విన్నపమయ్యా శ్రీహరీ! - అచ్చంగా తెలుగు

విన్నపమయ్యా శ్రీహరీ!

Share This
విన్నపమయ్యా శ్రీహరీ!
 
పెయ్యేటి రంగారావు  

ప.|  హరీ.......శ్రీహరీ..........!
నాదు మొఱలను వినవో ఒక పరి
||అ.ప.|  ఖలవిదారీ.....ఓ మురవైరీ
విన్నపమయ్యా....వినరావయ్యా

||చ.|  నేనను భావన - నాకేమున్నది?
నీవే నేనని - నా మనసన్నది
నా చేతలు నీ - సంకల్పితమే
కరణములన్నీ-  నీకర్పితమే

|| చ.|  మదిలో కోర్కెల -  మడియగ జేయుము
మధురముగా  నా - తలపుల నిలువుము
మోహము వలదు - పాశము వలదు
నీ పదసన్నిధి -  పెన్నిధి నిడుము

|| చ.|  ఎదలో వెతలను -  భంగము జేయుము
అంతరంగమున - నీవే నిలువుము
ఆరడి వలదు - క్లేశము వలదు
హాయిగ పిలుచుకో - త్రాసము వలదు

|| చ.|   ప్రాణోత్క్రమణము -  కలిగెడు వేళ
జీవనయాత్ర - ముగిసెడు వేళ
నా నాలుకపై నీ -  నామముంచుమా
నా భావములో నీ - రూపముంచుమా ||
____________

No comments:

Post a Comment

Pages