ధౌమ్య హితోక్తులు -4 - అచ్చంగా తెలుగు

ధౌమ్య హితోక్తులు -4

Share This

ధౌమ్య హితోక్తులు -4 

చెరుకు రామమోహనరావు 


6. అతిచిన్నపనినైనా రాజునకు ఎరుకపరచిన పిదప మాత్రమే చేయవలెను.ఆ విధముగా చేయుట వలన ఎటువంటి ఆపద సంభవించదు.
ఇప్పటి కాలములో రాజులు లెరు కాబట్టి మీ ఉన్నతాధికారిని వూహించుకొండి. మీ శత్రువులు మీతో పనిచేసే సహచరులలో పుష్కలంగా వుంతారు. మీరేదయినా చిన్నతప్పు చేసినారనిపించినా దానికి కమ్మలు కడియాలు తొడిగి అందంగా అలంకరించి అధికారి ముందుంచుతారు.ఆ తరువాత పరిస్థితి మీ ఊహకే వదలి వేస్తున్నాను. అందువల్ల చిన్నదికానీ అధికారికి చెప్పిచెస్తే ఆపద అడ్డు రాదు.ప్రసాధన (తొఇలెత్)పోవునపుదు కూడా చెప్పవలెనా అని అడుగవద్దు. ప్రక్కనున్న ఉద్యొగికి చెబితే అవసరమైతే  అడిగినవారికి తెలియబరుస్తాడు.ఈ మాటలు అల్పమైనవి అని నిర్లక్ష్యము చేయవద్దు.
 7. అగ్ని దేవతలను కొలిచినట్లుగా రాజును కూడా ప్రయత్న పూర్వకముగా సేవించవలెలను . కపట ప్రవర్తన మరణ హేతువు కావచ్చును
యాగము లొని అగ్ని కీలలు ఏడు. ఊర్ధ్వ లోకాలు ఏడు. అవి భూ,భువ,సువ,మహ,జన,తప.సత్య లొకములు. ఏడు లొకాలకూ హవిస్సులను ( దేవతల ఆహారము ) గొని పోయె వాడు అగ్ని. అందుకే ఆయనను సప్త జిహ్వుడు (జిహ్వ = నాలుక ) అనికూదా అంతారు.తాను జ్వలించినంతసేపూ హవిస్సులను మొసుకుపోతాదేతప్పితే దాచుకోదు. బంటుకు ఇంతకుమించిన ఉపమానము ఉండదేమొ! కపటమెప్పటికైనా కష్ట హేతువే.
 8. రాజు ఆజ్ఞాపించిన పనులను మాత్రమే చేయవలెను.
ఒకసారి నా అధికారి మరియు తనలాంటి వేరువేరు ప్రాంతీయాధికారులను వారి పై అధికారి సమ్మేళనమునకు (మీతింగ్) కు పిలిచినాడు. తప్పదుగదాయని తలపట్టుకొని బయలుదేరినారు వారంతా. వారిని, తాను చెప్పినపనిని ఎంతవరకు చేసినారని ప్రశ్నించుచూ ఎవరెవరు ఎంతవరకు చేసినారని నిర్ణయించి మావారిని(నా పై అధికారి, అంతేగానీ వేరు కాదు) ఆ క్రమములో చివర చేర్చటము జరిగింది. చిర్రుబుర్రులాడుతూ వచ్చిన మా అధికారికి కనిపించినది ఇద్దరమే. మిగత అధికారులు నిజగృహంబులకు జనియుండినారు అప్పటికే సాయంకాలము 7 గం. అయిపోయినందువల్ల. ఆయన, తాను వెళ్లి వచ్చిన సమ్మేళనముతో మా ఇరువురికీ సంబంధము లేనప్పటికీ, మమ్ము లోనికి పిలిచి తనపై అధికారి తన శరీరములోనికి పంపుటచేత  ఆవిరియైన తన భావాలను మాపై వదలినాడు. నేను అప్పటికి యువకుడినే. నా ప్రక్కనున్న అధికారి పెద్దవాడు. ఇద్దరమూ శ్రోతలుగానే వుండిపోయినాము కానీ నోరు మెదపలేదు. అంతా ముగిసినతరువాత వారికి నమస్కారము చెప్పి ఇళ్ళు చేరుకొన్నాము. తెల్లవారి ఆఫీసుకు,ఒక గంట ముందే పోవుట నా అలవాటు, చేరి నా పనిలో వుండగా మా అధికారి గారు కూడా ముందే వస్తారు కావున వచ్చిన వెంటనే నన్ను లోనికి పిలిచి ' ఏమి బ్రొథెర్ నేను నా బాధను అంతగా చెబితే నోరు మెదపకుండా