శ్రీ రామకర్ణామృతము.
డా.బల్లూరి.ఉమాదేవి.
రాజేంద్ర రాజ సురనాయక రాఘవేశ
రాజాధిరాజ రఘునందన రామభద్ర
దాసోస్మ్యహంచ భవతఃశరణాగతోస్మి. :11:
రాజాధిరాజ రఘునందన రామభద్ర
దాసోస్మ్యహంచ భవతఃశరణాగతోస్మి. :11:
తెలుగుఅనువాదము:
మ:ధరణీనాథ శిరస్స్ఫురన్మకుట రత్నద్యోతనీరాజితా
కరపాదాంబురుహద్వయున్ సకల లోకస్వామి రామప్రభున్
సరసున్ రాఘవుదెవదేవృ విబుధస్తవ్యప్రచారున్ బరా
త్పరురాజేంద్రు రఘూద్వహున్ దలచితద్దాసుండనై యుండెదన్.

భావము:,శ్రీరామచంద్రా !రఘువంశ శ్రేష్ఠా!రాజాధిరాజా !దేవతలను పాలించువాడారాఘవేశారాజాధిరాజా రాఘవంశ రాజుల నానందింప చేయువాడా రామభద్రానేను నీకు శరణు జొచ్చిన దాసుడనయ్యాను.
వ్యా:శ్రీ రాముని వివిధ విశేషణాలతో శరణు కోరడము, వివరిస్తున్నాడు సిద్ధకవి.
శ్లో:శ్రీ రామం సరసీరుహాక్షమమలం దూర్వాంకుర శ్యామలం
విద్యుత్కోటి నిభప్రబాంబరధరం వీరాసనాధిష్ఠితం
వామాంకోపరి సంస్థితాం జనకజా మాలింగ్య తం బాహునా
తత్త్వంచా పరపాణినా మునిగణా నాఙ్ఞాపయంతం భజే. :12 :
తెలుగు అనువాదపద్యము:
శా:వామాంకస్థసతిన్ ప్రవేష్టమున భావంబొప్ప సంశ్లేషుడై
తామౌనీంద్రుల కొక్క హస్తమున దత్త్వం బేర్పడన్ దెల్బు శ్రీ
రామున్ సారసపత్ర నేత్రు ఘను వీరాఖ్యాసనాధిష్ఠితున్
శ్యామాంగున్దపనీయ చేలుని రఘుస్వామిన్ బ్రశంసించెదన్.

భావము:పద్మముల వంటి నేత్రములు కలిగిన దుర్వాగ్రములవలె నల్లనైనట్టి విస్తారములైన మెరపులతో సమానమైన కాంతిగల వస్త్రమును ధరించినట్టి వీరాసనముపై నుండి ఎడమ తొడపై నున్న సీతనొకచేత ఆలింగనము చేసుకొని మరొక చేత నొకచేత బ్రహ్మతత్త్వము మునులకు బోధించు చున్నట్టి రాముని సేవించుచున్నాను.
వ్యా:శ్రీరాముని ప్రేమ,బ్రహ్మతత్వము వివరింపబడినది.

