బీరపొట్టు కూర - అచ్చంగా తెలుగు

బీరపొట్టు కూర

Share This
బీరపొట్టు కూర
 
పెయ్యేటి శ్రీదేవి  
          

లేత బీరచెక్కులు మిక్సీ చెయ్యాలి.  మూకుడులో నూనె వేసి, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ముక్కలు, ఆవాలు, జీలకఱ్ర, కరివేపాకు వేసి వేగాక, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి, చెక్కు తీసిన కొంచెం బీరకాయ ముక్కలు, కొంచెం మొలకెత్తిన పెసలు వేసి, బీరపొట్టు వేసి, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.  చివరగా కొంచెం కొబ్బరిపొడి జల్లాలి.  ఇలా చేసి చూడండి.  అన్నంలోకి, చపాతీలలోకి కూడా బాగుంటుంది.

No comments:

Post a Comment

Pages