మలడు - అచ్చంగా తెలుగు

మలడు

Share This

మలడు 

- లీలా సౌజన్య 


ఏంటి ఈ పేరు అనుకుంటున్నారు కదా, మా లడ్డూ కే వాళ్ళు అలా పేరు పెట్టారండి, అంతే.
ఇది తమిళులు దీపావళికి చేసే లడ్డూ...
కావలసిన పదార్ధాలు :
పుట్నాల పప్పు/ వేయించిన సెనగ పప్పు - 250 గ్రా.
నెయ్యి - 50 గ్రా.
ఏలకులు - 2/౩
జీడిపప్పు - 25 గ్రా.
పంచదార - 100 గ్రా.
చేసే విధానం : పుట్నాల పప్పు, పంచదార మిక్సీ లో వేసి, పొడి చేసుకోవాలి. జీడిపప్పు చిన్న ముక్కలు చేసుకుని, కొంచెం నేతిలో వేయించి, పుట్నాల పొడిలో కలపాలి. దంచిన ఏలకుల పొడి కూడా వెయ్యాలి.
ఇప్పుడు ఒక మూకుడు లో మిగిలిన నెయ్యి వేసి, స్టవ్ మీద వేడి చెయ్యాలి.
పొగలు వస్తూనే స్టవ్ ఆఫ్ చేసి, పుట్నాల పొడి మిశ్రమంలో కలపాలి. నెయ్యి వేడికి పంచదార కరిగి, లడ్డూలు కట్టడానికి అనువుగా మారుతుంది. వేడి చల్లారకుండా లడ్డూలు కట్టుకుంటే, పది నిముషాల్లో చెయ్యగల ఈ రుచికరమైన స్వీట్, మీకోసం సిద్ధమౌతుంది.
**********************

No comments:

Post a Comment

Pages