గోదావరీ! నాద ఝరీ ! - అచ్చంగా తెలుగు

గోదావరీ! నాద ఝరీ !

Share This

గోదావరీ! నాద ఝరీ !

- ఉషా వినోద్ రాజవరం


పవిత్ర గోదావరీ నదీమతల్లి ని కీర్తిస్తూ డా. భద్రి రాజు గారు వ్రాసిన ఈ లలిత గీతము ను నేను చిన్నప్పుడు స్కూల్ ఫంక్షన్ లలో నూ, పెద్దయ్యాక ఆల్ ఇండియా రేడియో లోను పలుమార్లు ఆలాపించాను.. రేడియో పాట గురువు డా . ఎం చిత్త రంజన్ గారికి ఏకలవ్య శిష్యురాలినై ఈ పాట తో బాటు ఎన్నో లలితా గీతాలను నేర్చుకొని మళ్ళీ రేడియో లోనే ఆలాపించి, ఆయన చేత సెహబాష్ అనిపించుకోవటం ఎంతో ఆనందాన్నిచ్చింది .. ఈ పాట మీ అందరి కోసం అచ్చం గా తెలుగు లో ....

పల్లవి : గోదావరీ! నాద ఝరీ ! గోదావరీ! నాద ఝరీ ! 

ఎన్నెన్ని యుగాల స్మృతులు ఎద బరువై పాడుదువో 

మరి ఎన్ని యుగాల దాక మా నేలన పారుదువో ॥ ఓ ॥ గోదావరీ ॥


చ : వ్యాహ్యాళి కి నీ ఒడ్డు కు వచ్చిరి..... సీతా రాములు - 2 

ఎచట కాలు కడిగితివో ఏమి నోము నోచితివో -2 ॥ఓ॥ గో ॥


చ: అన్నయ్య కూ వదినెమ్మ కు అంగరక్ష గా తిరిగే 

వొంటరి లక్ష్మణ స్వామికి ఊర్మిళ నే తలపించితివో .. ఓ ..॥ గో ॥


చ : భద్రుని ప్రార్ధన కు మెచ్చి బస చేసిన శ్రీ రాముల .. 

కబురులన్ని గోపన్న కు కల లోనే చెప్పితివో ఓ ఓ ..... ॥ గోదావరీ ॥

No comments:

Post a Comment

Pages