శ్రీధరమాధురి -19
(సచ్చిదానందం... అంటే ఏమిటో, పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృతవాక్కుల్లో చదవండి.)
మీ కళ్ళు ఆరాధించేవన్నీ...
మీ మేధ ఆశించేవన్నీ...
మీ జీవితము నుంచి మీకు కావలసినవన్నీ...
మీకు దక్కాలని నేను ప్రార్ధించినవే – ఎందుకంటే, ఇవన్నీ నెరవేరాకా, మీరు వాటిని అధిగమించి అసలైన ఆనందం వైపు, అసలైన ఉత్సవం వైపు, అసలైన ఆనందనాట్యం వైపు దృష్టి పెడతారు. అదే అత్యున్నతమైనది. సత్ – చిత్ – ఆనంద – దైవంతో ఆడిపాడే ఆనందనృత్యం.
****
దైవానికి మీరంటే ఎంతో ప్రేమ. అపారమైన ప్రేమ ఆయనకు మీ పట్ల ఉంది. ఆయన మీతో ఆడతారు, మీకు ముద్దు పెడతారు, మిమ్మల్ని హత్తుకుంటారు, ఆ పారవశ్యంలో ఆయన మిమ్మల్ని గద్దిస్తారు, మీ కాలు లాగుతారు, ఆటపట్టిస్తారు. ఆయన మర్యాదలకు, మన్ననలకు అతీతులు, మీ ప్రార్ధనలప్పుడు ఆయన్ను గౌరవించే మీ మన్ననను ఆయన గౌరవిస్తారు. కానీ అయన చాలా మామూలుగా ఉంటారు. మీ నుంచి దూరం కావడం ఆయనకు ఇష్టం లేదు. కృష్ణుడు గోపగోపికలతో ఎలా ఉండేవారో మీకు గుర్తుందా? ఆయన వారితో నర్తించారు. పక్షులు, పశువులు, వృక్షాల కోసం మురళి ఊదారు. ప్రకృతిలోనే ప్రతి అంశం, దైవగానాన్ని వినడానికి చాలా అప్రమత్తంగా ఉండేది. ఆయన వారిలో ఒకరిగా కలిసిపోయారు. తన సృష్టి లోని ప్రతి అంశంతో రమించారు. సృష్టిని సృష్టించిన సృష్టికర్తే అయినా తన సృష్టిని రంజింపచేసారు. ఆయన అన్నిటితో పారవశ్యంగా గడిపి, మనందరినీ ఉత్సాహపరిచారు. దైవంతో ఆడి, పాడి, ఆనందంగా గడపండి. అదే సత్ – చిత్ – ఆనందం – అంటే. అంతా దైవానుగ్రహం.
****
తంత్ర చాలా అద్బుతమైనది. కానీ, ఈ రోజుల్లో, దురదృష్టవశాత్తు దాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారు. దాన్ని వక్రీకరించారు. దాని అర్ధాన్ని సారాన్ని, పూర్తిగా అనుమానాస్పదం చేసారు. పూర్వకాలం నుంచి మీరు అహానికి ప్రాధాన్యం ఇచ్చేలా శిక్షణ ఇచ్చారు. ఎవరికీ ఈ అహం నుంచి క్రమంగా బయట పడడానికి, ఎవరూ శిక్షణ ఇవ్వలేదు. అహం మనిషిని భ్రమలకు గురిచేస్తుంది, తంత్ర ఈ అహానికి అతీతమైనది. తంత్ర అంటే స్వచ్చమైన ప్రేమ ఈ ప్రేమ తారస్థాయిలో ఉన్నప్పుడు, అది తెలివితేటల్ని సవాలు చేస్తుంది. ఒక శూన్యస్థితికి చేరుకుంటుంది. ఋషులు, మునులు దాన్ని శాశ్వతంగా పొందడం వల్ల, అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. తంత్ర దాన్ని వారు పొందేలా చేసింది. తరతరాలుగా, మనలోని చాలామంది శృంగారాన్ని ఖండిస్తూ, దాన్ని వ్యతిరేకించేలా ఉద్దేశ పూర్వకంగా చేసారు. అందుకు అసలు కారణం, అది అహానికి వ్యతిరేకమని. మనసు ప్రేమతో నిండినప్పుడు, అహానికి చోటుండదు, ఇది విషయవస్తువుల పరంగా పురోగతి సాధించే సమాజానికి సవాలుగా