శ్రీధరమాధురి – 18
(ధ్యానం గురించి పూజ్య గురూజీ అమృతవాక్కులు )
అంకిత భావం తో కూడిన ప్రార్ధన / ధ్యానం ఉన్న చోట సందేహం ఆతృత ఉండవు.
*******
ప్రాచీన భారతం లో దాన్ని 'ధ్యానం' అన్నారు.
అది చైనా కు తరలి పోయాకా దన్ని 'ఛాన్ ' అన్నారు.
అది జపాన్ కు చేరాక దన్ని 'జెన్ ' అన్నారు.
ఇప్పుదు ప్రపంచవ్యాప్తంగా దన్ని 'మెడిటేషన్ ' అంటున్నారు.
**********
దైవానుగ్రహం చాల అద్భుతమైనది. ఆయన దేహం, హృదయం (ఆత్మ) మధ్య చక్కగా అనుసంధానం చేసారు. ఇందులో 6 చక్రాలు ఉన్నాయి. 7 వది 'సహస్రార ' అనే బిందువు. మూలంగా ఉన్నది మూలధార చక్రం (పాయువు దగ్గర ఉంటుంది), తర్వాత స్వాధిష్టాన చక్రం(గుహ్యాంగాల వద్ద ఉంటుంది) తర్వాత మణిపుర చక్ర ( బొడ్డు దగ్గర ఉంటుంది), తర్వాతది అనాహత చక్రం (గుండె దగ్గర ఉంటుంది), తర్వాతది విశుద్ధ చక్రం (గొంతు వద్ద ఉంటుంది) తరువాతది ఆజ్ఞా చక్రం (భూమధ్యం లో ఉంటుంది), చివరిది బిందు లేక సహస్రారం (తలలోపలి భాగం లో ఉంటుంది). సర్పము కుండలిని లో చుట్టుకొని, మూలాధార, స్వాధిష్టాన, చక్రాల మధ్య ఉంటుంది. సహస్రారం లో ఉన్న వేయి రేకుల పద్మం గాఢ నిద్ర లో ఉంటుంది. దాన్ని మేల్కొల్పి జాగృతం చేయాలంటే, గురువు కుండలిని నుంచి సర్ప శక్తి ని మేల్కొలడం నేర్పు తారు. అది కుండలిని నుంచి క్రిందికి మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలకు ప్రాకి చివరకి సహస్రారం చేరుతుంది. కుండలిని ఒక దశ నుంచి మరొక దశకు కదులుతుండగా, చక్రాలు తిరగడం మొదలై, శరెరం యొక్క ఆ భాగంలో అమితమైన శక్తి విడుదలవుతుంది. ఇది ఒక రాకెట్ మూలం నుంచి పూర్తి శక్తి తో విడుదలై గమ్యం వైపు దూసుకుపోవడం వంటిది. ఒకసారి ఈ సర్పం సహరారం చేరితే 1000 రేకుల పద్మం జాగృత ఆ వ్యక్తి పూర్తి జాగృత స్థితి చేరతాడు. ఇది విస్వచైతన్యాన్ని గుర్తించడం వల్ల జరుగుతుంది.
కుండలినీ ధ్యానం లో 9,63, 478 పద్ధతులు ఉన్నాయి. ఒకసారి మీకు వాటిలో కొన్ని తెలిస్తే మీకు జన్మజన్మల జ్ఞానం కలుగుతుంది.
ఓం యోగ భైరవాయ నమః
ఓం ప్రయోగ భైరవాయ నమః
అంతా దైవేచ్చ, దయ, అనుగ్రహం. ఆనందంగా ఉండండి.
*********
ధ్యానం - ఊహాత్మక ప్రక్రియ.
