ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA)
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) వారు సంఘటితంగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వారి గురించి మాకు అందినంతవరకు సమాచారం...
తానా ను ఎప్పుడు ప్రారంభించారు ? మొదట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు ?
తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) 1977 లో స్తాపించడం జరిగింది. ఇది, అమెరికాలోని భారతీయ సంఘాల్లో అన్నిటిలోకి మొట్టమొదటీ అసోసియేషన్ మరియు అతి పెద్దది కూడా. గత నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగువారికి సేవలు అందిస్తున్నాము.
దీన్ని స్థాపించినప్పుడు మీ మనోభావాలు/లక్ష్యాలు ఏమిటి ?
తానా స్థాపించినప్పుడు, మా ముఖ్య ఉద్దేశం అమెరికాలో స్థిరపడ్డ, అమెరికాలో ఉన్న తెలుగుజాతి వారి సాంఘీక, సాంస్కృతిక మరియు విద్యా అవసరాలను గుర్తించి, వాటి కోసం కృషి చేయడం. ఇందులో భాగంగా తానా 'టీం స్క్వేర్' ను స్థాపించింది. ఇందులో 125 ఉత్తర అమెరికా పట్టణాల్లో స్వచ్చందంగా పనిచేసే 200 మంది వాలంటీర్ లు విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న తెలుగువారికి సహాయపడుతూ ఉంటారు.
3. ఈ తానా ద్వారా మీరు మొదట్లో చేపట్టిన కార్యక్రమాలు ఏమిటి ?
మేము తానా లో చేపట్టే కార్యక్రమాలు అన్ని, అమెరికా లో స్థిరపడ్డ తెలుగు వారి తో కలసి మన తెలుగు సంస్కృతిని, తెలుగు భాషని తెలుగు వారికి సంబంధించిన కళలని కాపాడి, అభివృద్ధి చేసి,ఇక్కడి వారి తెలుగుతనాన్ని పెంపొందించాలన్న ఉద్దేశం తో ఉంటాయి. ఈ దిశలో, మేము రెండు సంవత్సరాలకి ఒక సారి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపడతాము. అది ఇక్కడ స్థిరపడ్డ తెలుగు వారి మధ్య బంధాన్ని మరింత పెంచి మన సంస్కృతిని బలపరిచేందుకు దోహదపడుతుంది.
4. దీనికి ప్రవాసీయుల నుంచి, విదేశీయుల నుంచి లభించిన స్పందన ఎలా ఉంది ?
మేము చేసే కార్యక్రమాలకి, తెలుగు వారి కోసం మేము చేసే కృషికి, తానాకు నార్త్ అమెరికా లోనే కాక ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇవాళ, తానా సంస్థ, అమెరికా లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల లోను ఉన్న తెలుగు మరియు భారతీయ అసోసియేషన్లకు ఒక ప్రామాణికమైన సంస్థగా వెలిసింది అని చెప్పవచ్చు.
5. ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలియచేస్తారా...
మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ప్రస్తుతం మా ప్రెసిడెంట్ నన్నపనేని మోహన్ గారి ఆధ్వర్యంలో, మిగిలిన నలుగురు అధ్యక్షులైన నాదెళ్ళ గంగాధర్, చలసాని మల్లిఖార్జునరావు , కోమటి జయరాం, కాకర్ల ప్రభాకర్ చౌదరి గార్ల ఆధ్వర్యంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రామాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా చెపుకోదగ్గవి. ఇక్కడ స్థిరపడ్డ వారిలో, తెలుగు సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యం లో భాగంగా మేము ఎంతోమంది పేరెన్నికగన్న తెలుగు గాయకులను, నాట్యకళాకారులను, సంగీత కళాకారులను, సినీ మరియు రంగస్థల కళాకారులను, కవులను, చిత్రకారులను ఇక్కడకి ఆహ్వానించి, వారి కళాలను ఇక్కడవారికి పరిచయం చేసి, వారిని సత్కరిస్తూ ఉంటాము. ఇక్కడ ఉన్న తెలుగు యువకుల కోసం మేము పాటల మరియు నృత్య పోటీలు జరిపి, వరి కళాలను ప్రదర్శించేందుకు అవకాశం ఇస్తుంటాము, మరుగున పడుతున్న మన జానపద కళలను అభివృద్ధి పరచడానికి, గత 15 ఏళ్ళగా తానా సౌజన్యంతో జరుగుతున్న తెలుగు జానపద కళా ఉత్సవాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వివిధ రంగాల్లో పేరుతెచ్చుకున్న ఎంతోమంది తెలుగువారిని తానా ప్రతిభా పురస్కారాలు మరియు జీవిత సాఫల్య పురస్కారలతో సత్కరిస్తూ ఉంటుంది. అవసరమైన తెలుగు విద్యార్ధులకు ఉపకారవేతనాలు చెల్లించడం, ఇంకా ఇక్కడి కొన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాష శిఖ్షణా తరగతులు నిర్వహించడంలో తాన కృషి చేసింది తానా వారు సేవా దృక్పదం తో నెలకొల్పిన తానా ఫౌండేషన్ మన రాష్ట్రం లో జరిగే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు విరివిగా విరాళాలు ఇస్తూ ఉంటుంది. తాజాగా గోదావరి ఒడ్డున బాపు గారి విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రవాసీయులకు ఆయనపట్ల ఉన్న ప్రేమకు శాశ్వత నీరాజనం పట్టింది తానా. అంతేకాక, తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నాయి. అంతే కాకుండా, అమెరికాలోనే కాకుండా పలు ప్రాంతాల్లో, ఎన్నో సేవా కర్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది తానా. ఆంధ్రా, తెలంగాణా లోని పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపు లు, ఇతర సేవా కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహిస్తూ ఉంటాము.
6. మీరు ప్రచురించిన పుస్తకాల వివరాలు , అవి కొనుగోలుకు ఎక్కడ అందుబాటులో ఉంటాయో చెబుతారా ?
తానా, తెలుగు ని ప్రోత్సహించే దిశగా, ప్రాచుర్యం పొందిన ఎన్నో తెలుగు ప్రచురణలను ఇక్కడా ప్రచురించి ఇక్కడ స్థిరపడ్డ వారికి అందుబాటుఓ తేవడమే కాకుండ, ఇక్కడివారికి మన తెలుగు కవిత్వం మరియు కన్యాశుల్కం లాంటి ప్రాచుర్యం కలిగిన గ్రంధాల్ని పరిచయం చేయడానికి, వాటిని ఇంగ్లీషులో అనువాదం చేసి ప్రచురించడం జరిగింది. తానా నిర్వహించే కార్యక్రమాల గురించి వివరిస్తూ తానా నుంచి తానా పత్రిక కూడా , ప్రతి నెల వెలువడుతుంది.
7. ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా ? వివరాలు తెలుపగలరు ?(మీ సంస్థకు సంబంధించిన వెబ్ సైటు వివరాలు, యు ట్యూబ్ లింక్ లు ,చిరునామా, ఈమెయిలు, వంటి వివరాలు అందించగలరు)
మా వెబ్సైట్ (www.tana.org) లో మా వివరాలన్ని ఉంటాయి. మమ్మల్ని కాంటాక్ట్చేద్దామనుకున్నవారు, వెబ్సైట్ లో ఉన్న సమాచరంప్రకారంమమ్మల్ని సంప్రదించవచ్చు. ఫేస్ బుక్ ద్వారా మమ్మల్ని సంప్రదించేందుకు క్రింది లింక్ ను దర్శించండి... https://www.facebook.com/pages/TANA-Telugu-Association-of-North-America/148580031842798?sk=timeline
No comments:
Post a Comment