విని ఇంటికి పోయినావే' అన్నారు. నేను వెంటనే 'సార్ మొదటి విషయము ఏమిటంటే అది నాకు సంబంధించినది కాదు. రెండవది ఏమిటంటే ఒకవేళ ఆ పనిని నాకు అప్పగించ వలెనంటే ఒకమాట ఈ పని నీవు చేయి అంటే నేను కాదన బోయేదీ లేదు మీకాచనువు నాతో లేకపోయిందీ లేదు.' మీరు ఆడుగకుండా నేను చేస్తాననుట  అత్యుత్సాహమౌతుంది పైగా నేను ముందుకు వచ్చి ఒప్పుకొని చేయలేకపోతే పెద్ద తప్పౌతుంది.' అన్నాను . 'నీతో చాలా కష్టము బ్రొథెఋ అంటూ ఆ పనిని నాకు ఒప్పజేప్పినారు. చెప్పినపని చేయగలిగినాను. కథ సుఖాంతమైనది. ఇందులో ధౌమ్య సూక్తులు మీరు గమనించవచ్చు .
ఇందులొ గమనించవలసినది 1.తనకు సంబంధము లెని విషయములో నొరుమూసుకొనియుండటము,2. రాజు అనుమతించిన పిదప పని కష్టమైనా పూర్తి చెయటము. ఇవి రెండూ ధౌమ్య హితోక్తులే. వీటివల్ల ఆత్మ సంతృప్తే కాక అధికారి మన్ననలను కూడా పొందవచ్చును.
తొందర పడే గొడ్డు మురికి నీళ్ళు త్రాగుతుంది అన్నది పెద్దల మాట
 9. నిర్లక్ష్యము,క్రోధము, గర్వము,సర్వే సర్వత్రా రాజాశ్రయమున వర్జింపదగినవి
భారతములోనే ఊద్యోగపర్వమునందు విదురనీతిలోని ఈ మాటను వినండి :
కోపము నుబ్బును గర్వము,
నాపోవక యునికియును, దురభిమానము ని
ర్వ్యాపారత్వము ననునివి,
కాపురుష గుణంబులండ్రు కౌరవనాధా
 భారతం. ఉద్యోగపర్వం. ద్వితీయాశ్వాసం -- 32 వ పద్యము
కోపం, పొంగిపోతూ వుండటం, అహంకారము, తృప్తిలేకపోవడం, తన గొప్పతనాన్ని అతిగా చూసుకోవడం, పనీపాటా లేకుండా పొద్దు పుచ్చడం ఇవినీచుల లక్షణాలని పెద్దలు చెబుతారు.
అహంకారికి గర్వము అది వుంటే నిర్లక్ష్యము వుండక తప్పదు. నిర్ల్కక్ష్యముంకు మూలము కోపమే! ఒక్క కొపము ఎన్ని దుర్లక్షణాలను కూర్చుతుందో చూదంది. వాల్మీకి వ్యాసులవారు కూదా 'క్షమయా నిష్ఠితాం జగత్' అంటే ఈ విశ్వమే సహనము (Tolerence) పై ఆధారపడియుందని చెప్పినారు.
సహనము వున్నచొట మరి కోపము వుండదుకదా!
కాబట్టి 'తన కోపమె తన శతృవూ అన్న వాస్తవాన్ని ఆచరణలో ఎంతగా వుంచితే అంత మంచిది.
ముఖ్యముగా పై అధికారి మూర్ఖుడై తన తాపేదారుపై కొపము ప్రకటించినపుడు.
10. ప్రియముతో కూడిన హితవు పలుకవలెను
ఒక వ్యక్తి తన ప్రభువు హితమును ఎప్పుదు కొరుతాడంటే ఆయనపై తన అభిమానము నిర్మలమైయుంటెనే.
నిర్మలత ఏర్పడా లంటే, ఆ స్వామిభక్తి స్వచ్ఛత కలిగియుండవలె. అప్పుడ సేవాప్రియత్వము  కలుగుతుంది. అదే నిజమైన ప్రేమ లేక భక్తి. హితవు కూడా అప్పుడు మనసారా చెప్పబడుతుంది.  పై వారితో మాట్లాడే    సమయయములో 'ఇట్లు చేయండీ అని చెప్పుటకంటే 'ఇట్లు చెస్తే బాగుంటుందేమో!' అనడము గౌరవముతొ కూడిన ప్రేమను సూచిస్తుంది.
ఆప్తుల  ప్రియ భాషణములను విని పాండవులు ఎంత మంచిని పొందినారో వినక కౌరవులు అంత చెడును పొందినది మనకు తెలిసిన విషయమే  !
(సశేషం...)

No comments:

Post a Comment

Pages