గుత్తిదొండకాయ కారం పెట్టి కూర - అచ్చంగా తెలుగు

గుత్తిదొండకాయ కారం పెట్టి కూర

Share This
గుత్తిదొండకాయ కారం పెట్టి కూర
పెయ్యేటి శ్రీదేవి

కావలసిన పదార్ధాలు :
లేత దొండకాయలు, కూర కారం, కొబ్బరిపొడి, ఉప్పు, నూనె 
తయారీ విధానం :
          లేత దొండకాయలు బాగా కడిగి, ముచికలు తీసి, చాకుతో గుత్తిలా చీలిక చెయ్యాలి.  మూకుడులో ఒక గ్లాసు నీళ్ళు, తగినంత నూనె వేసి దొండకాయలు అందులో వేసి, కొంచెం సోడా వేసి, మూత పెట్టి, పెద్ద మంట పెట్టి మగ్గనివ్వాలి.  మూత తీసి చూస్తే నీరు ఇగిరిపోయి నూనె వుంటుంది.  ఆ నూనెలో బాగా ఎఱ్రగా వేగాక కూరకారం, కొంచెం కొబ్బరిపొడి, ఉప్పు వేసి కలియపెట్టాలి.  బజార్లో నల్ల కారప్పొడు దొరుకుతుంది.  అది కూడా వెయ్యవచ్చు.  జీలకఱ్ర్ర కారం వేసి, కొంచెం శనగపిండి చల్లినా బాగుంటుంది.

No comments:

Post a Comment

Pages