అజరామర సూక్తి -- 5 - అచ్చంగా తెలుగు

అజరామర సూక్తి -- 5

Share This
అజరామర సూక్తి -- 5

 చెరుకు రామమోహనరావు 


कर्पूर इव दग्धोऽपि शक्तिमान् यो दिने दिने नमोऽस्त्ववार्यवीर्याय तस्मै कुसुमधन्वने- लोचन కర్పూర యివ దగ్ధోపి శక్తిమాన్ యో దినే దినే నమో స్త్వవార్యవీర్యాయ తస్మై కుసుమధన్వనే - లోచన పరమేశ్వరుని మూడవకంటికి ఆహుతి యగుటచే కర్పూరము వలె కాలి పోయి, మన్మధుడు , అనంగుడైనా అందరి హృదయాలలో కోరికలను నింపుచునే యున్నాడు. ఎంతటి బలశాలియో చూడండి. తనువే లేకున్నా తన బాధ్యతను మరువనివాడు.తన కుసుమబాణాలతో అందరి హృదయాలలో ప్రేమ చిగురింప జేయుచునే యున్నాడు. ఆయనకు కాముడు అన్నది మరొక పేరు.మన సనాతన ధర్మములో ప్రతి పేరుకు ఒక వ్యుత్పత్తి వుంటుంది. 'మన్మధుడు' అంటే మనస్సును మధించే వాడు.అంటే మనసును చిలికే వాడు. మరి ఒక కోరిక మనలో కలిగించి (మంచిదో చెడ్డదో ) అది నెరవేరే వరకు లేక ఎదురు దెబ్బ తగిలేవరకు మదన పరుచుతూనే ఉంటాడు. కాబట్టి మనసు ఇల్లయితే అందు ఆహ్లాదము కలిగించు అగరుబత్తి వెలిగించేతే ఆహూతులను ఆకట్టుకొంటుంది అదే ఆయిల్లు అమెధ్యమునకు ఆలవాలమైతే క్రిమి కీటకములకు ఆలయమౌతుంది. అందుకే వేదము 'ఆనో భద్రాః క్రతవోయంతు విశ్వతః' అన్నది. అంటే దశ దిశలనుండి నాపై సద్భావనా వీచికలు ప్రసరించు గాక అని. అప్పుడే అమిత బలశాలియైన మన్మధుడు మనలో నిజమైన ప్రేమను వెలయింప జేస్తాడు. ____________________________________________________________

No comments:

Post a Comment

Pages