రుద్రదండం -13
రాజ కార్తీక్
9290523901
(జరిగిన కధ : పార్వతికి తంత్ర విద్య నేర్పుతుండగా ఆమె పరాకును గమనించిన శివుడు, కోపించి, తన చేతిలో ఉన్న రుద్ర దండాన్ని విసిరివేస్తాడు. అది ముక్కలై జంబూద్వీపంలో అనేకచోట్ల పడుతుంది. అవన్నీ దక్కించుకుని, జోడించిన వాడు శివుడే అవుతాడు. రుద్రదండం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు కపాలుడు. కాశీ నగరంలోని శివాలయంలో రుద్రదండాన్ని సాధించబోయే కారణ జన్ముడు పుడతాడు… ఆ సమయంలో అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు ఒక ఒంటి కన్ను రాక్షసుడు… ఆ రాక్షసుడిని బారి నుంచి రాజకుటుంబాన్ని, ప్రజల్ని రక్షిస్తాడు విష్ణునంది అనే ముని. బాలుడికి రుద్రసేన కార్తికేయుడు అని పేరు పెడతారు. అతడు శివపాద మహర్షి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తూ, పెరిగి పెద్దై, అడవిలో రాక్షసుడి బారినుండి పద్మ పట్టణ యువరాణి భావనాదేవి కాపాడతాడు. విద్యాభ్యాసం ముగించుకుని తిరిగి వెళ్తాడు.... ఇక చదవండి...)
ప్రథమ శివ పట్టణం... ఉత్సవాలు జరుగుతున్నాయి. పోటీలు కూడా, అక్కడ ప్రజలు అందరూ ఆ వేడుకలను వీక్షిస్తున్నారు. అక్కడ పాటలు, నృత్యాలు బాగా జరుగుతున్నాయి. ఇక మహారాజు కేశవసేనుడు లేచి “ప్రజలారా, మన రాజ్యంలో ఉత్సవాలు చేసుకోవటం మనకి ఆనవాయితీ. మనకు రక్ష అయిన ఆ పంచముఖ ఆంజనేయుడి జయంతి నేడు. నేడు జరుగుతున్న “ఆయుధపూజ” కార్యక్రమంలో మన రాజ్యంలోని మహావీరులు పోటీలో పాల్గొని, గెలిచిన వారికి, అద్భుతనైపుణ్యం చూపినవారికి ఉన్నత పదవులు ఇచ్చి మన సైన్యం లో చోటు కల్పిస్తాం” అని అన్నాడు. ప్రజలందరూ “తరతరాల ఆనవాయితీ అని అనుకోసాగారు. పోటీలు మొదలైనాయి. గుర్రపుస్వారిలల్లో, కత్తియుద్ధంలో, మల్లయుద్ద్హంలో చాలా మంది నైపుణ్యం చూపించి విజేతలుగా నిలిచారు. ఎక్కడినుండో వచ్చాడు ముసుగువీరుడు. తను అందుకున్న ఒక ఖడ్గాన్ని ఆ వీరుల మధ్యలోకి విసిరేశాడు. అది పోటీకి ఆహ్వానించినట్లు ఉంది, కానీ, ఆ ముసుగువీరుడు గుర్రం మీదనే ఉన్నాడు. అక్కడి అధికారులు “ఓయీ, ఎవరు నీవు, పోటీలో పాల్గొన దలిస్తే ముందు రావాలి, అంతేగాని, పోటీలో విజేతలైన వారి ముందు ఇలా ప్రవర్తించకూడదు, అది రాచరికపు మర్యాదని అగౌరవపరిచినట్లు అవుతుంది.” కానీ వెనక ఉన్న భట్టు “మా ఉద్దేశ్యం అదే, గెలిచినవారిపై గెలిస్తే ఆ గెలుపు శాశ్వతంగా ఉంటుంది. కేశవసేనుడు, చంద్రప్రభ దేవి, సైనికాధికారులు, ప్రజలు ఉత్కంఠగా చూస్తున్నారు. కానీ ముసుగువీరుడి గుర్రం ముందుకు దూకుతుంది. భట్టు మహారాజా, విజేతలను ఓడించకూడదా, మాకు కావలసింది పదవి, బహుమతి, ధనం కాదు గౌరవం మాత్రమే.” కేశవసేనుడు “కానిమ్ము” అని సంజ్ఞ చేశారు. మొదటిగా మల్లయుద్ధపు యోధులు వచ్చారు. వారిని విచిత్రమైన పట్టుపట్టి మట్టి కరిపించాడు ముసుగువీరుడు. కట్టియుద్ధంలో వారిని కూడా చిత్తు చేశాడు ముసుగువీరుడు. అక్కడ గుసగుసలు ఎక్కువయ్యాయి. రాజువదనం నిరాశతో ఉంది. “ఎవరీ యోధుడు “ అని ఆలోచనలో పడ్డాడు. “తమ రాజ్యవీరులు ఈ రకంగా చిత్తు అవుతారని ఊహించలా?’ కేశవసేనుడు తన కత్తిని తీసుకొని వెళుతుండగా, ఇంతలో వచ్చాడు విష్ణునంది. రాజు, రాణి ఆశ్చర్యపడ్డారు. ఎప్పుడో వెళ్ళిన విష్ణునంది ఇప్పుడు రావడం ఏమిటి అని”. విష్ణునంది ఖడ్గాన్ని తీసుకొని ముసుగువీరుడి తో పోరాడుతున్నాడు. విష్ణునంది “మహారాణి ఏమైంది” అని కేకవేశాడు. అంతే ఆ ముసుగువీరుడు వెనక్కి తిరిగాడు. విష్ణునంది ఆ ముసుగువీరుడి కత్తిని ఎగురవేశాడు, అది వెళ్లి అక్కడ ఉన్న పెద్ద పంచముఖహనుమ విగ్రహం ముందు పడింది. అంతే, అందరూ ఆనందపడ్డారు. మొత్తానికి వారి రాజ్య ప్రతినిధే గెలిచాడు. విష్ణునంది “ముసుగువీరుడా, నిజమైన యోధుడి లక్షణం శత్రువు బలం తెలుసుకోవటమే” అన్నాడు. వెంటనే రుద్రుడు తన దగ్గర ఉన్న బాకు తీసుకొని విష్ణునందిపై దాడి చేశాడు. కానీ, ఆ బాకుని తెలివిగా తప్పించాడు విష్ణునంది. ఆ బాకు చూడగానే మహారాజు రాణితో, “ఆ ముసుగువీరుడు” అని ఆనందంతో లేచాడు. విష్ణునంది కత్తితో ముసుగువీరుడి ముసుగుని చింపాడు. అంతే, యువరాజు రుద్రసేన కార్తికేయుడు. రాజు, రాణి ఆనందంగా నిల్చొని, “రమ్ము యువరాజా, నీ విద్యాభ్యాసం అయిపోయినది”అన్నారు ఆప్యాయంగా. ప్రజలందరూ “యువరాజు భలేవాడురా సింహాసనం వారసత్వం, వీరత్వం” అని చెప్పుటకే ఇదంతా చేసి ఉంటాడు. విష్ణునంది “రుద్రసేనా వీరుడవయ్యావు, ప్రథమశివపట్టణ వీరులను ఓడించటం సులభం కాదు” అన్నది. “నేను కూడా వీరుడనే”అన్నాడు రుద్రుడు... విష్ణునంది “తెలుసు రుద్ర నీవని పసిగట్టా, నీవు ఎందుకు నా మీద దాడి చేయలా”, “రుద్రా మీరే గెలిచారు”,.. విష్ణునంది రుద్రుని వాటేసుకున్నాడు. అందరూ
యువరాజు “జయహో” అన్నారు. ఇంతలో పురోహితులు వచ్చి ఆంజనేయపూజ చేయించారు. యువరాజుని రాజు రాణి అందరూ అక్కున చేర్చుకున్నారు. యువరాజు హనుమకి నమస్కరించి “హనుమయ్యా రామనామం చేస్తూ, మమ్మల్ని మరువకయ్యా” అని పాడుతూ, నృత్యము చేసాడు. అందరూ ఉత్సాహవంతులై నృత్యములో పాల్గొన్నారు.
ఇదంతా చూస్తున్నాడు. మార్తాండుడు తన మాయాదర్పణంలో. మార్తాండుడు “డింభకా , ఇక ఆ శివగణాన్ని ఎట్లా నా దారికి తెచ్చుకుంటానో చూడు” అని ఏదోఏదో తంత్రం చేశాడు.
నృత్యం అయిపోయిన తర్వాత భట్టు “మహారాజా యువరాజా రుద్ర నన్ను క్షమించు, నీవు యువరాజువు అని తెలియక నీ చేత ఎన్నో పనులు చేయించాను” అన్నాడు రుద్ర “నేను యువరాజునైనా నీ మిత్రున్ని” అని వాటేసుకున్నాడు”. అందరూ అంతఃపురానికి ఆమడదూరంలోకి వచ్చారు. ఉన్నట్టు ఉండి ఆకాశంలో నుండి ఒక పెద్ద ఒంటికన్ను వచ్చిపడింది. అందరూ బెంబేలు ఎత్తిపోయారు. ఆ ఒంటికన్ను మాట్లాడుతూ “ నీ అంతు చూస్తారా విష్ణునంది, రుద్ర.. మీరు నాకు ఆహారం అవక తప్పదు. రుద్రా, నీవు నా సోదరుడిని కూడా చంపావు, మేము పుట్టింది నీ చేతిలో చావుటకు లాగా ఉంది, నిన్ను వదిలి పెట్టను, ప్రాధేయపడి అడిగినా, నీ వాళ్ళని కూడా నాశనం చేస్తా, చూడు,అని అంది ఆ ఒంటికన్ను. రుద్రుడు తన చేతిలో బాకుని నొక్కాడు. ముందుకు వెళ్ళాడు. కానీ, ఆ ఒంటికన్ను అక్కడ ఉన్న మైదానంలో అటు, ఇటు మాయమై తిరుగుతూ “అంతుచూస్తా” అంటూ వెళ్ళింది. భట్టు అయితే ఆంజనేయస్వామి దగ్గరికి పరిగెత్తాడు. అందరిలో ఆందోళన.
ఇది కూడా చూసి మార్తాండుడు “దొరికిందిరా, డింభకా ‘ మార్గము, “నా మాజీ ప్రేయసి పద్మినిదేవి ఆహ” అంటూ నిప్పు వైపు చూస్తున్నాడు.
(సశేషం...)
No comments:
Post a Comment