శ్లో:శ్రీ రామః సకలేశ్వరో మమ పితా మాతాచ సీతా మమ
భ్రాతా బ్రహ్మ సఖా ప్రభంజనసుతఃపత్నీ విరక్తిః ప్రియా
విశ్వామిత్ర విభీషణాది వశినో మిత్రాణి బోధ స్సుతో
భక్తిః శ్రీహరి సంగతా రతిసుఖం వైకుంఠమస్మత్పదం.: 13:
తెలుగు అనువాదపద్యము:
భ్రాతా బ్రహ్మ సఖా ప్రభంజనసుతఃపత్నీ విరక్తిః ప్రియా
విశ్వామిత్ర విభీషణాది వశినో మిత్రాణి బోధ స్సుతో
భక్తిః శ్రీహరి సంగతా రతిసుఖం వైకుంఠమస్మత్పదం.: 13:
తెలుగు అనువాదపద్యము:
శా:రామస్వామియె తండ్రితల్లి యల గోత్రాజాత సుగ్రీవ వి
శ్వామిత్రాఖ్య విభీషణాదులు హితుల్ సద్బోధ పుత్రుండు స
ద్భామారత్నము శాంతి మిత్రుడు జగత్ప్రాణాత్మజుండచ్యుత
ప్రేమాసక్తి సుఖంబు మత్సదనమై పెంపొందు వైకుంఠమున్.
భావము:సర్వేశ్వరుడైన రాముడు నాతండ్రి సీత నాతల్లి,బ్రహ్మకు స్నేహితుడైన ఆంజనేయుడు సోదరుడు.విరక్తి నాభార్య విశ్వామిత్రుడు విభీషణుడు మొదలగు ఇంద్రియనిగ్రహము గలవారునామిత్రులు.ఙ్ఞానము నాకొడుకు..హరిపాద పద్మమందు భక్తియేసంయోగసుఖము వైకుంఠము మాకు నివాసస్థానము.
వ్యా:అంతా రాముడే అనే అనే అత్మార్పణా భావము చక్కగావివరింపబడినది.

శ్లోకము:శ్రీరామామలపుండరీకనయన శ్రీరామ సీతాపతే
గోవిందాచ్యుత నందనందన ముకుందానంద దామోదర
విష్ణో రాఘవ వాసుదేవ నృహరే దేవౌఘచూడామణే
సంసారార్ణవ కర్ణధారక హరే కృష్ణాయ తుభ్యం నమః. : 14 :
తెలుగు అనువాద పద్యము:
గోవిందాచ్యుత నందనందన ముకుందానంద దామోదర
విష్ణో రాఘవ వాసుదేవ నృహరే దేవౌఘచూడామణే
సంసారార్ణవ కర్ణధారక హరే కృష్ణాయ తుభ్యం నమః.
తెలుగు అనువాద పద్యము:
శా:ధీరాగ్రేసర నందనందన హరీ దేవౌఘ చూడామణీ
ఘోరాఘౌఘహరాముకుంద నృహరీ గోవింద శ్రీకృష్ణ సం
సారాంభోనిధి కర్ణధార కమలాక్షా శౌరి దామోదరా
శ్రీ రామాచ్యుత జానకీరమణ నిన్ సేవింతు నిష్టాప్తికిన్.

