మనసున మనసై - అచ్చంగా తెలుగు

మనసున మనసై

Share This

@@@@-మనసున మనసై - @@@@

(పెద్ద కధ ) – 2 వ భాగం

- రాజవరం ఉష


(జరిగిన కధ : సుజన్,సంజన ప్రక్క ప్రక్క ఇళ్ళలో ఉంటారు. వాళ్లకు రక్తసంబంధం లేకపోయినా, వారి తల్లిదండ్రులు చిన్నప్పుడే, ప్రక్కప్రక్కన ఇళ్ళు కట్టుకుని, ‘బావా- బావమరిది’ అంటూ వరస కలుపుకుని, ఆత్మీయంగా పిలుచుకుంటారు. సుజన్, సంజనల చదువు పూర్తి కాగానే వాళ్ళ పెళ్లి చేసి, ఆ బంధాన్ని మరింత బలోపేతం చెయ్యాలని, వాళ్ళ ఆలోచన. రోజూ సుజన్ సంజనను కాలేజీ కి తన బైక్ పై తీసుకువెళ్ళి, తీసుకు వస్తూ ఉంటాడు. ఆ రోజు సుజన్ తనను తీసుకు వెళ్లేందుకు రాకపోవడంతో, సంజన ఒక్కత్తే ఇంటికి వస్తుంది. ‘ఎవరితో వచ్చావ్’ అంటూ సంజన ను నిలదీస్తాడు సుజన్.... ఇక చదవండి...)
 అమ్మ తెచ్చిన హార్లిక్స్ అయిష్టం గానే తాగుతూ ఆ వేళ తను సంజనను ఎందుకు పిక్ అప్ చేసుకోలేదో చెప్పాడు సుజన్. అమ్మ దగ్గర ఏదీ దాచడు.
 అమ్మంది, " చెప్పిందిరా సంజు నాకు- నీకేదో స్పెషల్ క్లాస్ ఉండినదట కదా, లేట్ గా వస్తానని నాతోచెప్పమన్నావని  కూడా చెప్పింది రా. మంచి పిల్ల సంజన. నువ్వు చెప్పింది చెప్పినట్లుగా చేస్తుంది "నవ్వుతూ అంది రమ.
 సుజన్ అటు తిరిగి వెంటనే నాలుక కరుచుకున్నాడు స్స్..... అని.... స్టన్ అయ్యాడు ఒక్క  \సారిగా... సుజన్ కు వెంటనే సంజు మీదున్న కోపం ఎగిరిపోయింది. తనని కలిసి సారి చెప్పాలి అనుకున్నాడు. రాత్రి భోజనాలు అయ్యాక మేడ మీదికెళ్ళి వెతికాడు సంజు కోసం.  ఓ ప్రక్కగా నించుని ఆకాశంలోని మబ్బుల్లో  దోబూచులాడుతున్న  చంద్రుణ్ణి చూస్తూ ఉంది  సంజు. ఇక ఆలస్యం చేయ లేదు సుజన్. సంజు వద్ద కెళ్ళి “అయాం సో సారి సంజన!  నన్ను అమ్మ తిట్ల నుండి రక్షించినందుకు, పైగా నాకు మంచి పేరు తెస్తున్నందుకు (స్పెషల్ క్లాసు అని ).. థాంక్స్ కూడా .. “,అంటున్న సుజన్ వైపు చూసి వెంటనే అటు తిరిగి ముసి ముసి నవ్వులు నవ్వుకుంది. కానీ ఇటు తిరిగి కోపం నటిస్తూ ,’ ఇదుగో సుజన్! ఈ సారంటే రక్షించాను  అత్తయ్య కి అబద్ధం చెప్పి. కానీ ఇంకోసారి ఇలాగే  కాలేజీ  ముందు అర్ధ గంట  వెయిట్ చేయించావంటే చూడు ఏం చేస్తానో !’, అంది వెంటనే సుజన్  కి బుర్రలో కొశ్చన్ మార్క్ కనపడింది,  అదే అడిగాడు.
“ ఇంతకీ ఎవడు వాడు? ఎచటి వాడు ? నీకు లిఫ్టు ఇచ్చినోడు?” అన్నాడు పాట లాగా సన్నగా పాడుతూ. “ఏంటి? నీకు చెప్పాలా? అవసరమా?” అంది సంజు.
