బహుపరాక్ - అచ్చంగా తెలుగు

బహుపరాక్

Share This

బహుపరాక్ .....

- పిన్నలి గోపీనాథ్ 


ఆ.వె. మొదట వచ్చినపుడు మన్మథెవరొ గాని

మరల వచ్చు నయిన  మనుగడేమొ ?

ఏళ్ళు గడచిపోవ ఏమి ఫలము ఇప్డు

నవ్వుకొందు యువత నడత జూసి !!

 

ఆ.వె. పాల పొంగు యనగ ప్రాయమొక్కటె గాదు

కాల చక్రమంతె గాంచ లేము !

చిక్క దనము చేయి జారకుండగ జేయు

'కోవ' వలెనె పొందు కర్మ ఫలము !!

 

ఆ.వె. తెలుగు వత్సరములు తిరిగి రావచ్చును

నేర్వ జూడ నవియె నేర్పు నెంతొ

ఆమనినియు దెచ్చి ఆకు రాల్చుచు వోవు

మనిషి గమన మదియె మరువ రాదు !!

No comments:

Post a Comment

Pages