వేరుశనగ - ఖర్జూర లడ్డూలు
లీలా సౌజన్య
వేయించిన పల్లీ(వేరుశనగ)లు 100 గ్రా.
సీడ్ లెస్ ఖర్జూరాలు 50 గ్రా.
50 గ్రా. బెల్లం
తయారుచేసే విధానం
వేరుశనగలు తొక్కతీసి, ఖర్జూరాలతో కలిపి గ్రైండ్ చెయ్యాలి. ఒక టీ స్పూన్ నేతిని బాండీలో వెచ్చబెట్టి, బెల్లం వేసి, కరగనివ్వాలి. కరిగిన బెల్లంలో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కలిపి, లడ్డూలు చేసుకోవాలి. ఇష్టమున్నవారు ఆల్మండ్స్ , జీడిపప్పులు కూడా వేయించి లడ్డూల్లో కలుపుకోవచ్చు. ఎంతో ఆరోగ్యకరమైన ఈ లడ్డూలు బయట కొంటే చాలా ఖరీదు ఉంటాయి. అందుకే, ఇంట్లోనే ప్రయత్నించి చూడండి. రుచిగా, ఆరోగ్యంగా తినండి.
No comments:
Post a Comment