“అవును నాకు అడిగే హక్కుంది, రోజు తీస్కేళ్తున్నాను గా కాలేజీకి  బైక్ మీద. ఏమో రేపు ఖర్మ గాలి నిన్ను పెళ్లి చేసుకుంటే ఈ బాధ పెర్మనెంట్ గా నాకు తప్పదు కదా? (బైక్ మీద తిప్పటం). “
“ఏంటి ? ఆపాపు అక్కడే  ఎవరు చెప్పారు బాబు అలా ఆశలేమీ పెట్టుకోకు. నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. అవన్నీ సరి తూగే వాణ్ణే చేస్కుంటా అంది సంజు.
“ఓయబ్బో!  అంత  సీనా? నాకేంతుందో తెల్సా? నేను ఊ అనాలే గానీ వాకిట్లో మీ అమ్మాయిలంతా  లైన్ కట్టరూ? విషయానికి రా,” అన్నాడు సుజన్.
“అంటే! నీక్కూడా?  మనం పెళ్లి చేసుకోవటం యిష్టం లేదా?” ఎగిరి గంతెసినట్టయ్యింది సంజు కి.
“అవునని వేరే చెప్పాలా?  ఏదో ఇప్పుడు అమ్మ నాన్నలు అలా అనుకుంటున్నారు. అనవసరంగా వాళ్ళని ఇప్పుడే బాధ పెట్టడం దేనికని మౌనంగా ఉన్నాను. టైం ఒచ్చినప్పుడు చెప్తాములే,” అన్నాడు సుజన్. అయితే ముందు నువ్వు చెప్పు,  నీ ప్రేమ గురించి. ఆ లిఫ్ట్ ఇవ్వటం గురించి. మంచోడో కాదో నేను చెప్తా అన్నాడు సుజన్.
"ఓయ్..  నేను వచ్చింది ఆటో ఎక్కి. లిఫ్ట్  అని ఉత్తిగా చెప్పాను "
“అబ్భ తెలుసు లేవే? నీ ముఖానికి అబద్ధం అతకదు కానీ నీ .... ఎల్  గురించి నేనడిగేది,” అన్నాడు
తను రంజిత్ అనీ, చాల మంచి వాడు. చదువులో నెంబర్1. నాకు ఏదైనా అర్ధం కాకుంటే సాయం చేస్తుంటాడు అతనికి ఇంకా  తెలీదు కానీ, అతనంటే  యిష్టం. అతని నోట్స్ చూడగానే చదవాలనిపిస్తుంది.  సర్సరే ! మరి నీ సంగతి చెప్పు?”  అంది  సంజన.
“హుమ్మ్... మా పరిచయం భలే గమ్మత్తుగా జరిగింది. ఒకరోజు బస్ లు, బళ్ళు ఆపి చెక్ చేస్తున్నారు పోలీస్ లు. అక్కడ నా బైక్ , నా ప్రక్కన ఉన్న కైనటిక్ అమ్మాయిని కూడా ఆపి, చెక్  చేసి, 100  రు. లు చలాన్ రాసాడు. దేనికో ఆ అమ్మాయి  పర్స్ మర్చిపోయిందట. చెప్తే వినరు. వెంటనే నా పర్స్ నుండి ఓ వంద ఆమె కిచ్చి కట్టించాను, దాంతో వదిలారు వాళ్ళు . ఆమె ఎన్నో సార్లు కృతఙ్ఞతలు చెప్తూనే ఉంది.  రజని అట తన పేరు.  ఆ ప్రక్కనే ఓ చిన్న టీ పాయింట్  ఉంటే ,అక్కడికెళ్ళి టీ స్నాక్స్ తీసుకున్నాము. పరధ్యానంలో ఆమె టీ ఒలికిపోయింది. వెంటనే సిగ్గుతో తన డ్రెస్ మీద పడ్డ టీ ఎలా క్లీన్ చేయాలో తెలీక, దిక్కులు చూస్తూ అమ్మాయి తికమక పడుతుంటే, మళ్లీ నేనే అలెర్ట్ అయ్యి నా స్వెటర్ ఇచ్చాను. ఆ అమ్మాయిది ప్రక్క కాలేజీ అట. కానీ బండి నడిపే పిల్ల ఇంత బేలగా ఉంటుందనుకోలేదు సుమా! రేపే మీ డబ్బులిచ్చేస్తా నండీ ! అంటూ బయటకో చ్చాక , స్వెటర్ తీసిచ్చి, థాంక్స్ చెప్పి బండి  స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. తను అన్నట్టు గానే నెక్స్ట్ డే 100 రు . ల నోట్ పట్టుకుని, తన కాలేజీ ముందు నిల్చుని ఉంది. తప్పుతుందా? తిరిగి తీసుకున్నాను. అప్పటి నుండి నేనంటే ఆమెకు ప్రేమతో కూడిన గౌరవం. ప్రేమించటం కన్నా ప్రేమించబడటం లోనే ఎంతో సంతోషం ఉందని నాకు అప్పుడే తెలిసింది”, అన్న సుజన్ మనో నేత్రంలో రజని కనబడుతూనే ఉంది.
