శివం – 16 - అచ్చంగా తెలుగు

శివం – 16

Share This

శివం – 16  

(శివుడే చెబుతున్న కధలు )

రాజ కార్తీక్
9290523901
(  శివభక్తుడైన సాంబయ్య కధను చెబుతుంటాడు శివుడు..)

‘హరహరమహాదేవ’ ‘శంభోశంకర’ అంటూ అందరూ పూజలు చేస్తున్నారు. అటుగా వెళ్తున్నాయి అక్కడి రాజపరివార వాహనాలు. అక్కడ అందరూ ఈశ్వరుడి సాక్షాత్కారం కోసం యజ్ఞాలు చేస్తున్నారు. “తత్త్వజగతిమనస్వి” ఈశ్వర అంటూ అందరూ నా కోసం ప్రాధేయపడుతున్నారు. రాజపరివార పల్లకీలో వెళ్తున్నాడు ఆ రాజు “ఉద్భవుడు”.
ఉద్భవుడు పల్లకీలో ఎన్నో గ్రంధాలు చదువుతున్నాడు. అక్కడి ప్రజలు రాజుగారి పల్లకీ వచ్చిందని అభివాదాలు చేస్తున్నారు. యజ్ఞ నిర్వహకులు మహారాజుగారికి ప్రసాదం ఇవ్వటానికి అన్నట్లు వేచి వున్నారు. ఉద్భవుడు పల్లకీలో నుండి దిగాడు. అందర్ని తదేకంగా చూస్తున్నాడు. అక్కడ ఉన్న ఒక పెద్ద శివాలయ గోపురం వైపు చూస్తున్నాడు. ఎవరూ ఎంత పలకరించిన ఉద్భవుడు పెద్దగా స్పదించుటలేదు. ఏదో ఆలోచనలో ఉన్నాడు. అక్కడి ఆలయ పరివారం వారు వచ్చి యజ్ఞయాగాది నిర్వహణకి సహాయం చేయమని రాజుని అర్ధించారు. కానీ ఉద్భవుడి మౌనం ఎందుకో వారికి అర్ధం కాలేదు అక్కడి రాజద్యోగులు రేపు రాజసభకి రమ్మని, రాజుగారు దీర్ఘాలోచనలో ఉన్నారు అన్నారు.
అక్కడి ఒక పురోహితుడు నా పూజ తన్మయత్వంలో “మహేశ్వరుడు భోళుడు, పిలిచినా వెంటనే రాగలడు”, మరో భక్తుడు “శివునికి రూపం లేదు, రాజనాఘుడుకి అందరూ ఒకటే” అంటూ, రాజుగారు తన పల్లకి వైపు అడుగులు వేస్తున్నాడు. అడుగు అడుగుకి అందరూ నన్ను స్తుతిస్తున్న పలుకులు వింటున్నాడు. “వినాయక, కుమార మీ భాగ్యం ఏమిటి, ఈశ్వరుడిని తండ్రిగా పొందారు”, “రాక్షసులకు సైతం వరాలిచ్చిన అశుతోషుడు”, “స్మరణ మాత్రాన ముక్తి నిచ్చే మహాదేవుడు”, “లోకాలపాలకుడై కూడా విభూది ధరించే విరాగి”, “గంగని తలమీద బంధించిన జటాధరుడు”, “కళలను సైతం పూజగా భావించె నటరాజు”, అంటూ, అడుగు అడుగుకి ఉద్భవుడు వింటున్నాడు. పల్లకి ఎక్కబోతున్న అతడు మరొకసారి ఆలయంవైపు పరికించి చూశాడు. పరివారం కూడా అందరూ చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు. ఉద్భవుడి చేతులు నమస్కారానికి పైకి లేచి కూడా ఆగిపోయాయి. “మహారాజు ఆలయ వెలుపలకి వెళ్ళి పూజించకపోయారు” అంటున్నారు కానీ, అవి ఏవి పట్టించుకోని ఉద్భవుడు ఇంకా అదే దీర్ఘాలోచనలో ఉన్నాడు. పల్లకి అంతఃపురం వైపు వెళ్లింది. ఉద్భవుడు తన అంతరంగిక మందిరంలోకి వెళ్ళాడు. అతనికి నన్ను మిగతావారు స్మరించిన ఉదంతాలు చెవిలో మారు మ్రోగుతున్నాయి. అతని మనసు ఎన్నో ప్రశ్నలకు సమాధానం అడుగుతుంది ఎంతమంది మహారాజుని పలకరిద్దామని వచ్చిన ఎవర్ని కలవడంలేదు, ప్రశ్నించుటలేదు. రాజ్యభారాలు కూడా ఏమీలేవు. ఉద్భవుడి పాలనవల్ల అందరూ సంతోషంగా ఉన్నారు. కాలం