అక్షర నీరాజనం - అచ్చంగా తెలుగు

అక్షర నీరాజనం

Share This

అక్షర నీరాజనం 


గోదావరి జీవనది. తను పుట్టిన నాసిక్ మొదలు సముద్రంలో కలిసే దాదాపు వెయ్యి మైళ్ళ పొడవునా ప్రవహించే ఈ జీవధారలో ప్రతి నీటిబొట్టు అతి పవిత్రమేనని,  ! ఏంటో నండి, మరి గోదావరి నీళ్ళు త్రాగిన వాళ్లకి అన్ని కళలూ అలవోకగా అబ్బేస్తాయి, ఇక్కడి మనుషులే వేరండి, అంటూ ఉంటారు కదా ! ఎందుకో మీకు తెలుసా ?
కొంచెం కూడా ధర్మం తప్పకుండా జీవించేవారికి, మునులకూ, యోగులకూ జీవితానంతరం ఎటువంటి ఉత్తమగతులు ప్రాప్తిస్తాయో, అటువంటి సద్గతులు గోదావరీ తీరంలో బ్రతికే సర్వప్రాణులకూ లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకేనేమో ఆ నీటిలో, నీటిలోని జలచరాలలో, నీటిఆవిరి నింపుకున్న గాలిలో, ఆ నదినీటి నుంచి అంకురించే ప్రతి ఒక్క విత్తులో,  ఏదో అదృశ్య శక్తి ఉన్నట్లుగా మనసు అనుభూతి చెందుతుంది. అదే శక్తి అక్కడి మనుషుల్లోనూ అంతర్లీనంగా నిబిడీకృతమై ఉంటుంది.
ఇక పుష్కరాల గురించి క్లుప్తంగా చెప్పుకుందాము. గౌతమ మహర్షికై శివుడు తన జటాజూటం నుంచి వెలువరించినదే గౌతమి నది. గంగ, గోదావరి నదులు రెండూ మనకు పరమ పవిత్రమైన నదులు. దూరంగా ఉన్న గంగ వద్దకు వెళ్ళలేకపోయినా, దగ్గరలో ఉన్న గౌతమీ పూజ గంగా పూజ కంటే ఎక్కువ మహిమకలది అని చెబుతారు. బృహస్పతి  సింహరాశి లోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదిలోకి 3 లోకాలలోనూ పవిత్రమైన -3 కోట్ల 50 లక్షల పుణ్య తీర్థాలు వాటికి ప్రభువైన పుష్కరస్వామితో సహా, ఈ నదిలో ప్రవేశిస్తాయి. అటువంటి సమయంలో చేసిన పుష్కర స్నానము అశ్వమేధ యాగం చేసినంత  ఫలితాన్ని ఇస్తుంది. అన్ని క్షేత్రాలలో, అన్ని తీర్ధాలలో చేసిన స్నానము, దానము, పూజ మొదలైన వాటికంటే పుష్కరసమయంలో చేసిన గౌతమీ స్నానం అధిక ఫలితాన్ని ఇస్తుంది. ఈ నదీతీర ప్రాంతం వెయ్యి మైళ్ళ పొడవునా, ఎక్కడ స్నానమాచరించినా, పుణ్యమేనని శివుడు వరమిచ్చాడు. ఆది పుష్కరోత్సవము, అంత్య పుష్కరోత్సవము జరిగే ఒకేఒక నది – గోదావరి.
గంగానదిని కూడా పావనం చెయ్యగల శక్తి గౌతమికి ఉంది. అందుకే, కాశీకి వెళ్ళినవారు అక్కడి గంగను తెచ్చి, గోదావరిలో కలపడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇటువంటి మహిమాన్వితమైన నదిలో అతి విశిష్టమైన పుష్కరస్నానం చేసి తరిద్దాం !
‘గోదావరి ప్రత్యేక సంచిక’ అనగానే ఎప్పుడూ పత్రికకు రచనలు పంపే రచయతలతో పాటు, కొత్తవారు ఎంతో మంది కూడా స్పందించి, తమ గుండెల్లో గుడి కట్టుకున్న గోదావరి తల్లి కోసం అక్షర నీరాజనాలు అర్పించారు. రచనలు అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞాతభివందనాలు తెలుపుతూ,  ఇవన్నీ ఒక మాలికగా ఈ ప్రత్యేక సంచికలో కూర్చి, చంద్రుడికో నూలుపోగులా ‘అచ్చంగా తెలుగు’ తరఫున లోకపావనియైన గోదారి తల్లికి భక్తితో సమర్పిస్తున్నాము.