సంజన ఏదో చెప్ప బోయెంతలో  యింట్లో నుండి కేక వినబడ్డది ,”ఒరేయ్ సుజను !” అంటూ.  “ వస్తున్నా డాడీ”, అంటూ గబా గబా మెట్లు దిగి వెళ్ళాడు సుజన్, సంజుకు బై చెప్పి. రంజిత్ ఉహల్లో పడిపోయింది సంజు . మరో 5 నిమిషాల్లో ఇహ లోకం లో కొచ్చి తన యింట్లో కెళ్ళింది.
*****
మర్నాడు ఎప్పటిలా సుజన్ హారన్ ఇవ్వగానే సంజన బాగ్ తీసుకుని కాలేజీకి బయలుదేరింది. సంజన వాళ్ళమ్మ ఆ జంటను  కనులార చూసి  ఆనందించింది.
ఆ సాయంత్రం మామూలుగా ఇద్దరు కలిసి యింటికోచ్చేసారు.  మళ్ళీ రాత్రి భోజనాలు అయ్యాక డాబా మీద కెళ్ళి ,సుజన్ సంజనకు మెసేజ్ ఇచ్చాడు. సుజన్ కి  సంజన గురించే అంతా టెన్షన్. మంచి అబ్బాయి దొరికినట్టేనా అని. నిన్నటి నుండి అదే ఆలోచిస్తున్నాడు. కాస్త సమయం తీసుకుని  సంజన రానే వచ్చింది. “సంజనా ఇంకా సస్పెన్స్ భరించలేను. ఇంతకీ రంజిత్ మంచి వాడేనా? “,అని అడుగుతున్న సుజన్ ని చూసి పక పకా నవ్వి,  “నీ ఉత్కంఠ బాగానే ఉంది, చెప్తాగా! “ అంటూ సంజన  చెప్ప సాగింది...
ఒకరోజు  ఎంతకూ అర్ధం కాని సబ్జెక్ట్ తో ,తల పట్టుకు కూర్చుంటే  ఎప్పట్లా అందరికి ప్రొబ్లెమ్స్ సాల్వ్ చేసే రంజిత్ "ఎస్" అంటూ తన  ప్రక్కనే కూచున్నాడు. ఎక్కడ అర్ధం కాలేదు మీకు? సంజన మైమరచి తన బుక్ ఇచ్చేసింది అతనికి. “సంజన గారు! పుస్తకం ఇచ్చెశారేమిటి? ఎక్కడ అర్ధం కాలేదో అడగండి చెబుతాను!”, అంటూ అతను అడుగుతుంటే ఇహ లోకంలోకి   వచ్చిపడింది. తానడిగిన ప్రశ్నలకు యిట్టే సొల్యుషన్ చెప్పగా ,ఎంతో అర్ధమయి నట్లు అయి, ఆ ఎక్ష్ప్లైనింగ్ పవర్ కి మనసు లోనే ఆనంద పడుతూ,  ఆ సబ్జెక్ట్ చాల ఈజీ గా అనిపించింది. ఎగ్జామ్స్ లో ఇష్టపడి ఆ సబ్జెక్ట్  శ్రద్ధగా చదివి పరీక్ష వ్రాసింది కదూ!! తాను  ఎక్ష్పెక్త్ చేయనంత పర్సెంటేజ్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తూ తానె బెస్ట్ అనిపించుకుంది.
“సంజనా! కంగ్రాట్స్ అంటున్న రంజిత్ కి ఎలా థాంక్స్ చెప్పాలో  తెలియట్లేదు సంజనకి. “థాంక్ యు ! నేను మీకు రుణ పడి ఉన్నాను.  సబ్జెక్ట్ లో ఫెయిల్ అవుతానేమో, అని సందేహంగా ఉన్న నన్ను నమ్మలేనంత గా మొదటి స్థానంలో నిలబెట్టారు. మీతో బాటుగా! అయినా అడుగుతున్నాను, మీకు ఏమి పార్టీ కావాలన్నా ఇస్తాను  చెప్పండి ! “, అంది సంజన.
