ఎటు పోతోంది ఈ జీవితం..
కారుణ్య కాట్రగడ్డ
మానవత్వం మచ్చుకైనా కానరాని అంధకారంలో మగ్గిపోతూ....
సాటి మనిషికి సాయపడలేక స్వార్ధపు మేడల్లో కులాసా కుర్ఛీల్లో కాళ్లూపుతూ......
రేపుంటామో లేదో తెలియని నిన్నల్లో రేపటి కోసం ఆరాటపడుతూ....
కనులముందు కాలిబుగ్గైపోతున్న జీవితాలను చూస్తున్నా......
చలనం లేని నీ మనస్సాక్షికి నీ మనోభావాలకి అద్దం పడుతూ
మళ్ళీ నీకు సన్మానాలు, సత్కారాలు అవార్డులు, రివార్డులు....
కాసింత గంజినీళ్ళిచ్చయినా సాటివాడిని కాపాడలేని నీ గౌరవానికి.....
సిగ్గుపడుతూ సాటి మనిషిగా మళ్ళీ మా కరతాళధ్వనులు.....
మానవత్వం స్వేచ్ఛలను బందీలను చేసి మనసుకు దాస్యత్వం ప్రసాదించిన ఓ మనిషీ.... ఎటు పోతోంది ఈ జీవితం......!!!!!
No comments:
Post a Comment