అక్షరమే 'అమ్మ '
- సుజాత తిమ్మన
అనాధని అని.. అందరూ అంటారు..కాని..
అమ్మ కాని అమ్మ...... అక్షర అమ్మ నాకు తోడైంది..
అక్కరకు రాని చుట్టాలు నాకెందుకు ?
అలరించే పదాలను .. అల్లికల దారంతో బంధిస్తూ..
అల్లిబిల్లి కవితలను అలవోకగా వ్రాసేస్తూ..
"అమ్మకి.." అంకితమిస్తా.....!
అనురాగలతలను పెనవేసుకుంటూ..
అర్పణలోనే జీవితం సాగిస్తా..!
అన్ని భాషలలోనూ... అగ్రగామిగా నిలిచిన తెలుగుతనం...
అమృతమంటి పలుకుల కమ్మదనం..
ఆచంద్ర తారార్కము నిలిచి ఉండేలా
అలుపెరుగక శ్రమిస్తా...!
అమ్మని మరువనీయక ..
అందరి మనోభావాలను ఒకటి చేస్తా....!
అర్ధ రహిత విదేశీయతను నిరసింపజేస్తూ..
అన్నం ..ఆవకాయలోని ఆంధ్రీకరణని తెలియజేస్తా..!
***
No comments:
Post a Comment