“మీరే మా యింటికి రండి,  వేరేక్కడో పార్టీ లెందుకు?” అన్నాడు రంజిత్.
అతనితో మొట్ట  మొదటిసారి  ఇలా వెళ్ళటం ఏదో కొత్త గా అనిపించింది సంజనకి. అతనిలోని హుందాతనం ఫస్ట్ టైం చూసినప్పుడే, తనని కట్టిపడేసింది.ఇతరులకు సాయంచేసే అతని గుణం,  తన మనసులో   అత్యున్నత స్థానంలో, అతన్ని కూచోబెట్టింది.  ఇప్పుడు అతను చూపించే గౌరవంతో మరింతగా ఉత్సాహం కలుగుతున్నది. అతని ప్రవర్తన లోనే కాదు, నడక లోనూ రాచఠీవి  కనబడుతున్నది,  సంజనకు.
యింటిలోకి అడుగు పెట్టగానే రంజిత్ చెప్పినట్లు, వాళ్ళమ్మ తమ కోసం ఎదురు చూస్తూ, వాకిట్లో నిలబడ లేదు???? అదేమిటి? అనుకుంటున్న సంజు వాకిట్లోనే ఆగిపోయింది. రండి అమ్మకు  మిమల్ని తీసుకొస్తానని చెప్పాగా? ఎదురు  చూస్తుంటుంది, అంటూ లోనికి దారి తీసాడు.  వెనకాలే  వెళ్ళిన  సంజన కు కుర్చీలో మనిషి కనబడ లేదు ? ఏమిటా ? అనుకునేంతలో, అటు వైపుగా బెడ్ మీద పడుకుని ఇటే  చూస్తూ ‘రామ్మా!’, అందావిడ. అవును రంజిత్ వాళ్ళ అమ్మ గారు! ఏంటిది? రంజిత్ ఎప్పుడు చెప్పలేదే? వాళ్ళమ్మ గారికి ఈ ప్రాబ్లం ఉందని? అనుకుంటూ సంజన వెంటనే  మంచం దగ్గరగా వచ్చి నిలబడ్డది,   ఆంటీ అంటూ.
“రంజిత్ చెప్పాడమ్మా,  నీ గురించి. రా, ఇలా కూర్చో!” అంది ప్రక్కకు కాస్త ఇబ్బందిగా జరిగి పడుకుని. ఆ కాస్త జాగాలోనే కూర్చుంది సంజన.  “ఆంటీ! మీకూ..... “, అంది. రంజిత్ వచ్చి చెప్పాడు, 5 సంవత్సరాల క్రితం అమ్మకు వెన్ను నొప్పి భరించలేనంతగా వచ్చినప్పుడు న్యురోలోజిస్ట్ కి చూపించగా, తేలిన నిజం  ఆమె కు వెన్నులోని  నెర్వస్ సిస్టం అంతా డౌన్ అయ్యిందని. ఈ స్థితిలో  ట్రీట్మెంట్ మొదలెట్టినా, పెద్దగా ఫలితం ఉండదని. అయినా డాక్టర్ ఇచ్చిన మందులను వాడటం మొదలెట్టింది.  కానీ ఇప్పటి దాకా ఏ మార్పు రాలేదు. ఎప్పటి నుండో మొదలైన వ్యాధి కదా. మంచం పై అధిక శాతం ఉండాల్సి వస్తుంది.
ఇది వినగానే సంజన కు చాల బాధ కలిగింది.  ‘మరి వంట ఎలా?’  మళ్ళీ అడిగింది.
‘ఎంతో రుచిగా వంట వండే తనకు  అలా అవ్వగానే రంజిత్  వాళ్ళ నాన్న తట్టుకోలేక, ఆర్నెల్లలో హార్ట్ అట్టాక్ తో  లోకం విడిచి వెళ్లి పోయారు. అప్పటినుండీ  అన్నీ తనే  చూస్తూ, ఈ  అమ్మను కంటికి రెప్పలా కాపాడుతున్నాడమ్మా !’, అంటూ కళ్ళు వత్తుకుంది.
