రాశులలో రామాయణము - అచ్చంగా తెలుగు

రాశులలో  రామాయణము  

 - డా.బల్లూరి ఉమాదేవి.  
                           
ఆదికవి వాల్మీకి మహర్షి వ్రాసింది రామాయణం. ఇది భారతీయులకు పా రాయణా గ్రంథము.రామ నామ ప్రాశస్త్యాన్ని పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవితో చెప్పినట్లు మనకు విష్ణుసహస్రనామం వల్ల తెలుస్తున్నది.
"శ్రీ రామ రామ రామేతి రమేరామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే  "
రామ నామాన్ని జపిస్తే చాలు అదే వేయి సార్లు నామస్మరణం చేసిన దానితో సమానమని పరమశివుడే పార్వతితో చెప్పాడు.
రామాయణంలో ప్రతిఅక్షరమూ రమణీయమే.పద్యమైనా గద్యమైనా శ్లోకమైనా స్తోత్రమైనా రామునికి సంబంధించినదేదైనా మధురమైనదే.
    ఈ రామాయణ కథను చమత్కారయక్తంగా రాశులకు అనుసంధానిస్తూ చెప్పడం ఈ శ్లోకంలోని ప్రత్యేకత.
మనకు మేషాది రాశులు 12 వున్నాయి.వాటిలో 11 రాశులను గురించి వాటి పేర్లు చెప్పకుండా పొడుపుకథలా వివరించేదీ శ్లోకం.
 "యో భాంక్షీత్ నవమం ద్వితీయ గమనస్య ఇలాభుజం పంచమాత్ షష్టీ మాప తృతీయ మాదిగ పురః నిస్సప్తమం తద్బభౌ పూర్ణం ద్వాదశభిః చతుర్థః దశమైః గత్పాటివధీత్ రావణం యశ్చైకాదశకర్ణకం అస్య భజతాం జన్మాష్టమః తస్య కుతః. "
అదెలాగో చూద్దామూ!
యః=ఏ రాముడైతే దవితీయ గమనస్య=రెండవ దానిపై సంచరించే వాని:- రెండవ రాశి వృషభము.నంది దానిపై సంచరించేవాడు శివుడు.  ఆ శివుని
నవమం=తొమ్మిదవదైన >తొమ్మిదవరాశి ధనస్సు. ధనువును>శివధనువును అభాంక్షీత్=విరిచి ఇలాభుజాం= పంచమాత్=ఐదవరాశి అనగా సింహరాశి.అంటే సింహపరాక్రమంతో రాజులను ఓడించి
షష్టీం=ఆరవదైన ఆరవ రాశి కన్యారాశి.కన్యయైన సీతనుభార్యగా పొందాడు.ఎలా? ఆది =మొదటదైన>మేషరాశి
గ=గమనుడు అనగా మేషును వాహనము అగ్ని పుర=ఎదుటఅంటే అగ్ని సాక్షిగా వివాహమాడి
తృతీయం=మూడవరాశియఐన మిథునరాశి మిథున భావాన్ని  అప=పొందాడు. తత్=ఆ జంట నిస్సప్తతం సప్తతం=ఏడవరాశి తుల.సవానం నిస్సప్తతం=తులలేని సాటిలేని జంటగా బభౌ=ప్రకాశించారు.
తరువాత ద్వాదశాభిః=పన్నెండవదైన మీనరాశి చేపలతో చతుర్థః =నాలగవ ఆశి కర్కాటక ఎండ్రకాయలతో దశమ=మొసళ్ళతో
పూర్ణం=నిండిన సముద్రాన్ని దాటి రావణం = యశ్చైకఅదశైర్ణ =పదకొండవరాశి కుంభ కర్ణ , రావణ కుంభకర్ణాదులను అవధీత్ = చంపిన అస్య=అట్టి రామని భజతాం =భజించువారికి జన్మ అష్టమ అష్టమభావమైన మరణము కుతః=ఎక్కడిది లేదని భావము.

No comments:

Post a Comment

Pages