మందులు దేహానికి చికిత్స చేస్తే, ధ్యానం మనసుకు చికిత్స చేసాకా, మనిషి దాన్ని అధికమించేలా చేస్తుంది. మునులు దీన్ని ఇచ్చారహిత స్థితి అన్నారు. ఒకరి నిజస్థితిని తెలుసుకొనే దశ.ఒకసారి ఒక వ్యక్తి ఆ దశకు చేరితే, అతను చుట్టూ ఉన్న సమజంలో మామూలుగా ఉంటూనే, విభిన్నంగా ఉంటాడు. అతను ఆత్మజ్ఞాని అని ఎవరికీ తెలియదు. అతను అదే పని చేస్తూఉంటాడు. దిన చర్యను మామూలుగా నడుపుతూ ఉంటాడు. భార్యాపిల్లలతో రోజూ సినిమాలకు వెళ్ళడం, ఫ్రెండ్స్ తో కలసి తిరగడం,ఫేస్ బుక్ లో కాలం గడపడం, అప్పటి దాకా ఎలా జీవితన్ని ఆస్వాదితూ ఉన్నాడో, అలాగే ఉంటాడు. బయటకి ఎటువంటి మార్పూ కనిపించదు. అయితే ధ్యానం చేసిన అద్భుతం ఏమిటి? అదే సస్పెన్స్. అటివంటి వ్యక్తికి 360డిగ్రీలు చూసే శక్తి ఉంటుంది. అతను అత్యంత సమతుల్యత గల వ్యక్తి. మీరు వారిని వర్ణించలేరు. మూగవాడు తేనె తాగుతున్నంత మధురంగా ఉంటుంది ఆ అనుభూతి.
*********
నిర్వచనం అనేది తెలివితేటల నుంచి చేసేది. అనుభూతిని వర్ణించలేము. అలా వర్ణించగలిగితే అది అనుభూతి కాదు. అనుభూతి అనేది హృదయానికి, ఆత్మకు సంభందించినది. దైవం అందులో నివసిస్తారు. హృదయం ఒక భావనలో నిండిపోతే, మీరు అలౌకికమైన 'దైవాన్ని ' చూడగల్గుతారు. దైవాన్ని నిర్వచించడం అసాధ్యం. అనుభూతి చెందడం సులభం. మీరు నిర్వచించాలని, చూడాలని అనుకుంటే అది వెర్రితనం. మీరు ఆయన్ని అనుభూతి చెందుతూ దర్శించాలని అనుకుంటే మేధస్సు నుంచి ఆత్మ / హృదయానికి మారండి. మీరు తప్పకుండా ఆయన్ను చూసి, పరమనందం తో ధ్యానించ గలుగుతారు.
*************
ఆమె - నాకు నా గతాన్ని తెలుసుకోవాలని ఉంది. తద్వారా నేను పశ్చాతాపంతో తపస్సు చేసుకో గలుగుతాను.
నేను - గతాన్ని తెలుసుకోవలసిన అవసరం లేదు. తపస్సు చేసుకోవడానికి, మీ గతంతో నిమిత్తం లేదు. గతం కుటిలమైనది. అందుకే, దైవం మీ పలకను తుడిచేసి పంపారు. మీరు దాన్ని గుర్తించుకోకూడదనే. మీరు గతాన్ని తెలుసుకుంటే, కుమిలిపోతూ ఉంటారు. పస్చాతాపానికి బదులు అది మరింత గందరగోళానికి దారి తీస్తుంది. నిజానికి, పరిపూర్ణ జ్ఞానం ఉన్న సమతుల్యమైన వ్యక్తికే గతాని తెలుసుకొనే అర్హత ఉంటుంది. అతనికి, తాను కర్తను కాను అని, అప్పుడూ ఇప్పుడూ కూడా తాను దైవం యొక్క ప్రణాళికలో భాగమేనని తెలుస్తుంది. నిజానికి జ్ఞానం ఉన్నవారు ఎన్నడూ పస్చాతాప పడరు. అతను తన గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును చూసి నవ్వుకుంటాడు. జ్ఞానం కలవారు ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉనంటారు. వారి [రతి కదలిక ధ్యానం, తపస్సే. అతను పద్మాశనం లో కూర్చో అక్కర్లేదు. కళ్ళు మూసుకోనక్కర్లేదు. అతని అంతర్నేత్రం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. అతను విశ్వచైతన్యం / భవంతునితో నిరంతరం సంభాషిస్తూనే ఉంటాడు. అతను ఎల్లప్పుడూ జాగృత స్థితిలో ఆనందంగా ఉంటాడు. అదే అసలైన తపస్సంటే. అతని చర్యలన్నీ జ్ఞాన్ని సూచిస్తాయి. అతను అమితమైన ధైర్యం కలిగి ఉంటాడు. అతను మాట్లాడినా అతని మెదడు మౌనంగా ఉంటుంది. అతని హృదయం మాట్లాడుతుంది. అతను అలౌకికానందంలో తేలుతూ ఉంటాడు. అంతా దైవానుగ్రహం, దయ.