‘ఆంటీ! ‘, సంజన వెంటనే ఆమె కళ్ళు తుడిచి ‘ఛ ఛ!! ఆంటీ మీరలా కన్నీరు పెట్టకూడదు. ఇలా అయితే రంజిత్ గారికేలా అనిపిస్తుంది? అతనికి మీరే బలం,’  అంది.
‘అదేనమ్మా, నేనున్నన్నాళ్ళు నా సేవ చేస్తూ పొతే వీడి బ్రతుక్కి ఓ మార్గం ఉండాలి కదమ్మా! వీడి అచ్చటా ముచ్చటా నేను చుడాలనుకోవటం తప్పా? నా బాధంతా అదే!  వీడిని బయట చూసిన వాళ్ళు అసలు వీడు ఇన్ని ఆడపనులు చేస్తాడని అనుకోరు. కమ్మగా వంట వండుతాడు. యింటి పనులన్నీ చక చకా చేస్తుంటే ఒక్కోసారి అనిపిస్తుంది, అమ్మాయిలు కూడా యిలా చేయరేమో అని,’ ఈ మాట అంటున్నప్పుడు ఆమె మోము లో చిరునవ్వు విరిసింది ఎంతటి లక్ష్మీ కళ ఆమెది? అనుకుంది సంజన.
‘మళ్ళీ కాలేజీకు టైంకు వెళ్లి అన్నీ పిరియడ్ లు  అటెండ్ అయ్యి, లెక్చరర్లందరికి తలలో నాలుకలా ప్రవర్తిస్తూ,  కో స్టూడెంట్ లకు బాగా చదవటంలో తర్ఫీదు ఇస్తాడు కూడా. అలా లైఫ్ ని బిజీ చేసుకుంటాడు బాధని మరిచిపోవటానికి...’ అమ్మ మాటలకు అడ్దోస్తూ అన్నాడు రంజిత్, వాటర్ తెచ్చిస్తూ !
‘అమ్మా! ఇప్పుడివన్నీ ఎందుకు? సంజనకు ?’
‘చెప్పనీ రా నన్ను .. అంటూ మళ్లీ కొనసాగించింది ఆంటీ.. నాకు కాలక్షేపానికి టీవీ , న్యూస్ పేపర్ లు మగజైన్ లే కాదు,  కంప్యుటర్ లాప్టాప్ లు కూడా ఏర్పాటు చేసి మరీ, జాగ్రత్తగా చూసుకుంటాడు. గంట గంట కు ఫోన్ చేసి. ‘ అన్నం తిన్నానా? టీ తాగానా? పనమ్మాయి అన్నీ సమకూర్చిందా లేదా,’ అని కనుక్కుంటాడు. ఏమి చెప్పాలి లేమ్మా? తల్లిగా నేను అనకూడదు కానీ, రామాయణం చదివిన నాకు వీడే రాముడిలా కనిపిస్తాడమ్మా,’ అంటూ మరొక మారు కళ్ళు ఒత్తుకుంది ఆంటీ.  సంజన మనసు కరిగిపోయింది అక్కడి వరకు సుజన్ కు చెప్పి ఆగింది సంజన. సుజన్ పూర్తిగా తను చెప్పే విషయంపైనే లీనమయ్యి వింటున్నాడు. సడన్ గా ఆపేసరికి "సంజన! ఏం ఆపేసావు ? చెప్పు సంజన? నాముందు సంకోచిస్తున్నావా?” అంటూ అడిగాడు.
 అతని వైపోసారి చూసింది.  అతని ముఖంలో ఎటువంటి ఆందోళన లేదు. కానీ ప్రేమతో కూడిన ఆత్రుతను గమనించింది. తన శ్రేయోభిలాషిగా కనిపించాడు. అప్పుడు చెప్పింది సంజన, రంజిత్ వాళ్ళమ్మ కళ్ళు తుడుస్తుండగా అతని వెనుకే ఆంటీని చూస్తూ నించుంది సంజన.  ఆంటీయే  రంజిత్ వద్దని సైగ చేస్తున్నా ఇలా చెప్పింది.
