మన(సు)కీలకం.
- రామాచారి బంగారు.
మనిషిగా కనబడుతున్ననేను
తెలిసి తెలివిగాతప్పులెన్నో చేసి
గెలిచినానునాడు అహంతో తలెగరేసినవాడనే గాని
ముందుగా మేల్కోన్న శరణార్ధిలా నా తల
మనసులోఓమూల ఓటమితో ఒదిగున్నది.
నేడు ఒప్పుతో నేస్తంకట్టి ఓడిపోయినాను
తలెత్తిన మనసు కవచమై గెలిపించింది
నిజంగా నన్ను వెలుగువాకిట నిలబెట్టింది
మన జీవనగడియారాని కీ(లో)లకమదే.
No comments:
Post a Comment