కాలచక్ర ప్రతీకలు.. తెలుగు సంవత్సరాలు - అచ్చంగా తెలుగు

కాలచక్ర ప్రతీకలు.. తెలుగు సంవత్సరాలు

Share This

 కాలచక్ర ప్రతీకలు.. తెలుగు సంవత్సరాలు

- ఆచార్య చాణక్య 


మనం ప్రతిఏడాది ఉగాది జరుపుకుంటాం. ఒక్కో ఉగాదికి ఒక్కే పేరు ఉంటుంది. ఆ పేరనే సంవత్సర నామధేయంగా వ్యవహరిస్తాం. అలా 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. పురాణగాధ ప్రకారం.. విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన 60 మంది సంతానమే ఈ తెలుగుసంవత్సరాలు. కాలచక్రంలో వారి పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇచ్చిన కారణంగానే ప్రతి ఉగాదికి అవే నామధేయాలు అవుతున్నాయి. వాటి పేర్లతో పాటు.. ఆ సంవత్సరాలు ఇచ్చే ఫలితాలను మీరు తెలుసుకోండి.
ప్రభవ:  ఎక్కువగా యజ్ఞయాగాదులు విభవ:  ప్రజలకు సుఖసంతోషాలు శుక్ల:   సమృద్ధిగా పంటలు ప్రమోద్యూత:  అందరికీ ఆనందం ప్రజోత్పత్తి:  అన్నింటా అభివృద్ధి అంగీరస:  భోగభాగ్యాల సిద్ధి శ్రీముఖ: వనరులు సమృద్ధి భావ:  సద్భావనలు, ఉన్నతభావనలు యువ:  సమృద్ధిగా వర్షాలు - పాడిపంటలు ధాత:  అనారోగ్యబాధల తగ్గుముఖం ఈశ్వర:  క్షేమం, ఆరోగ్యం బహుధాన్య:  సుభిక్షంగా దేశం ప్రమాది:  వర్షాలు మధ్యస్థం విక్రమ:  సమృద్ధిగా పంటలు, విజయాలు వృష:  సమృద్ధిగా వర్షాలు చిత్రభాను:  అంచనాలకు అందని ఫలితాలు స్వభాను:  ప్రజలకు క్షేమం, ఆనందం, ఆరోగ్యం తారణ:  సరైన సమయంలో సకాల వర్షాలు పార్థివ:  ఐశ్వర్యం, సంపదల వృద్ధి వ్యయ:  అతివృష్టి, అధికఖర్చు సర్వజిత్్:  సంతోషకరంగా వర్షాలు సర్వధారి:  దేశం సుభిక్షం విరోధి:  వర్షాలు తగ్గుముఖం వికృతి:  అశుభ ఫలితాలు ఖర:  సామాన్య పరిస్థితులు నందన:  ప్రజలకు ఆనందం విజయ:  శత్రుజయం జయ:  కార్యసిద్ధి, ప్రజలకు లాభం మన్మథ:  భోగభాగ్యాలు, ఆరోగ్యం దుర్ముఖి:  ఇబ్బందులు ఉన్నా క్షేమకరఫలితాలు హేవళంబి:  ప్రజలకు ఆనందం విళంబి:  సుభిక్షంగా ఉంటారు వికారి:  శత్రువులను నుంచి ఇబ్బందులు శార్వరి:  సామాన్యంగా పంటల దిగుబడి ప్లవ:  సమృద్ధిగా నీటి వనరులు శుభక్రుతు:  ప్రజలకు ఆనందం శోభక్రుతు:  ప్రజలకు సుఖసంతోషాలు క్రోధి:  కోపస్వభావంతో సామాన్యఫలాలు విశ్వావసు:  సమృద్ధిగా ధనయోగం పరాభవ:  ప్రజలకు అపజయాలు ప్లవంగ:  నీటి వనరులు అధికం కీలక:  పంటలు బాగా పండుతాయి సౌమ్య:  శుభఫలితాలు అధికం సాధారణ:  సామాన్య ఫలితాలు విరోధికృత్్:  ప్రజల్లో విరోధభావాలు పరీధావి:  ప్రజల్లో భయాలు ప్రమాదీచ:  ప్రమాదాలు అధికం ఆనంద:  ప్రజలకు ఆనందం రాక్షస:  దుస్సంఘటనలు అధికం నల:  పంటలు బాగా పండుతాయి పింగళ:  సామాన్య ఫలితాలు కాళయుక్తి:  కాలానికి అనుగుణమైన ఫలితాలు సిద్ధార్ధి:  అన్నింటా కార్యసిద్ధి రౌద్రి:  ప్రజలకు చిన్నపాటి బాధలు దుర్మతి:  వర్షాలు సామాన్యం దుందుభి:  క్షేమం, ధాన్యసమృద్ధి రుధిరోద్గారి:  ప్రమాదాలు అధికం రక్తాక్షి:  సామాన్యఫలితాలు, అశుభాలు క్రోధన:  విజయాలు సిద్ధిస్తాయి అక్షయ:  సంపదలు అధికం  

No comments:

Post a Comment

Pages