గోధుమ మొలకల దోస
- లీలా సౌజన్య
మొలకలు, తృణధాన్యాలతో కూడిన ఈ దోశ డయాబెటిస్ ఉన్నవారికి చాలా ఆరోగ్యకరమైన ఆహారం. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచే ఈ దోస, కెలొరీల పరంగా కూడా చాలా మంచిది.
కావలసిన పదార్ధాలు :
గోధుమ మొలకలు - 1 కప్. పెసర మొలకలు - 1 కప్. కందిపప్పు - 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు - 2 టేబుల్ స్పూన్లు. శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ - ఒకటి ఎండు మిర్చి - 2 కర్వేపాకు - కాస్తంత ఉప్పు - రుచికి సరిపడేంత నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం : గోధుమ మొలకల్ని బాగా కడగాలి. శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పును నీళ్ళలో గంట నానబెట్టాలి. పెసర మొలకల్ని శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, ఎండు మిర్చితో గ్రైండ్ చేసి, దోశ పిండి లాగా తయారు చేసుకోవాలి. ఉల్లిపాయల్ని సన్నముక్కలు కోసి, తరిగిన కర్వేపాకు, ఉప్పు వేసి, ఒక పెద్ద బౌల్ లో కలుపుకోవాలి. పాన్ వేడి చేసి, కాస్త నూనె వేసి, పిండిని దోస లాగా వెయ్యాలి. మరికాస్త నూనె వేసి, రెండు ప్రక్కలా ఎర్రగా కాల్చి తీస్తే, ఎంతో ఆరోగ్యకరమైన గోధుమ మొలకల దోశ తయారు. మీరూ ప్రయత్నించండి.
No comments:
Post a Comment