ఎలుగెత్తి చాటరా
- కంచర్ల మాధవి
భారతీయుడను నేనంటూ...
భరతఖండంబు నాదేనంటూ...
చాటరా...
చాటరా... ఎలుగెత్తి చాటరా సోదరా
దిక్ దిగంతములు పిక్కటిల్లంగా....... // భారతీయుడను//
తీవ్రవాదమ్మునూ తిప్పికొడతామనీ
మతసామరస్యమును మరచిపోబోమని
అసాంఘిక శక్తులను అణచివేస్తామని
చాటరా...
చాటరా... ఎలుగెత్తి చాటరా సోదరా
దిక్ దిగంతములు పిక్కటిల్లంగా....... // భారతీయుడను//
అక్రమాలకు పక్క బల్లెమై నిలవగా
అవినీతి జాడ్యాన్ని అంతమొందించగా
నడుము కట్టిన వీర సైనికుడ నేనని
చాటరా...
చాటరా... ఎలుగెత్తి చాటరా సోదరా
దిక్ దిగంతములు పిక్కటిల్లంగా....... // భారతీయుడను//
No comments:
Post a Comment