*************
ప్రార్ధన లేక ధ్యానం ఆనందాన్ని ఇవ్వదు. మీరు ఆనందంగా ఉంటే మరింత ధ్యానం, ప్రార్ధనా చెయ్యగలూతారు. దురదృష్టవశాత్తు, మనం కష్టాల్లో దైవాన్ని తల్చుకొని ప్రార్ధనలు లేక ధ్యానం మదలు పెడతాము. నిజానికి మీరు విచారంగా ఉంటే దైవం ముందుకి వెళ్ళకండి.
***********
ధ్యానం లేక ప్రార్ధనల లోతుల్లోకి మీరు ప్రయాణిస్తున్న కొద్దీ, మీరు పుట్టకముందు ముఖాన్ని మీరు చూడగలుగుతారు.
***********
'క్రోం ' అనేది భద్రకాళికి సంబంధించిన బీజం. జరగరానివి జరగకుండా ఆపే శక్తి 'క్రోం ' కి ఉంది. ప్రయోగ విధానాల్లో 'క్రోం ' ను వాడినప్పుడు, మేము వాడినపుడు మేము జరగకూడనివి అపాలని ప్రార్ధిస్తాము. ఆ రోజులో యుద్ధ సమయాల్లో, రాజుకు ప్రధాన సలహాదారుడైన రాజపురోహితుడు 'క్రోం ' ను జపిస్తూ, భద్రకాళి అమ్మవరిని ఆవాహన చేసే వాడు. 'క్రోం ' ను కాళి స్వరూపంగా ధ్యానిస్తారు. అంతా దైవానుగ్రహం.
***********
ఒక సారి నేను ఒక గొప్ప జూయిష్ నాయకుడిని, ఇస్రాయిల్ నుంచి వచ్చిన రబ్బిని కలిసాను. అతనికి హిబ్రూ మాత్రమే తెఉలుసు. అది నాకు తెలీదు. మేము మూడు గంటలు కలిసి ధ్యానిస్తూ, నవ్వుతూ గడిపాము. హృదయ భాష ప్రపంచం లోని అన్ని భాషల్ని అధికమిస్తుంది. ఇప్పుడు మేము రెండేళ్ళకి ఒకసారి కలుస్తూ ఉంటాము. ఇన్నేళ్ళలో మా స్నేహం బాగా వృద్ధి పొందింది.
*********
నిజమైన యోగులు, ప్రయోగులు మామూలు జెవితాన్ని గడుపుతూనే ధ్యానం చేస్తారు. వళ్ళు పద్మాసనంలోనే కూర్చోరు. ఇతరులతో మాట్లాడుతున్నా, వేరే పనులు చేస్తున్నా, వారి ధ్యానం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇది వారిని అన్ని మాలిన్యాల నుంచి శుద్ధి చేసి పూర్వజన్మలో ప్రోగుచేసుకున్న కర్మలకు అతీతంగా పరిపూర్ణ శాంతిని పొందేలా చేస్తుంది.
**********
నా వద్దకు ఒక వ్యక్తి 'గురూజి ' రోజూ నేను గంట ధ్యానం చేస్తాను అన్నాడు. 'సరే' అన్నాను.'అది అద్భుతంగా ఉంటుంది గురూజి, నేను ఎగురుతున్నానూ అన్నాడు.'చాలామంచిది. నెవు ఎయిర్ టికెట్స్ కొన్నక్కర్లేదూ. అన్నాను. అతను మళ్ళీ 'నేను కొన్ని సార్లు ఏవో లైట్లు చూస్తున్నా' అన్నాడు. 'ఏం రంగువి?' అడిగాన్నేను. అతను రెడ్, ఎల్లో, గ్రీన్ ' అన్నాడు. 'బహుశా, నీలా అంతా ధ్యానం తో ఎగురుతుంటే, ఏరొప్లేన్ల ట్రాఫిక్ లో కలిసి, గాలిలొ అ త్రాఫిక్ బాగా పెరిగి ఉంటుంది. అందుకే వారు ఆకాశంలో త్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి ఉంటారు ' అని నవ్వి, 'సరే, అక్కడ జాం అయితే సరిచేసేందుకు ట్రాఫిక్ పోలిస్ ఉన్నాడా?' అని అడిగాను. ఇప్పుడతను నాతో మాట్లాడట్లేదు.
************
No comments:
Post a Comment