట్లు కొడుతున్నారు.. “రేయ్ మన రుద్రా రా.. ముసుగు వేసుకుంటే అర్ధం కాలేదు” అంటున్నారు మిగతా శిష్యులు.. ఆగిన ఆ గుర్రం మళ్ళీ పరుగు మొదలెట్టింది.. దానికి తోచినట్లు అది పరుగుపెడుతోంది.. రుద్రా జాగ్రత్తగా ఆ గుర్రం మీద వున్నాడు.. అది పరిగెట్టి పరిగెట్టి చివరగా ఒక కొండ పై చొరియ కి చేర్చింది.. అది వారి ఆశ్రమ హద్దు.. అక్కడ ఒక సుందర ప్రకృతి రమణీయత వుంది.. చాలా చాలా పెద్దది ఐన జలపాతం వుంది.. ఆ జలపాతానికి అటు చివర ఇటు చివర పెద్ద చెట్లు వున్నాయి.. అటు ఇటు ప్రయత్నిస్తున్నట్లు అక్కడ పెద్ద పెద్ద కొమ్మలు వున్నాయి.. ఒక కొమ్మ బెరడు పట్టుకుని పోతే సరిగ్గా అటు ఒడ్డుకి చేరతారు.. అటు అంతే వుంది.. అది రుద్రకి తెలిసిందే.. (సశేషం...)

No comments:

Post a Comment

Pages