అజాతశత్రువు జిత్ మోహన్ మిత్రా గారి పరిచయం, గొప్ప చిత్రకారులు దామెర్ల రామారావు గారి పరిచయం, తెలుగువారు గర్వించదగ్గ ఇంజనీర్ శ్రీ భావరాజు సత్యనారాయణ గారి పరిచయం, డొక్కా సీతమ్మ గారు, కాటన్ దొర, రాజరాజ నరేంద్రుడి గురించిన వ్యాసాలు ఈ సంచికలో మీకు అందిస్తున్నాము. ఇవేకాకుండా సప్తవర్ణాల ఇంద్రధనుస్సు వంటి ఏడు కధలు, అనేక ప్రత్యేక వ్యాసాలు, చక్కటి కవితలు... ఎన్నో, మరెన్నో మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం... చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలతో మమ్మల్ని దీవించండి.
 పుష్కర సమయంలో, రాజముండ్రిలో అవసరమయ్యే ఎమర్జెన్సీ నెంబర్ లను క్రింద ఇస్తున్నాము.వద్ద ఉంచుకోమని మనవి చేస్తున్నాము.
రాజమండ్రి లో అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన నెంబర్లు ఆరోగ్య అత్యవసరాలు, అంబులెన్సు, EMRI 108ప్రభుత్వ ఆసుపత్రి + 91 - 883 - 2473022అభయ ఎమర్జెన్సీ హాస్పిటల్ + 91 - 883 - 2479337బొల్లినేని హాస్పిటల్ + 91 - 883 - 2445195కృష్ణ పాలీ క్లినిక్ + 91 - 883 - 2467935రాజముండ్రి ఆర్ధోపెడిక్ హాస్పిటల్ + 91 - 883 - 2473603సెయింట్ మేరీ అంబులెన్సు సర్వీస్ + 91 - 883 - 2461979సిద్ధార్ధ ఎమర్జెన్సీ హాస్పిటల్ + 91- 883 - 2473603స్వతంత్ర ట్రామా అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ + 91- 883 - 2465434ప్రభుత్వ ఆసుపత్రి + 91- 883 - 2465434 24 గంటలు ఉండే మందుల షాప్ లు అపోలో ఫార్మసీ + 91- 883 - 2432333, 2438005, 2446110, 2438007అన్నపూర్ణ ఫార్మసీ + 91- 883 - 2473954గవర్రాజు మెడికల్స్ + 91- 883 - 2476712స్వతంత్ర హాస్పిటల్ + 91- 883 - 2438082 బ్లడ్ బ్యాంకులు జాగృతి వాలెంటరీ బ్లడ్ బ్యాంకు + 91- 883 - 2443612స్వతంత్ర ట్రామా అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ + 91- 883 - 2465434ధన్వంతరి వాలెంటరీ బ్లడ్ బ్యాంకు + 91 - 883 - 2473050 / 6599754 క్రైమ్ - పోలీస్ ఎమర్జెన్సీ పోలీస్ కంట్రోల్ రూమ్ 100 అగ్నిమాపక సిబ్బంది 101 అగ్నిమాపక సిబ్బంది -ఇన్నీసుపేట + 91 - 883 - 2444101అగ్నిమాపక సిబ్బంది - ఆర్యపురం + 91 - 883 - 2445110క్రైమ్ (నేరాలు ) 1090ట్రాఫిక్ 1073పోలీస్ స్టేషన్ లు 1 టౌన్ + 91 - 883 - 24710332 టౌన్ + 91 - 883 - 24711333 టౌన్ + 91 - 883 - 2471043ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ + 91 - 883 - 2442933
అచ్చంగా తెలుగు సంపాదకవర్గం అందరి తరఫునా ,
కృతజ్ఞతాభివందనాలతో...
మీ
భావరాజు పద్మిని.

No comments:

Post a Comment

Pages