మెంతికూర(మేతి ) పులావ్ - అచ్చంగా తెలుగు

మెంతికూర(మేతి ) పులావ్

Share This

మెంతికూర(మేతి ) పులావ్ 

- లీలా సౌజన్య 


లేత మెంతికూరతో పులావ్ ఎప్పుడైనా చేసారండి ? రుచి అద్భుతంగా ఉంటుంది, ప్రయత్నించండి.

కావలసిన పదార్ధాలు 

మెంతికూర - 4 కట్టలు
ఉల్లిపాయలు - 2
టొమాటోలు - 2
జీలకర్ర - 1/2 స్పూన్
దాల్చిన చెక్క - 2 ముక్కలు
లవంగాలు - 6
ఏలకులు - 4
నూనె - 5 స్పూన్లు
ఉప్పు - తగినంత
బాస్మతి బియ్యం - 200 గ్రా.
కారం - 1 స్పూన్

తయారు చేసే పధ్ధతి :

మెంతికూర కాడలు సగానికి కోసి, నీళ్ళల్లో బాగా కడగి, తరుక్కోవాలి. ఉల్లిపాయలు, టమాటోలు చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి.
ఇప్పుడు మూకుడు పెట్టి, నూనె వేసి, జీలకర్ర, దాల్చినచెక్క , లవంగం, ఏలకులు వేసి, అవి వేగాకా, మెంతి కూర వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి, ఉప్పు వేసి, అవి కాస్త వేగాకా, టమాటో ముక్కలు వేసి, కొంచెం వేగనివ్వాలి. కడిగి నానపెట్టుకున్న బియ్యం వేసి, కొలతకు నీళ్ళు పోసి, కుక్కర్ పెట్టుకోండి. 4 విజిల్స్ తర్వాత మేతి పులావ్ రెడీ.

No comments:

Post a Comment

Pages