“ అమ్మా! సంజన! ఇప్పుడు రంజిత్ కి తల్లీ దండ్రీ నేనే!  ఇంకా కాలం  వృధా చెయ్య దలచుకోలేదు. తొందరలో వీణ్ణి ఓ యింటి వాణ్ని చెయ్యాలని ఉంది. వీడికి అన్నివిధాల  అనుకూల వతి  అయిన అమ్మాయి కోసం దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను రోజూ. ఎన్నడూ ,ఏ అమ్మాయి గురించి ఆలోచించని వీడు,  నిన్న నీ గురించి చెప్పాడు. వీడి నోట ఒక అమ్మాయి పేరు వినబడినందుకు నేను, ఆ దేవునికి మొక్కుకున్నాను. నిన్ను ఓ సారి యింటికి  తీసుకురమ్మన్నాను. అదేంటో !! నిన్ను చూడగానే నా కోడలు  నువ్వైతే బాగుంటుందని మనసులో అనిపించింది. ఇంకా ఈ విషయం వీడికి చెప్పనే లేదు నేను. ఇంతలో రంజిత్ అడ్డోచ్చాడు అమ్మ మాటలకు... " అమ్మ! ఏంటిది? ఇలా రంజనిని ఇబ్బంది పెడతావంటే  అసలు తీసుకొచ్చే వాణ్ణే కాదు " చాల ఇబ్బందిగా ఫీల్ అవుతూ అన్నాడు రంజిత్.
“నన్ను ఆపద్దురా ఈ వేళ,, ఎన్నో రోజుల నుండీ నాలో రగులుతున్న బాధ చెప్పుకునేందుకు ఓ తోడు దొరికింది. చెప్పుకోనీ !!”, అంటూ మళ్లీ చెప్పడం మొదలు పెట్టింది. “నా కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి ,సర్వస్వం నా సేవకే అంకితం చేసుకోవటానికి సిద్ధ పడి, పెళ్ళే వద్దన్నాడు.  వీడి నాన్న గారి ఆశయం...   వీడికి కల్యాణం చేసి ఆస్తినంతా అప్పజెప్పి విశ్రాంతి తీసుకుందామనే. అలాంటిది  యిలా అయ్యిందిప్పుడు. అన్నీ ఆలోచించాను, అందుకే వీడిని పెళ్లి చేసుకుని, నాకు సంతోషం కలిగించాలని బలవంత పెడుతున్నాను . చివరకు ఎలా ఒప్పించాలో కూడా నాకు తెలియట్లేదు,” అంది. రంజిత్ ముఖం చూస్తున్న సంజనకు ఇక తను  ఆలస్యం చేస్తే బాగుండదనిపించింది. ఇన్నాళ్ళు తాను రంజిత్ పట్ల మనసులోనే కురిపిస్తున్న మూగ ప్రేమ ను వెల్లడించాల్సిన సమయం ఆసన్నమైనదని అంతరాత్మ చెప్తున్నది. సంజన ఆమె చేతిని  తన చేతిలోనికి తీసుకుని "ఆంటీ! " అంది.  అలా అంటున్న సంజన ముఖం సిగ్గుతో ఎర్ర బడటం చూసి ఆంటీకి అర్ధమయ్యి, ఆ చేతిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. మరొకవైపు రంజిత్ కి ఏమీ అర్ధం కాలేదు ??  ఇంకా అలా సంజననే చూస్తున్న రంజిత్  కళ్ళు, ఆశ్చర్యం తో పెద్దవయ్యాయి.
“ఏంటమ్మా? ఇది?  ఏంటి సంజనా? నాకేమీ అర్ధం కావట్లేదు? అసలు నువ్వేమైనా ఆలోచించావా? ఏమి మాట్లాడుతున్నావో?” అన్నాడు కాస్త పెద్ద స్వరంతో.
అవును ఆలోచించే నా నిర్ణయం చెప్పాను  ఆంటీకి. చప్పున తలదించుకుంటూ, అంది సంజన.
“అది కాదు సంజనా ఇది చాల పెద్ద విషయం. ఒక ఆడ పిల్ల అలా స్వతంత్రంగా చేసే నిర్ణయం కాదిది. పెద్దలున్నారు, మీ వైపు అమ్మ, నాన్నలు. వాళ్ళకు చెప్పకుండా నీవు నిర్ణయం చేయకూడదు, చాల తప్పు.” అన్నాడు రంజిత్. ఇక ఆపైన ఏమి మాట్లాడాలో తెలియట్లేదు అతనికి కూడా.
“రంజిత్ ! మా అమ్మ నాన్నలు నన్ను ఎంతో స్వేచ్చగా పెంచారు.  నా నిర్ణయం నేను చేసుకునేంత .. వాళ్ళకు తెలిస్తే ఇంకా సంతోషిస్తారు  తప్ప, నన్నేమీ అనరు,” అంది సంజన కాన్ఫిడెంట్ గా.
