హేరంబా
- చెరుకు రామమోహనరావు
హేరంబా యని ఆలపించెదను
అంబా సుత ఆరంభామునే
అక్షరమౌ నీ భిక్ష కొరకు
సంరక్షక చక్షుర్వీక్షణమ్మునకు
మనసేమో మరి మరిగే నీరది
నిలకడ లేకయే నీల్గుచున్నది
చిత్రమైన నీ చేతి చలువతో
చిత్తము నీపై చిత్తగించుమా ||హేరంబా||
ఆగమ యోగామవేమో ఎరుగను
రాగభోగ సంరక్తుడను
నీపై రాగము నీ భోగమె, నా
కిహపర సాధనమిక ఇభవక్త్రా ||హేరంబా||
No comments:
Post a Comment