మారింది. అందుకే ప్రేమించడాన్ని ఖండించి, తద్వారా తంత్రాన్ని కూడా ఖండించారు. ఎందుకంటే తంత్ర యొక్క మూలాలు ప్రేమలో ఉన్నాయి. దానికి బదులు యోగాకు ప్రాధాన్యం ఇచ్చారు. అందులో కూడా, సుప్తావస్థలో ఉన్న మనసులు జాగృతం చేసే యోగా కాకుండా, హఠయోగాన్ని ప్రోత్సాహించారు. ఎందుకంటే,అది అయురోగ్యాల్ని ఇస్తుంది. నేను ‘హఠయోగి’ ని అని కొందరు చెప్పుకునే అహాన్ని ఇస్తుంది. నిజానికి, యోగ, అహం కూడా వ్యతిరేకమైనవే. పతంజలి చెప్పిన యోగ, బాహ్యస్థితికంటే, అంతఃస్థితిని మేల్కొలిపేవి. దురదృష్టవశాత్తు, ప్రజలు బాహ్యానికే అలవాటుపడి, అంతఃకరణ మరిచారు. తంత్రా అహాన్ని ప్రేమతో చేరగానే, అహం మాయమయ్యింది. సృష్టి, ప్రతి సృష్టి అనే సాధారణ అంశాలకు తంత్ర అతీతమైనది. ఇది ఒకరి ఉనికి మూలాలను తాకి, స్వచ్చమైన ప్రేమ ద్వారా, వారి నిజస్థితిని గుర్తించేలా చేస్తుంది. తంత్ర అంటే నిజస్థితిలో పరమానందానుభూతితో దైవంతో నర్తించడం – సచ్చిదానందం.
****
సద్గురువును ధ్యానించడం వల్ల ఒకరు దక్షిణామూర్తిని అనుభూతి చెందగలుగుతారు. ఈయనే జ్ఞానప్రదాత, మనల్ని స్వచ్చపథంలో నడిపి, చివరి మజిలీకి చేరుస్తారు. దీన్నే మోక్షం అంటారు. ఆయన మనకు జీవితపు అందమైన వాస్తవాల్ని మనకు బోధించి, అన్ని అంశాల్ని పక్షపాతరహితమైన మనసుతో, ఆలోచనల్లో పవిత్రతతో చూసేలా చేసి, దైవంతో చేసే దివ్య నృత్యాన్ని ఆస్వాదించేలా చేస్తారు. సచ్చిదానంద.
****
మూడు ఆధ్యాత్మిక సిద్ధాంతాలు, మొత్తం జీవితాన్ని నిర్మిస్తాయి. ఈ మూడు సత్యం, శివం, సుందరం, అనే వాటితో జీవితం నిర్మితమవుతుంది, ఇదే సచ్చిదానందం. సత్య, చిత్త, ఆనందమే – సత్యం, శివం, సుందరం. అందుకే ఒక వ్యక్తి జీవితాన్ని అంగీకరించినప్పుడు, అతను జీవితాన్ని పరిశీలించే దశకు చేరతాడు. అలా పరిశీలించినప్పుడు అతను ప్రేమ, దయతో కూడిన అత్యున్నత స్థితికి చేరతాడు. అప్పుడు అతనిలో దివ్య నర్తన మొదలై, అతన్ని అద్భుతమైన వ్యక్తిగా మారుస్తుంది.
****
భౌతిక శాస్త్రానికి ఎంతో తర్కం అవసరమని నేను అంగీకరిస్తా . ఆదిభౌతిక శాస్త్రంలో ఇది పనిచెయ్యదు. కేవలం ‘ఆశ్చర్యం’ మరియు ‘చెదరని విశ్వాసం’ మాత్రమే ఉపయోగిస్తాయి. భౌతిక శాస్త్రం పరిపూర్ణ విచారణ. ఆదిభౌతిక శాస్త్రం ‘ఆత్మవిమర్శ’ చేసుకునే ప్రక్రియలో నడిపిస్తుంది. దీనిద్వారా మీరు ఆశ్చర్యంతో ‘విశ్వచైతన్యం’ లో లేక ‘పరమాత్మ’ ను చూసి నిశ్చేష్టులవుతారు. పరమాత్మ నుంచే జీవాత్మ వచ్చింది. ఆత్మవిమర్శ ద్వారా, మనం ఆశ్చర్యంతో పరిశీలిన దశకు, ఆపై విశ్వచైతన్యానికి చేరతాము. ఇప్పుడు జీవాత్మ, పరమాత్మలో లయమవడానికి సిద్ధంగా ఉండి, ప్రేమతో, అమితానందంతో నర్తిస్తుంది. సచ్చిదానందం. అంతా దైవేచ్చ, దయ, అనుగ్రహం.
