కూష్మాండం కర్రీ - అచ్చంగా తెలుగు

కూష్మాండం కర్రీ

Share This

కూష్మాండం కర్రీ

- పిన్నలి గోపీనాథ్ 


కావలసినవి :
నిష్పల కూష్మాండం..వొహటి
ఆవాలు ఆరు చేరెళ్ళు
మెంతులు మూడు ... డిటో ...
పచ్చి పప్పు నాలుగు ...డిటో...
చాయ పప్పు ఐదు .... డిటో...
జీరా .... మూడు చిటికెలు
మిరియాలు ...నాలుగు చిటికెలు
నూనె ఏ బ్రాండైనా సరే, యెంతైనా వోకే
జర్నలిస్టులు ఇద్దరు లేక ముగ్గురు చాలు
నీరు దొరికితే డ్రమ్ముడు
పసుపు 50 గ్రాములు
కొబ్బరి నూనె 100 గ్రాములు
ఆస్యామృతం వొహటీ లేదా రొండు బుక్కెళ్ళు
మినీ టవల్
మూత లేని పెట్ట వీలు కాని గిన్నె
ఉల్లిపాయలు లేదా గువాహటి మిర్చి .... అరకిలో
చల్ల బీరువాలు వొహటో రొండో
వెజ్ కట్టరు లేదా చాకు లేదా బాకు
తయారీ విధానం:
----------------
ముందుగా కూష్మాండాన్ని కడుక్కోవాలి.(డమ్ముడు నీటిలో కాసి్ని అందుకే మరి). తర్వాత చాకు లేదా బాకుతో పై చెక్కు తొలగించాలి. ఆమైన కట్టర్ సాయంతో సన్నని ముక్కలుగా నరుక్కోవాల. తర్వాత స్టవ్వు పైన భాండీ వెట్టి వెలిగించాల. భాండీని కాదని మనవి. స్టవ్వునే. తర్వాత భాండీలో నూనె పోయాల. అది కాగిన తర్వాత ఆ సంగతి రూఢి కావడానికి వేలు ముంచి చూడాల.
రూఢి ఐనంక దినుసులన్నీ పోపు చేసుకోవాల. దరిమిలా అవి ఈశ్వరి అవతారం యెత్తక మునుపే కూష్మాండం ముక్కలు అందులో పడయాల. ముఖ్య విషయం ఉల్లి ఐనా, గువాహటి మిర్చి ఐనా నీరు తెప్పించడానికే ననేది గమనార్హం. ఓ పావుగంట అలా పోయిరావాల. యాడకో కాదు.బీరువాలు పొజిషనులో పెట్టుకోడానికే...
కర్రరీ రెడీ ..
దానిని ముందుగా మూత లేని లేదా పెట్ట వీలు కాని గిన్నెలోకి తీసుకోండి. అప్పుడు ఆ గిన్నెను సాధారణ చల్ల బీరువాలో దాచండి. నన్ను తప్ప నాలాంటి వారినీ లేదా చుట్టాలను పిలవండి.
విషయం తెలిసేక వారు రావడానికి సమయం పట్టక పోదు కదా ..కనుకనే బీరువా.
వచ్చాక వారి చేతులకు ఆస్యామృతం పేజీలు తలాకాసిని పంచండి. (తిరిగి కుట్టుకో లేదా అతికించుకో వడానికి వీలుగానే పేజీలు బయటకు లాగాల మరి.)...వారు తాము చూస్తున్నదే తప్ప తింటున్నదేమిటో గుర్తించరు. కటు కషాయ లవమ తిక్కాది రుచులూ పసిగట్టలేరు కదా.
దరిమిలా కర్రీని కంచంలో వేయండి. వోవర్ ...
పసుపు ప్రయోజనం....కూష్మాండం నరుకుతున్నప్పుడు వేలు తెగితే.....కొబ్బరి నూనె బాండీగారి ని చేయి ముద్దాడినపుడు సముదాయించడానికి. చల్ల బీరువాలలో రెండోది మంచిదై ఉండాలి. యెందుకో ఈ తెలిసిందేగా...పచ్చడి దెబ్బకు మొదటిదాని పనైపోతుంద కదా మరి...
రైఠో. మరి నే ఉంటా....టాటా...

No comments:

Post a Comment

Pages