జాతిపిత బాపూజీ
- ఆచంట హైమవతి
మంచితాత మన బాపూజీ -
మనసున్న వాడు తాతాజీ-
అందరి వాడు గాంధీజీ -
మహాత్ముడే బాపూజీ! కులాన్నీ వేర్వేరు కాదనీ ,
మానవకులమే మనందరిదనీ,
ఏమతమైనా నీతొకటేనని,
అనుసరించుటే ధర్మమన్నాడు
మనమందరమూ అన్నదమ్ములనీ
తరతమ భేదం ఉండరాదనీ....
ఓర్పుని కలిగి ఉండాలనీ ,
సౌహార్దం సౌఖ్యదాయకమన్నాడు!
మనసున్న వాడు తాతాజీ-
అందరి వాడు గాంధీజీ -
మహాత్ముడే బాపూజీ! కులాన్నీ వేర్వేరు కాదనీ ,
మానవకులమే మనందరిదనీ,
ఏమతమైనా నీతొకటేనని,
అనుసరించుటే ధర్మమన్నాడు
మనమందరమూ అన్నదమ్ములనీ
తరతమ భేదం ఉండరాదనీ....
ఓర్పుని కలిగి ఉండాలనీ ,
సౌహార్దం సౌఖ్యదాయకమన్నాడు!
శాంతిని విడనాడకూడదని,
అహింసయే పరమ ధర్మమని,
మానవసేవే మాధవసేవయనీ,
మద్యపానము వలదన్నాడు!
సత్యాగ్రహమే సాధనమ్మని-
భగవద్గీత పారాయణమ్మునకు -
చక్కని అర్ధం వివరించాడు...
స్వాతంత్ర్య సమర ఖ్యాతిని పెంచాడు!
అహింసయే పరమ ధర్మమని,
మానవసేవే మాధవసేవయనీ,
మద్యపానము వలదన్నాడు!
సత్యాగ్రహమే సాధనమ్మని-
భగవద్గీత పారాయణమ్మునకు -
చక్కని అర్ధం వివరించాడు...
స్వాతంత్ర్య సమర ఖ్యాతిని పెంచాడు!
రామరాజ్యమును కలగన్నాడు -
రాముని మనసారా నమ్మాడు -
శ్రవణుని పితృభక్తిని మెచ్చాడు -
శ్రామికులకు కార్యదీక్ష నేర్పాడు!
కట్టుడు పళ్ళు ఒద్దన్నాడు -
సూటూ - బూటూ ఒద్దన్నాడు-
ఆడంబరమూ ఒద్దన్నాడు -
పగలు - ఈర్ష్యలు ఒద్దన్నాడు!
రాముని మనసారా నమ్మాడు -
శ్రవణుని పితృభక్తిని మెచ్చాడు -
శ్రామికులకు కార్యదీక్ష నేర్పాడు!
కట్టుడు పళ్ళు ఒద్దన్నాడు -
సూటూ - బూటూ ఒద్దన్నాడు-
ఆడంబరమూ ఒద్దన్నాడు -
పగలు - ఈర్ష్యలు ఒద్దన్నాడు!
సత్యమునే పాలించమన్నాడు -
పరులను ద్వేషించ వద్దన్నాడు!
పల్లెలే ఆహార దాతలన్నాడు -
దేశ భక్తియే ధ్యేయమన్నాడు !
పరులను ద్వేషించ వద్దన్నాడు!
పల్లెలే ఆహార దాతలన్నాడు -
దేశ భక్తియే ధ్యేయమన్నాడు !
మానవ మణులుగ మము చేయుము!
సర్వ ధర్మముల మమునడుపుము బాపూ!
వేదభూమియైన మా భారత జాతిపిత నీవని -
వేనోళ్ళ కొనియాడుదుము - ప్రియతమ బాపూ !
సర్వ ధర్మముల మమునడుపుము బాపూ!
వేదభూమియైన మా భారత జాతిపిత నీవని -
వేనోళ్ళ కొనియాడుదుము - ప్రియతమ బాపూ !
No comments:
Post a Comment