సండే ఫన్ టకాలు
-గోపీనాథ్ పిన్నలి
------------------
ఆగాకర ఆమ్లెట్...
కావాల్సినవి
ఆగాకరకాయలు అరడజను
సెనగపిండి నాలుగైదు చారెళ్ళు (చారెడుకు బహువచనం)
మైదాపిండి (పెనం మీంచి ఆమ్లెట్ ఎగిరిపోకుండా..) మూరెడు.... (కలిపిన తర్వాత సాగితే మూరెడు వచ్చేట్లు చూసుకోవాలన్న మాట)
జీరా మూడు చిటికెలు
వాము రెండు చిటికెలు
పచ్చి మిర్చి అరకాయ
నిమ్మ ఉప్పు, ఉప్పూ, కారం తగినంత
నూనె...ఏదైనా పర్లే ....డజను చెంచాలు...
మంచి వెడల్పాటి ఇనుప పెనం వొహటి
నీరు, చేతి గుడ్డ, బర్నాల్...
తయారీ ...
ముందుగా ఆగాకరను ముక్కలు ముక్కలుగా నరుక్కోవాలి. మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి..ఆ పొడి ఆ పక్కన పెట్టుకోవాలి. సెనగ పిండీ, జీరా, వామూ, నిమ్మ ఉప్పూ, ఉప్పూ, కారం కలిపి కాసిని నీరు పోసి కొంచెం పల్చగా చేసుకోవాలి. అది ఈ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదా పిండిని మూరగా మార్చుకోవాలి.
దరిమిలా స్టవ్వుపై పెనం ఉంచాలి. దాన్ని (పెనం కాదని మనవి) అంటించుకోవాలి. పెనం బాగా కాలేలా....రూఢి చేకుసుకునేందుకు చేయి పెట్టి చూసుకోవాలి(బర్నాల్ అందుకేనని గ్రహించాలి)
తర్వా తాపీగా పెనంపై నూనె జల్లి ఆమైన తయారుగా ఉంచుకున్న ఆగాకర పొడీ, మైదామూారా, సెనగా గట్రా కలుపుకున్న మిక్చరూ అన్నీ కలుపుకుంటూ పెనంపై కొద్దిగా వేసుకుని పెనం కదిలిస్తూ ుండాలి. కొద్ది సేపటికి ఆమ్లెట్ తయారు. కొత్తావకాయ గానీ, పాత కొత్తిమీర కారం గానీ నంజుకుని తింటే ....
మగవారు రేభాదులకు నాలుగడుగుల దూరంలోఉంటారు. ఇల్లాళ్ళు మహా పతివ్రతలు గావున పతి దేవుల వెనకే ...
రొండు...
కాకర బజ్జీలు లేదా పకోీడీలు....
------------------------------ -
సీ. చేదు కాకర తెచ్చి చెక్రాలుగా తరిగి .... సెనగ పిండిలో ముంచు సిన్నగాను అంత కంటే ముందు ఆ పిండిలో ఇంత ... కండ సెక్కరవేసి కలియ బెట్టు నిమ్మ ఉప్పును దెచ్చి నిగనిగ లాడేటి ... పిండి యా గిన్నె లో వేయ వల్లె వాము, జీర సుతయు వాటంబుగా గల్పి ... మొత్త మంతయు బాగ ముద్ద సెయ్యి!!
ఆ.వె. అపుడు స్టవ్వు పైన భాండలొకటి పెట్టి అందు నూనె వోసి అగ్గి పెట్టి నూనె కాగినంక నో వేలుతో చూసి కాకరేసి కాల్చవలయు గాదె!!
తే.గీ. ఇవ్విదంబున బజ్జీలొ వడలొ సేసి పుస్తకంబులొ పెట్టి నే పారిపోదు హమ్మొ లేకుంటే వీరంత నన్ను బట్టి వద్దు లెండిక నే గొట్ట లేను స్వామి............... (పకోడీలకైతే మరింత నూనె కావాల....)
No comments:
Post a Comment