మద్దాలి కిన్నెరసాని - అచ్చంగా తెలుగు

మద్దాలి కిన్నెరసాని

Share This

మద్దాలి కిన్నెరసాని

- బ్నిం 


శింజారవం గురించి ఎవర్ని గురించి రాయాలి - భయమేస్తోంది - చుట్టూరా మయిల్స్ తో చుట్టుముట్టేస్తోన్న డ్యాన్సర్స్ ని (నాట్యగురువులని చూస్తూఉంటే కంఫ్యూజన్ - ఒకామె బెంగ్లూరు నుంచి కన్యాకుమారి గురించి రాయమని మెటీరియల్ పంపారు. ఇంకో పెద్దావిడ USA నించి ఒక సబ్జెక్ట్ చెప్పి గంటన్నర బేలే కావాలి అన్నారు. మరో USA ఆవిడ బాబూ --ఏమైంది నా "పౌలస్త్య హృదయం' మిగిలిన పాటలు అంటున్నారు.
ఇంకో బంగరుతల్లి 'వినాయక వైభవం' లో విఘ్నాలు తొలగలేనందుకు పందిళ్ళు పళ్ళు కొరుకుతోంది. ఇంకో పెద్దావిడ 'వెంగమాంబ ' మెటీరియల్ సంపాదించాను..ఎప్పుడూ కలుద్దామని బెదిరిస్తున్నారు.
నేను వినాయక చవితి హోర్లో (మా ఇంటి ముందే మైకారావు) బుర్రపని చేయక గిలగిల్లాడుతున్నాను.
శింజారవం లో ఏం రాస్తావ్ బంగారూ అని హెచ్చరిస్తున్న గన్ పట్టుకొని పద్మిని గారు నిలబడితే ఏం రాస్తాను..?
నేను పాటలు రాయాలంటే నా తాళాలు నాకుండాలి - నా మనసులో ఏదో రాగం మెదలాలి - "కోడిబాయె లచ్చమ్మదీ" అనే సూపర్ హిట్ తీన్మార్ పాటలు వినిపిస్తే రాసేదెట్లా - శబ్ద కాలుష్యం నేను చేయాలి - నా పాటల్తో గానీ ..నేను ఇరుక్కున్నాను.
మద్దాలి ఉషా గాయత్రి గారు అసలు ఈ నెలకి ఎంచుకున్న నాట్య గురువు. ఆమె కిన్నెర ఆర్ట్ థియేటర్ గారి (రఘురాం) అర్ధాంగి. ఆవిడ అసలు పేరు 'నృత్య కిన్నెర '(కిన్నెర తో అనుబంధ సంస్థ). రెండు మూడేళ్ళు దాటింది..పాతికేళ్ళ కిన్నెర పండగ జేసి- అప్పుడు నన్ను సన్మానించారు కూడా - ఆ రోజు నేను రాసిన 'మాతృదేవోభవ ' నృత్య రూపకం ప్రధమ ప్రదర్శన. సత్య యుగం, ఆతర్వాత నాలుగు యుగాల్లోనూ నలుగురు తల్లుల కధ ...వినాయకుడి తల్లి -  ప్రహ్లాదుడి తల్లి - లవ కుశల తల్లి - శ్రీకృష్నుడి తల్లి - వేంకటేస్వరుని తల్లి -  వీరి పాత్రలని ఆ మహాతల్లి ఉషా గాయత్రి ధరించే లా డిజైన్ సాను.  నా రచనకి మంచిపేరే తెచ్చింది ఆవిడ కొరియోగ్రఫీ ఇంకా ప్రెజంటేషనూ.
ఆవిడతో నా స్నేహానికి కూడా పాతికేళ్ళు ఉంటాయి.
నాకు గుర్తున్నంతలో ....'మా తెలుగు తల్లికి మల్లెపూదండ ', 'స్వర్ణోత్సవ భారతి ', 'గోదాకళ్యాణం ' ఇంకా ఏవో ఏవో 12 నృత్యరూపకాలు రాశాను..ఇంకా ఎక్కువో ..కొంచెం తక్కువో !!!
వారి సంస్థకి రాయటమే నాకు ప్రతిష్ట అని వారు నమ్మించటానికి శాయశక్తులా భావరాగలయాత్మకంగా చతుర్విదాభినయాల్తో నమ్మించే గొప్ప ప్రదర్శనలే ఇచ్చారు.
ఇప్పుడు ఇంకోటి రాయాలి ! అదే వేంగమాంబ సబ్జెక్టు !
శ్రీమతి మద్దాలి ఉషా గాయత్రి గారు ...వయసుకి తగినె పాత్రల్ని నృత్యరూపకాలుగా చేయ్టం నాకు ఎంతో ఇన్స్పిరేషన్ !
ఆవిడకి ఎన్నో బిరుదులు వచ్చాయి.
డాక్టర్లు ఇంజినీర్లుగా ఎదిగి నృత్యకళాభ్యాసం వీడక అనుసరిస్తున్న శిష్యులు ఎంత మందో.
రైటో తప్పో నేను గమనించినంతలో ఆవిడ ఇన్స్టిట్యూట్లో మగపిల్లలకి అడ్మిషన్ ఉండదేమో. ఆవిడకి అవిభాజ్య ఆంధ్రప్రదేష్ తాలూకు ప్రతిష్టాత్మకమైన కళారత్న (హంస) అవార్డు వచ్చింది. ఆవిడ శిష్యురాళ్ళ అరంగేట్రం మహోత్సవాలు ఎన్నో నిర్వహించినపుడు ఆవిడ 'గురుపరిచయం ' జగద్విదితమే కనుక నేను రాయను.
ఒక సొంత డబ్బా ఇక్కడ నేను కొట్టుకోక తప్పదు. నాకూ అవిభక్త ఆంధ్రప్రదేష్ వారి ప్రతిష్టాత్మకమైన 'కళా రత్న ' (హంస) అవార్డు వచ్చింది పాపం!ఆ విషయం నాతో పటు అందరం మర్చిపోయేలా జాగ్రత్తలు తీసుకుంటాను.
నా కంటికి కనిపించకుండా - నా ఎత్తుకు మించిన అవార్డులూ సర్టిఫికేట్లు కప్పెట్టేయడం నాకు ఇష్టం లేండి .. అది నా పద్ధతి. అందుకే వారి వారి ఇన్విటేషన్లలో కేవలం రచన బ్నిం అనే (వేస్తే ) వేస్తారు - అదీ మానేశేవాళ్ళు చాలా మందే ఉంటారు.  అలాక్కాక డా . శ్రీమతి ఉషా గాయత్రి గారు మన 'గోదాకళ్యాణం ' ఫలానా చోట వేస్తున్నాం , మన 'పుష్కర పులకిత గోదావరి ' ఇన్నిచోట్ల వేస్తున్నాం అని ఏ ప్రదర్శన ముందైనా ఫోనాడి చెప్తారు
ఇక్కడింకొక్క మాట ..ఉషా గాయత్రి మేడం కి నేను రాసిన అన్ని 'బేలేలు ' ట్యూన్ డైరెక్టర్ ఒకరే కావడం - ఆ బంగారు తల్లి పేరు శ్రీమతి వెంపటి శ్రీవల్లీ శర్మ. ఆవిడ గురించి చాలా చెప్పాలి . వచ్చే నెల శింజారవం ఆమెదే..గుర్తు చేయండి.
ఉషాగాయత్రి గారు కంపోస్ చేసిన డాన్స్ వీడియోలు క్రింది లింక్ లో చూడండి.

No comments:

Post a Comment

Pages