చుక్క చిప్పలు ... సారీ ... చిప్పులు
-పిన్నలి గోపీనాథ్
కావలసినవి...
--------------
చుక్కాకులు పదారు
మైదా పిండి ...మూడు గుప్పిళ్లు
సెనగపిండి పది గుప్పిళ్ళు
ఉప్పు తగినంత
నిమ్మ ఉప్పు తగినంత
వాము నాలుగు చిటికెళ్ళు
పసుపు నాలుగు చిటికెళ్ళు
నెసా వొహటి
కొబ్బరాయిలు అరకాయ
నీరు తగినంత
నూని ఏదో వొహటి, యెంతో కొంత
ఆశీర్వాదం మూడు గుప్పిళ్ళు
జీరా మూడు చారెళ్ళు
రాంషాస్యాలు మూడు
సినిమా టికెట్టు వొహటి, సీడీ వొహటి
----------------------
ముందస్తుగా స్టవ్వు వెలిగించ వలెను. దానిపై భాండీ పెట్టుకోవాలి. అది వేడెక్కేలోగా చుక్కాకులను ముక్కలు చేసుకోవాలి. వాటిని అలా ుంచుకుని, ఈ పిండీ, ఆ పిండీ, వామూ, జీరా, ఈ ఉప్పూ, ఆ ఉప్పూ, కారం కలుపుకుంటూ నీరు పోసుకుంటూ... దరిమిలా బాండీ కాలిన తరావత అలా తెలియడానికి వేలు తగిలించి సూడాలి. అప్పుడు నూనె పోయాలి. జ్వాల జ్వాజ్వల్యం కావాలి. నూనె బాగా అనగా వేలుకు నూనె అవసరమయ్యేవరకూ కాగాలి. అప్పుడు, అంతకు ముందుగా కలుపుకున్న మిశ్రమంలో ఆకు ముక్కలు ముంచి నూనెలో వేయాల. కొద్ది సేపటికి యములుంగారు కనబడతాడు. అలా కనబడటానికికి ఐదు నిముషాల ముందుగా తీసేయాలి. పక్కింటి పిన్నికి శాంపిలివ్వాల. వన్నాట్యైట్ చప్పుడు గినా వొస్తే సినిమా సిడిని ఇంటాయనకు లేదా ఆమెకు ఇచ్చి మీరు సిన్మాకు చెక్కేయాల. లేకుంటే హాయిగా సిడీ యెట్టుకుని రాంషాను ఆస్వాదిస్తూ (సిడిలో సినిమా బాగుంటుందో లేదో సెప్పలేం మిరి)...ల ల ల లా
No comments:
Post a Comment