*****
సత్ – చిత్ – ఆనందం – ఆనందంతో వేడుకగా నర్తించండి. మీ ‘ధ్యాన’మంతా ఆడి, పాడడం చుట్టూ నర్తించాలని ప్రార్ధిస్తున్నాను. ఆయన దయ, కొందరు ప్రేక్షకుల కోసం ఆడి, పాడతారు. కొందరు మెప్పుకోసం, కొందరు ఆరాధించడం కోసం పాడుతూ నర్తిస్తారు. మేము మా నిజస్థితి కోసం నర్తిస్తాము, అంటే దైవం కోసం. ఇప్పుడు ఆడి, పాడడం కూడా ఒక వ్యాపారం అయిపోయింది. అందులో కూడా పోటీనే పాటల పోటీ, నాటకపోటీ, ఆవార్డులు, రివార్డులు – సంగీతం, నాట్యం హృదయానికి సంబంధించినవి. ఈనాడు ఈ రకమైన పిచ్చితో అది తెలివితేటలకు సంబంధించిన అంశం అయిపొయింది. చాలా మంది గానం, నాట్యం అహంతో కూడి ఉంటుంది. మరొక చెడ్డ అంశమైన ‘అసూయ’ అనేది కూడా వీటిలో ఎక్కువవుతోంది. ఎవరైనా వింటున్నారా?
****
జీవితంలో ఏది ఎలా ఉంటే, దాన్ని అలా మీరు పరిశీలించడం నేర్చుకోవాలి. మీరు ముందుగానే ఊహించకూడదు. ఈ ఊహలు, అపోహలు, పరిశీలించడం అనే ప్రక్రియను నిరోధిస్తాయి. మీరు సాక్షిగా ఉన్నప్పుడు, మిమ్మల్ని మీరు దేనిలోనైనా గుర్తించకూడదు. ఆ రకంగా, మీరు పరిశీలిస్తూ ఉన్నప్పుడు మీకు అన్నీ తెలిసినా, మీరు తప్పొప్పులు ఎంచకుండా, సమతుల్యతతో వ్యవహరిస్తారు. సాక్షిగా ఉండేటప్పుడు, అత్యున్నత స్థితిలో, ధ్యానమనే రూపంలో, మీ హృదయం పుష్పిస్తుంది. ఆ స్థితిలో మీరు నటరాజస్వామితో ఆనంద నాట్యం చేస్తూ ఉంటారు. ఓం నమః శివాయ... సచ్చిదానందం.
****
దైవం పర్యవేక్షిస్తున్నారు. దైవం మహావిష్ణువు రూపంలో ఆదిశేషుడిపై పవళించి, ‘యోగనిద్ర’ అనే గాఢ సుప్తావస్థలో ఉంటారని అంటారు.మన ప్రతి చర్యను ఆయన చూస్తున్నారు. తనను తాను ‘కర్తగా’ భావించని ఒక్క ఆత్మకోసం వెతుకుతూ ఉంటారు. అందుకే విశ్వంలో జరిగే ప్రతి దాన్ని ఆయన చూస్తూ ఉంటారు. ఈ పర్యవేక్షించే ఉన్నత దశలో, ఆయన యోగ నారాయణుడిగా ధ్యానిస్తూ ఉంటారు. ఆయన నటరాజస్వామి రూపంలో తన నాట్యాన్ని తానే ఆస్వాదిస్తూ ఉంటారు. శివుడు దక్షిణామూర్తి రూపంలో అత్యున్నత స్థితిలో ధ్యానిస్తూ, అన్ని చర్యల్ని పర్యవేక్షిస్తూ, కృష్ణుడి రాసలీల రూపంలో తన స్వంత దివ్యనాట్యాన్ని ఆస్వాదిస్తారు. ఆయనే సాక్షి, తన చర్యలకు సాక్షి, ఏ ఊహలకు, అపోహలకు అతీతులు, తన దివ్యనృత్యాన్ని ఆస్వాదించేవారు. సచ్చిదానందం – అంతా దైవానుగ్రహం, దయ .
****
No comments:
Post a Comment