రారా నా ప్రియతమా !
(విరహోత్కంఠిత భాగేశ్వరి రాగంలో వెళ్ళబోసుకుంటున్న గోడు)
పెయ్యేటి రంగారావు
ప. రారా నా ప్రియతమా !
అ.ప. నా దరహాసపు వాసంతమును - ఇమ్మని వేడితిని
నా పాపిట సిందూరముపై ప్రమాణమిడితిని || రారా ||
నా పాపిట సిందూరముపై ప్రమాణమిడితిని || రారా ||
1. మౌనముగా నేనుండజాలను
మూగవేదనను తెలుపగ లేను
నీ ప్రీతి పాత్రను కాని నాతిని
నాకు నేనే పరాయినైతిని | రారా |
2. జాబిలి అలుగునా పున్నమి పైన
అలుక ఏలరా ఎలనాగ పైన ?
కొడిగట్టిన చిరుదీపము నైతిని
హరివిల్లు దరి అంధురాలిని | రారా |
3. అశృసుమమ్ముల గీతమాలికను
విరహగీతికల రాగమాలికను
శ్రావణమాసపు మేఘమాలికను
నను దహియించెడి కాటికేలికను | రారా |
********************
(కాటికేలిక=కాటికి ఏలిక, తనను దహియించెడి శ్మశానమునకు మహారాణి)
మూగవేదనను తెలుపగ లేను
నీ ప్రీతి పాత్రను కాని నాతిని
నాకు నేనే పరాయినైతిని | రారా |
2. జాబిలి అలుగునా పున్నమి పైన
అలుక ఏలరా ఎలనాగ పైన ?
కొడిగట్టిన చిరుదీపము నైతిని
హరివిల్లు దరి అంధురాలిని | రారా |
3. అశృసుమమ్ముల గీతమాలికను
విరహగీతికల రాగమాలికను
శ్రావణమాసపు మేఘమాలికను
నను దహియించెడి కాటికేలికను | రారా |
********************
(కాటికేలిక=కాటికి ఏలిక, తనను దహియించెడి శ్మశానమునకు మహారాణి)
No comments:
Post a Comment