మలిసంధ్యా సోయగం
- సురేష్ కాశి
సెలయేటి నీటిపై మెరిశానని గర్వంతో
తాటాకు పాకలొకి దూరాలని ఆత్రంలొ
చిక్కుడుతీగని చూడక వచ్చడా సూరీడు
చిక్కుడాకులమధ్య చిక్కాడా సూరీడు
తూరుపు సంద్రం నుండి ఓరుపుగా
నీరు పట్టి పడమటి కొండలకేసి వడివడిగా
పరుగుపెట్టు మదపుటేనుగుంపులాంటి కరిమబ్బులు
వరుసకట్టి నిదరొచ్చిన పసికూనలు తల్లిఒడికి ఉరికినట్టు
మలిసంధ్యా సోయగం మసకబడ్డ వేళకి
నేలతల్లి పాడుతున్న చల్లగాలి జోలకి
దారిమరచి పోయాయా చలిబుగ్గల తడిమబ్బులు
తనపచ్చని ఒడిలోకి..కరిగాయా పసిమబ్బులు
ఒళ్ళుమరచి వర్షంలా..కురిశాయా కరిమబ్బులు
No comments:
Post a Comment