తృణ బజ్జీలు - అచ్చంగా తెలుగు

తృణ బజ్జీలు

Share This

తృణ బజ్జీలు

- పిన్నలి గోపీనాథ్ 


--------------
కావలసినవి
------------
తృణాసురులు పది మంది
సెనగ పిండి ఆరు పిడికిళ్ళు
ఉప్పు చాలినంత
నిమ్మ ఉప్పు తగినంత
నూనె ఏదైనా సరే, ఎఁతైనా సరే
మూతకు తగని గిన్నె
కారం మూడు చిటికెళ్ళు
కాలెండులా అరసీసా
అశ్వని అర సీసా
డయనోరా చిన్నది
తువ్వాల పెద్దది
వాము నాలుగు చిటికెళ్ళు
జీరా మూడు చిటికెళ్ళు
నీరు వొహ బాల్చీడు
స్టవ్వు, లైటరూ, భాండి
సినిమా టికెట్లు వొహటి
----------------
ముందుగా  తృణాసురులను జాగ్రత్తగా కడుక్కోవాలి. యెవరూ జారిపోకుండా చూసుకుంటూ,అందరినీ నరకాలి. తర్వాత  సెనగ పిండీ, నూని, ఆ ఉప్పూ,ఈ ఉప్పూ, వామూ,జీరా,
అన్నీ చక్కగా చిక్కగా కలుపుకోవాలి.
తర్వాత స్టవ్వు వెలిగించి, దానిపై భాండీ పెట్టి  నూనె పోయాలి. వేలు మరిగే వరిగే చూసి అప్పుడు తృణాసుర శకలాలను పిండిలో ముంచుతూ భాండీలో వేస్తుండాలి. వారిలో ఎవరూ కాలుడు కాకుండా చూసుకోవాలి. తర్వాత మీరంటే బొత్తిగా పడని పొరుగింటి పిన్నిగారికి గిఫ్టుగా ఇవ్వాలి. వారింటికి వన్నాటైటు పోతున్నదో లేదో చూసుకోవాలి. అది గనుక వస్తున్న వాసన తగిలితే ఇల్లు ఆయనకు లేదా ఆమెకు అప్పజెప్పి మీరు చక్కహా సినిమాకు చెక్కేయాలి.
---------------------------------
తృణాసురులు యనగా ...కంగారొద్దు గడ్డి పరకలే.  కాలెండులా అనేది హోమియో వారి బర్నాల్. కాలుడు మాడిపోతే వచ్చు ఆకారుడు.
.............................

No comments:

Post a Comment

Pages