గడిచిపోతుంది. రాజుగార్ని ఎంతో ఉత్సకతతో చూసిన వారు అందరూ ఇప్పటి మౌనాన్ని చూసి అవాక్కవుతున్నారు. అసలు ఏమైంది మహారాజుగారికి, ఎంతో మంచివారైన మహారాజుగారికి ఏమన్నా మానసిక జబ్బు చేసిందా అని అందరూ అనుకోసాగారు. కానీ, ఉద్భవుడు తన రాజకార్యాలు మాత్రం నిర్వర్తిస్తున్నాడు. మంత్రిగారి చనువుతో అక్కడికొస్తున్న దైవకార్యకులకు రాజ్యంలో మాత్రము అన్ని సమకూరబడుతున్నాయి.
          మంత్రిగారికి ఉద్భవుడు చిన్నప్పటి నుండి తెలుసు, “ఉద్భవుడు పసితనం నుండి ఎంతో చురుకైనవాడు, అన్ని విద్యలో ఆరితేరాడు, అన్నిటికీ మించి చాలా మంచివాడు, తన తండ్రి చనిపోయిన తర్వాత, సింహాసనం అధిష్టించిన 2 సంవత్సరాలు కాలేదు, కాని రాజకార్యలెన్నిటినో చక్కబెట్టాడు, అన్నిటిని పరిశీలించిన మీదట తన తండ్రి కాలంచేసిన దగ్గర నుండి ఉద్భవుడికి ఇలా ప్రస్నార్దాం ఏర్పడింది” అంటున్నాడు మంత్రి ఎవరితోనో
ఉద్భవుడి అంతరంగిక మందిరంలోకి ఎవరికీ ప్రవేశం లేదు, మంత్రిగారు ఒకనాడు ఉద్భవుని కోసం వెళ్ళారు. ఉద్భవుని అంతరంగిక మందిరంలోకి రానివ్వకుండా బయటకి వచ్చి మాట్లాడారు. మంత్రి “ఉద్భవా! ఇప్పుడు నిన్ను రాజుగా చూడట్లేదు, నీవు పసితనం నుండి నాకు తెలుసు, నీ కర్తవ్యాలలో ఏమి లోటులేకపోయినా, ఎందుకు నీవు అలా ఉంటున్నావు. మీ తండ్రిగారికి ఇచ్చిన మాట ప్రకారము, నీకు తగిన రాజకన్యని ఇచ్చి వివాహం చేయాలి, కానీ నీవు ఏ మాట మాట్లాడుటలేదు. దేనికి నాయనా! నీ తండ్రి గొప్ప శివభక్తుడు, అతగాడి, తపస్సు ఫలితంగా నీ వంటి రత్న సమాన కుమారుడు మాకు రాజుగా లభించాడు కానీ నీవు”
ఉద్భవుడు: “మంత్రివర్యా, మీరు ఏమన్నారో నాకు అర్ధం కావటం లేదు, మరొక్కసారి చెప్పండి”.
మంత్రిగారు: “ఏమిటి, ఆ పరధ్యానం చెప్పు ఉద్భవ,”
ఉద్భవుడు:...........?
మంత్రి: “ఉద్భవా! నీకు తగిన రాజకన్యను చూసాను, జాతకము గుణించాను, తగిన కన్య ఆమె నీకు, ఆమెను నీతో వివాహం ఏర్పాటు చేయుచున్నాను, నీ తండ్రికి ఇచ్చిన మాట నేను నెరవేర్చుకోవలెను”,
ఉద్భవుడు: ...........? నాకు కొంత సమయం ఇవ్వండి అంటూ, మళ్ళీ అతరంగిక మందిరంలోనికి వెళ్ళాడు. రోజులు గడిచిపోతున్నాయి.
అందరూ రాజుగారి వైరాగ్య వైఖరిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాజ్యంలో ఇంకా పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఉద్భవుడి మనసు అంతే ఉంది, .... ఎవరికీ ఏమి తెలీదు, కాని అన్ని నాకు తెలుసు, ఎందుకంటే అన్ని చేసేది నేనే, చేయించేది నేనే, ప్రశ్నే నేను, సమాధానం కూడా నేను,....
“హరహరమహదేవ” అంటూ నన్ను స్మరించే భక్తుల హృదయం నాకు తెలుసు, వారికోసం ఏమైనా చేస్తాను,... ఇక, ఉద్భవుడు కోసం ఏమి చేసానో చెబుతా వినండి... ఉద్భవుడు కఠినంగా మారిపోతున్నాడు.
(కధలు కొనసాగుతాయి...)

No comments:

Post a Comment

Pages