“సంతోషం తల్లీ ! ఓ అమ్మ మనసును అర్ధం చేసుకున్నావు. ఈ శుభవార్త ను తొందరగా శుభ ఘడియలుగా మార్చండి,” అంటున్న అమ్మ కళ్ళలో మెరుపును చాల కాలం తర్వాత చూస్తున్నాడు రంజిత్. ఏమీ పాలు పోవటం లేదు రంజిత్ కు ?? ఇంతలో ,’భోజనం రెడీ అమ్మ గోరూ!’, అన్న వంట మనిషి పిలుపుతో  సంజన కూల్ గా గది ఇవతలకు వచ్చింది. మరో నిముషంలో కిచెన్  లో డైనింగ్  టేబుల్ వద్ద షడ్రసోపేతమైన భోజనం వడ్డించిన విస్తర్లలోని  వంటకాలు నోరూరిస్తూ కనిపించాయి. ఓ ప్రక్క వంటమనిషి పాత్రలు అందిస్తుంటే,  అందులోని పదార్ధాలు  రంజిత్ సంజును  అడిగి వడ్డిస్తున్నాడు. ఇద్దరూ భొంచేస్తున్నంత సేపూ  మాట్లాడలేదు. ఒకరికి మనసులో సిగ్గు, మరొకరికి మదిలో  ఆలోచనాతరంగాలు. కమ్మటి భోజనం ముగించారిద్దరూ.
చేయి కడుక్కుంటూ, ‘వంటలెలా ఉన్నాయి సంజన?’  అందులో పదార్ధాలన్నీ నేనే స్వయంగా చేశాను. ఫినిషింగ్ టచ్ మటుకు మా పద్మమ్మదే !’ అంటూ మెయిడ్ గురించి  కూడా అందంగా చెప్పటం చూసి సంజన  నవ్వాపుకోలేకపోయింది. జవాబు దొరికించుకున్నాడు రంజిత్ అందులోనే..
‘మరి వెళ్ళొస్తా ఆంటీ ! చాల కమ్మటి భోజనం చేసాను’, అంటున్న సంజనతో ‘నాకు అంతకన్నా తీపి కబురు తో చెవుల్లో అమృతం పోసావు తల్లీ’, అంది ఆంటీ. ఏదో కొత్త హుషారు వచ్చినట్లైంది రంజిత్ కు. ‘ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంబరం,’ అనే పాట ఎక్కడి నుండో సన్నగా రేడియో లో వినబడుతుంది. స్వయం వరం సంజనది. సర్ప్రైజ్ మాత్రం తనదే, అనుకున్నాడు. రంజిత్ సంజనను వాళ్ళింటి మలుపు దాకా డ్రాప్ చేశాడు. ఈ వేళ రంజిత్  తన మనసుకి  కొత్తగా కనిపిస్తున్నాడు.  అతని ముఖంలో కొత్త వెలుగు కనిపిస్తోంది. హుషారైన వదనంతో  గేటు తీసుకుని లోనికి వస్తున్న సంజనని మేడ పై నుండి చూసాడు సుజన్. ఏంటీ హుషారు? అని ఎస్సెమ్మెస్  పంపాడు. చెప్తాగా, అంటూ స్మైలీ ఆడ్ చేసి రిప్లై పంపింది సంజన.
క్యూరియాసిటీ పెరిగి పోయింది సుజన్ కి  తానూ  ఓ స్మైలీ పంపాడు.  ఫ్రెండ్స్ తో పార్టీ అటెండ్ చేసినందుకు అన్నం వద్దని చెప్పి సంజన డాబా పైకి వచ్చింది. 10 నిముషాల్లో వచ్చేసాడు ," సంజనా! ఆట్టే ఊరించక  త్వరగా చెప్పు నీ లవ్ స్టొరీ ..” అన్నాడు.  ‘అంత ఇంటరెస్టింగ్ ఆ ? ఛా! ‘అంది సంజన.
“‘రంజిత్ ఏమంటాడు? నువ్వు ఎంత బాగున్నావో వర్ణించాడా? నువ్వు అతనికి దొరకటం తన అదృష్టమన్నా డా? నువ్వే నా ఇలియానా అన్నాడా లేక అనుష్క? సమంతా? పోనీ తనకిష్టమైన హీరోయిన్ అన్నాడా?"  సంజన చెప్పేది వినిపించుకోకుండా, వాక్బాణాలు సంధిస్తూనే ఉన్నాడు సుజన్.
