వద్దు బిడ్డా..! - అచ్చంగా తెలుగు

వద్దు బిడ్డా..!

Share This

వద్దు బిడ్డా..!

ప్రతాప వేంకట సుబ్బారాయుడు 


వద్దు బిడ్డా వద్దు
తొందరపడి నీ పానాలు తీసుకోమాకు
అడ్డాల నుంచి
అష్టకష్టాలు పడుతూ
నిన్ను సాకాము...
నీకు రెక్కలొస్తే మమ్మల్నాదుకుంటావని
మా రెక్కల కష్టం నీకు ధారపోస్తున్నాము.
నువ్వు సదువుకుని
మాకు వెలుగవుతావనుకుంటే
సోపతిగాళ్లేదో బనాయించినారని(ర్యాగింగ్)
నీ బతుకుని సీకటి సేసుకుని
మా కడుపున మంటబెడతావా?
వద్దు బిడ్డా వద్దు..తొందరపడమాకు
సదువులేకపోయినా మానె
పదికాలాలు మాకంటిముందు
సల్లంగ వుండు బిడ్డా!
(ర్యాగింగ్ మృత్యు దంష్ట్రాలకి బలైపోయిన యువత తల్లిదండ్రుల కడుపుకోతకు అశృనయనాలతో ఈ కవిత అంకితం)
***

No comments:

Post a Comment

Pages