విన్నపమయ్యా శ్రీహరీ!
పెయ్యేటి రంగారావు
ప.| హరీ.......శ్రీహరీ..........!
నాదు మొఱలను వినవో ఒక పరి
||అ.ప.| ఖలవిదారీ.....ఓ మురవైరీ
విన్నపమయ్యా....వినరావయ్యా
||చ.| నేనను భావన - నాకేమున్నది?
నీవే నేనని - నా మనసన్నది
నా చేతలు నీ - సంకల్పితమే
కరణములన్నీ- నీకర్పితమే
|| చ.| మదిలో కోర్కెల - మడియగ జేయుము
మధురముగా నా - తలపుల నిలువుము
మోహము వలదు - పాశము వలదు
నీ పదసన్నిధి - పెన్నిధి నిడుము
|| చ.| ఎదలో వెతలను - భంగము జేయుము
అంతరంగమున - నీవే నిలువుము
ఆరడి వలదు - క్లేశము వలదు
హాయిగ పిలుచుకో - త్రాసము వలదు
|| చ.| ప్రాణోత్క్రమణము - కలిగెడు వేళ
జీవనయాత్ర - ముగిసెడు వేళ
నా నాలుకపై నీ - నామముంచుమా
నా భావములో నీ - రూపముంచుమా ||
____________
ప.| హరీ.......శ్రీహరీ..........!
నాదు మొఱలను వినవో ఒక పరి
||అ.ప.| ఖలవిదారీ.....ఓ మురవైరీ
విన్నపమయ్యా....వినరావయ్యా
||చ.| నేనను భావన - నాకేమున్నది?
నీవే నేనని - నా మనసన్నది
నా చేతలు నీ - సంకల్పితమే
కరణములన్నీ- నీకర్పితమే
|| చ.| మదిలో కోర్కెల - మడియగ జేయుము
మధురముగా నా - తలపుల నిలువుము
మోహము వలదు - పాశము వలదు
నీ పదసన్నిధి - పెన్నిధి నిడుము
|| చ.| ఎదలో వెతలను - భంగము జేయుము
అంతరంగమున - నీవే నిలువుము
ఆరడి వలదు - క్లేశము వలదు
హాయిగ పిలుచుకో - త్రాసము వలదు
|| చ.| ప్రాణోత్క్రమణము - కలిగెడు వేళ
జీవనయాత్ర - ముగిసెడు వేళ
నా నాలుకపై నీ - నామముంచుమా
నా భావములో నీ - రూపముంచుమా ||
____________
No comments:
Post a Comment