 " ఆపుతావా? నీకు సినిమా వాళ్ళే అల్టిమేటా? రంజిత్ అవేవీ అనలేదు ఓకే నా ?” అంది.
 “అదేంటే అలా అనేసావు? నాకు రంజిత్ మీద పక్కా డౌటే నే.. నీరు గార్చే మాటలంటున్నాడు. హాస్యానికి  "పోరా !  అందరు  నీ లానే ఉంటారనుకున్నావా? రంజిత్ జెంటిల్మన్ తెలుసా" అంది.
“ ఓహో! అర్జున్ నటించిన మూవీ.. అలా ఉంటాడన్న మాట  వ్యవహారంలో”,  అన్నాడు సుజన్, ఆమెను ఉడికిస్తూ.
‘మహా ప్రభో ! జెంటిల్మాన్, సూపర్ మాన్  సినిమాలు కాదు నే చెప్పింది.  హి ఈస్ మోస్ట్ డిగ్ని ఫైడ్ అండ్ ఇంట్రోవెర్ట్!’ ఆశ్చర్యం గా చూసాడు సుజన్.
“అవున్రా అసలు మగాళ్ళ లో ఓ 10% మాత్రమె ఇలా ఉంటారు. మిగతా 90%  వాళ్ళు అమ్మాయి వెళ్తుంటే చాలు వెనకాలే వెళ్లి  గుడ్లప్పగించి చూస్తారు గమనిస్తారు. వెంట పడతారు, టీజ్ చేస్తారు. కొందరు  ఉడికించేలా  ఏవో పేలుతూ ఉంటారు, మహా ముదుర్లు. అసలు అమ్మాయిలను ఇంప్రెస్స్ చేయాలంటే ఒక్కడికి తెలిసి చావదు  కానీ పై ట్రయల్స్ అన్నీ వృధానే  తెల్సారా?” సీరియస్ గా లెక్చర్ ఇవ్వసాగింది సంజన.
“అమ్మా! తల్లీ! నోర్ముయవే! నోటి ముత్యాల్ జార్నీయకే ... అంటూ పవన్ కల్యాణ్ పాట పాడసాగాడు సుజన్. “సర్సరే తల్లీ ! నువ్వు నేను ఎక్ష్పెక్ట్ చేసినప్పుడే చెప్పి ఉంటే నాకింత అలసట ఉండేది కాదు,”  వగరుస్తూ నేల పై కూర్చున్నాడు సుజన్.
“అలా రా దారికి.  ఇప్పుడు బుద్దిగా కూచున్నావు.  ఇలాంటప్పుడే చెప్తే బాగుంటుంది.  అంటూ అటు వైపు తిరిగింది సంజన. విన్నావుగా,  రంజిత్ నువ్వూహించినంత ఫాస్ట్ గా ఏదీ చెప్పడు.  ఆంటీని చూసాక అర్ధమైంది నాకు.  అందుకే మన పరీక్షలయ్యాక వివాహం చేసుకోవాలనుకుంటున్నాను  రంజిత్ ని. కానీ అమ్మ నాన్నలకు  ఎలా చెప్పాలో తెలియట్లేదు సుజన్! అంది.
“ ఏయ్ ! నువ్వు నన్ను అర్ధం చేసుకుంది ఇంతేనా? ఇక అవన్నీ నాకొదిలెయ్.  నువ్వు నిశ్చింతగా ఉండు.  ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్  ఇస్ ఎ ఫ్రెండ్ ఇండీడ్ అన్నారు.  సరేనా, నీ బెస్ట్ ఫ్రెండ్ గా మీ పెళ్లి దగ్గరుండి జరిపించే బాధ్యత నాది,  సరేనా ?” అంటున్న సుజన్ కు బయట ఏదో అలికిడి అయినట్లు అనిపించింది. అటు వైపు తిరిగి చూసే సరికి సంజన వాళ్ళమ్మ రెండు మెట్ల మీదుగా కిందకి జారి పడింది ‘అబ్బ! అని చిన్నగా మూల్గుతూ ..’ ఆంటీ!!  పొలికేక వేసి సుజన్ ఒక్క ఉదుటున ఆమెను పట్టుకు లేపి,  ఒక మెట్టు పై కూచో బెట్టాడు.
“అమ్మా! ఏమైంది?”,  అని ఆత్రుతగా అడిగింది తన భుజం పై ఆమె తల ఆనించి  సంజన.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages