ధౌమ్య హితోక్తులు- 2 - అచ్చంగా తెలుగు

ధౌమ్య హితోక్తులు- 2

Share This

ధౌమ్య హితోక్తులు- 2 

- చెరుకు రామమోహనరావు


ధౌమ్యుడు గురువయిన తరువాత వివిధ తీర్థాలను గూర్చి వివిధ స్థలాలను గూర్చి విపులముగా చెబుతాడు ధర్మరాజుకు. ఇక్కడ మనము గమనిన్చావలసినదేమిటంటే ఒక పురోహితుడు ఎంత విషయగ్రాహి అయి వుండవలె విడమరచి విమర్శనా పూర్వకముగా చెప్పగలుగవలె. అరణ్యపర్వములోనే ఒక సందర్భములో తనకు మించిన దురదృష్టవంతులు , అమిత మైన కష్టములు పడినవారు వున్నారా అంటే ఎంతోమంది ఉదారచరితుల  ఉదాహరణలు చెబుతాడు. అంటే ధర్మరాజు కష్టాలను చిన్న గీత చేస్తూ అతనికంటే ఎక్కువ కష్టపడినవారి యొక్క పీద్ద గీతను గీచుతాడు. అంటే ఇక్కడ హితుడైనవానికి ఎంత విషయ పరిజ్ఞానము, సమస్పూర్తి కావలెనో ఆలోచించండి. అదే అరణ్యపర్వములో పాండవులు వేటకు వెళ్ళినపుడు సైంధవుడు ద్రౌపదిని అపహరించి రథములో పోతూవుంటే, ద్రౌపది ధౌమ్యుని గట్టిగా కేకవేస్తుంది.ఆయన రథము వెనుక పరిగేడుతూవుంటే పాండవులు రథముపై ఆయనను చేరుకొని మీరు నెమ్మదిగారండి మేము వాణి పని బడతామని చెప్పి వెళతారు. ఇక్క డ హితునిగా ఎంత నిస్వార్థుడో చూడండి.వేరొక సందర్భములో బకాసురుని సోదరుడైన కిమ్వీరుడు తన మాజాలముచే పాండవులను నిలువరించితే ధౌమ్యుడు రక్షోఘ్న మంత్రము వేసి ఆ మాయను పటాపంచలు చేస్తే భీముడా రాక్షసును పరిమార్చుతాడు.పాండవులు అరణ్యవాసములో  సూర్యుని అర్చించు విధానమును తెలిపి, తమతో వున్న బ్రాహ్మలకు క్షుద్బాధ లేకుండా చేయుటకు అక్షయ పాత్రను పొందు విధమును వివరించు విధమును విశధ పరుస్తాడు. దానితో తమతో వుండిన బ్రాహ్మలకు గానీ తమను చూడవచ్చు అతిథులకు గానీ ఏమాత్రము లోటు లేకుండా శాద్రసోపెతమన భోజనము అమర్చ గలిగినారు. ఒక పురోహితునికి ఎన్ని బాధ్యతలున్నాయో గమనించండి. ఆతడెంతటి కార్య దీక్షాదక్షుడై వుండవలెనో గమనించండి.
మరి నేడో? మనము ధౌమ్యుని చూడము,బ్రాహ్మణ పక్షపాతులైన పాండవులను చూడము. బ్రాహ్మణ్యము పతనమన్న పర్వతపు అంచున నిలిచియున్నా ఏమీ పట్టనట్లు హిందువులమందరమూ వూరకున్నాము.
ఎంతమంది వేదపండితులను చూడగలము, ఎంతమంది అహంకారములేని వేదపండితులను చూడగలము. నాడు రాజులను చేయుటేగానీ తాము రాజులు కావలెననుకోలేదు, నమ్మిన వారి నాశమును వారెన్నడూ కోరలేదు టిప్పుసుల్తాను దుర్మార్గుడు. ఆదుర్మార్గుని మంత్రి పూర్ణయ్య బ్రాహ్మడు.నమ్మిన నేరానికి అతని కొరకే చచ్చినాడు కానీ ఆతని వదలలేదు. అంతెందుకు ద్రోణుడు కృపుడు హస్తిన ఉప్పుతిన్న నేరానికి దుర్యోధనుని వదలలేదు.కృష్ణరాయల గొప్పదనమునకు మూలము తిమ్మరుసు కాదా! అంతటి ప్రజ్ఞావంతుడు తాను తలఛి యుంటే రాజు అయి ఉండలేడా!  అయినా రాజదండనకు గురియినాడుకానీ రాజద్రోహి కాలేదు. చెప్పుకొంటూ పోతే ఉదాహరణలు కోకొల్లలు. నేటి పరిస్థితినిచూస్తే బ్రాహ్మణుని ఒక విదూషకుని చేసి ఈ సినిమా వారు చిత్రీకరించుచున్నా ఎదో ఒకట రెండు విషయములలో తప్ప స్పందన ఎక్కడా కనిపించదు. వేదము చదవని బ్రాహ్మదంటే ఎగతాళి. మరి వ్యవసాయము చేయని రైతు , బట్టలునేయని సాలె, కొయ్యపని చేయని వడ్రంగి ఈ విధముగా తమ వృత్తుల వదలిన వారిని ఎగతాళి చేస్తున్నారా. ఒక 'మోది' పదవి చేపట్టాలంటే బ్రాహ్మణుడు కావలసిందే . సోనియా గాంధీ గారికి కూడా పండితులుపెట్టే ముహూర్తాలు కావలె. కానీ సినిమాలలో "బ్యాపనీస్"
అని అక్షరము ముక్క పలుకలేని హీరో గారు ఏమిరా శాస్త్రీ అని, కాలితో కొట్టి హాస్యాన్ని సృష్టించుతున్నారు. నాడు ఎంతో గౌరవము పొందిన బ్రాహ్మలది ఎంత హీనమైన బ్రతుకయ్యిందో ఆలోచించండి .ఈ వాస్తవాన్ని గమనించండి learn how Pythagoras came to India, where he was instructed by the Brahmins. Then notice how he began to teach the doctrine of metempsychosis after his return to Europe.(a search in secret india)
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మనము ఇటు మన సంస్కృతి వదిలిపెట్టుకోన్నాము అటు పరమతములను అవలంబించి వారి పోకడలు పోలేకుండా ఉన్నాము. మనకిపుడు (మన అంటే హిందువులందరూ అని నా అభిప్రాయము , ఎందుకంటే ధౌమ్యుని గౌరవించిన పాండవులు బ్రాహ్మలు కారు) హంసనడక పోయింది కాకినడక రాకుంది. పెద్దల 'కుల వ్యవస్థ' ను తప్పు పట్టా పనిలేదు.నిస్వార్థముగా వేదం వేదాంగ శాస్త్ర పురాణేతిహాసములను మన చేతయుంచిన వారిని, స్వార్థ ప్రయోజనములకోరకు మనలోమనకు వైషమ్యములను సృష్టించిన స్వార్థపరులగు(మన విజ్ఞానమునకు వారిపేరు తగిలించి) పాశ్యాత్య కుహనా శాస్త్రజ్ఞులను నమ్మి, దూషించకండి.కాపు కమ్మ వెలమ రెడ్డి కులస్తులు వీరులే కాక వీరలనేకులు రాజ్యము లేలినారు. నేను విన్న ఇంకొక ఆశ్చర్యమైన విషయమేమిటంటే మైసమ్మ అన్న మాదిగ స్త్రీ పాలించిన కారణముగా ఆ పట్టణమునకు మైసూరు అని ఏర్పడినదట. మరి ఈ సనాతన ధర్మమున ఉచ్చనీఛములేవీ? నదులు నదులుగా పారుచున్నంతవరకే నీరు త్రాగుటకు ఉపయోగ పడుతాయి. అవి అన్నీ సముద్రములోకలిసి ఒకటైపోతే ? నేడు పౌర హితము చేసేవాళ్ళు ఎక్కువున్నారో జలగల మాదిరి డబ్బు గుంజి పౌర హతము చేసే వాళ్ళుఎక్కువున్నారో పాఠకుల విచక్షణకు వదిలి పెడుతున్నాను, వాల్మీకి రామాయణము లోని
ఈ చిన్న శ్లోకముతో :
ధర్మ ఏవహతో హంతిధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మోన హంత వ్యోమానో ధర్మాహతో వధీత
"చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది;రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది; కనుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి"

No comments:

Post a Comment

Pages