// తెలుగు వెలుగు //
- సంగ్రామ్
తీయ తేనియ లొలుకు మన తెలుగు భాష
తరతరాల నాడె వాసికెక్కిన భాష
ఆదికవి నన్నయ్య తీర్చి దిద్దిన భాష
తిక్కన కందాన విందు చేసిన భాష
శ్రీనాధు సీసాల తీర్ధమాడిన భాష
పోతన్న భక్తిలో ముక్తి పొందిన భాష
రాయల కొలువులో రాణకెక్కిన భాష
మొల్లమ్మ మెచ్చిన ముచ్చటైన భాష
అన్నమయ్య పదములా అందమొలికిన భాష
త్యాగయ్య గానాన పరవశించిన భాష
వేమన్న యోగియై నీతి చెప్పిన భాష
ముద్దుపళని నోట ముద్దులొలికిన భాష
ఆది భట్ల దాసు ఎరుక చేసిన భాష
గురజాడ జాడలో ప్రగతి గాంచిన భాష
విశ్వ నాధుని ఎడద వేయిపడగల భాష
శ్రీ శ్రీ కవితలో కదం త్రొక్కిన భాష
దేశ భాష లందు లెస్సయిన భాష
భాష లందున వెలుగు మన తెలుగు భాష .
No comments:
Post a Comment