భావము:నిర్మలమైన పద్మముల వంటి కన్నులుగలవాడా..మనోహరమైన కాంతి చేత ప్రకాశించువాడా సీతాపతే గోవిందా అచ్యుతా..నందనందనా ముకుందా ఆనందస్వరూపా దామోదరా వ్యాప్తరూపా,రాఘవా వాసుదేవా నరహరే పాపహరా కృష్ణావతారా నమస్కారము.
వ్యా:కృష్ణుడి రూపాలన్నీ పేర్కొంటూ కవి నమస్కరిస్తున్నాడు.
శ్లో:రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్స్థం కరుణాకరం గుణనిధిం విప్రప్రియం ధార్మికం
రాజత్కుండలాననమండితానన రుచిం రాత్రించర ధ్వంసినం
శంపాకోటి సమానకాంతి విలసన్మాయా మృగఘ్నం భజే. : 15 :
తెలుగు అనువాద పద్యము:--
మ:ధరణీ జాధిపతిన్ లసద్గుణు బరంధామున్ ప్రసూనాస్త్ర సుం
దరు కాకుత్స్థునిధార్మికున్ రఘువరున్ దైత్యారి విప్రప్రియున్
గురు చంచత్కమనీయ శంబర హరోద్ఘారాస్త్రు సత్కుండలా
భరణున్ రామునిలక్ష్మణాగ్రజు గృపాభ్రాజిష్ణు గీర్తించెదన్.
భావము:లక్ష్మణుని అన్న యైనట్టి రఘువంశ శ్రేష్ఠుడైనట్టి సీతాపతి యైన కాకుత్స్థ వంశమందు పుట్టున దయాదిగుణములకు స్థానమైన బ్రాహ్మణుల కిష్టుడైన ధర్మస్వరూపుడైన ప్రకాశించుచున్న కుండలములచేత నలంకరింపబడిన ముఖకాంతి కలిగిన,రాక్షససంహారకుడైన కోటి మెరుపులతో సమానకాంతి గల మాయలేడిని కొట్టిన రాముని సేవించుచున్నాను.
వ్యా:శ్రీరాముని గుణగణాలను శరీరకాంతిని కవి చక్కగా వివరిస్తున్నాడు.
కాకుత్స్థం కరుణాకరం గుణనిధిం విప్రప్రియం ధార్మికం
రాజత్కుండలాననమండితానన రుచిం రాత్రించర ధ్వంసినం
శంపాకోటి సమానకాంతి విలసన్మాయా మృగఘ్నం భజే.
తెలుగు అనువాద పద్యము:--
మ:ధరణీ జాధిపతిన్ లసద్గుణు బరంధామున్ ప్రసూనాస్త్ర సుం
దరు కాకుత్స్థునిధార్మికున్ రఘువరున్ దైత్యారి విప్రప్రియున్
గురు చంచత్కమనీయ శంబర హరోద్ఘారాస్త్రు సత్కుండలా
భరణున్ రామునిలక్ష్మణాగ్రజు గృపాభ్రాజిష్ణు గీర్తించెదన్.
భావము:లక్ష్మణుని అన్న యైనట్టి రఘువంశ శ్రేష్ఠుడైనట్టి సీతాపతి యైన కాకుత్స్థ వంశమందు పుట్టున దయాదిగుణములకు స్థానమైన బ్రాహ్మణుల కిష్టుడైన ధర్మస్వరూపుడైన ప్రకాశించుచున్న కుండలములచేత నలంకరింపబడిన ముఖకాంతి కలిగిన,రాక్షససంహారకుడైన కోటి మెరుపులతో సమానకాంతి గల మాయలేడిని కొట్టిన రాముని సేవించుచున్నాను.
వ్యా:శ్రీరాముని గుణగణాలను శరీరకాంతిని కవి చక్కగా వివరిస్తున్నాడు.
శ్లో:రామం రత్నకిరీట కుండలధరం కేయూర హారాన్వితం
సీతాలంకృత వామభాగ మతులం సింహాసనస్థం ప్రభుమ్
సుగ్రీవాది సమస్త వానర వరైః సంసేవ్య మామం సదా
విశ్వామిత్ర పరాశరాది మునిభిఃసంస్తూయ మానం భజే. : 16 :
తెలుగు అనువాదపద్యము;
చ.క్షితిసుత రామ భాగమునజేరి వసింప వశిష్ట కౌశికా
ద్యతతులు ప్రస్తుతింప రవిజాది వలీ ముఖు లెల్ల గొల్వగా
బ్రతన కిరీట కుండలవిభాసిత సుందర ధన్య మూర్తియై
వితత మృగేంద్ర పీఠమున వేడుక నొప్పెడు రాము నెన్నెదన్.

భావము:రత్నఖచిత కిరీట కుండలములను ధరించినట్టి,భుజకీర్తులతో హారములతో కూడినట్టి సీతచే అలంకరింపబడిన యెడమభాగము కలిగినట్టి సింహాసనమునందున్నట్టి ప్రభువైనట్టి,సుగ్రీవాది వానరులచే స్తోత్రము చేయబడినట్టి సేవించబడుచునట్టి విశ్వామిత్ర,పరాశరాది మునులచే స్తోత్రముచేయబడుచున్నట్టి రాముని సేవించుచున్నాను.
వ్యా:సకలగుణాభిరాముడైన శ్రారామచంద్రుని కవి దర్శించిన తీరు రమణీయముగా వర్ణింపబడినది.
శ్లో:రామస్సీతాసమేతో నివసతు హృదయే సానుజం రామమీళే
రామేణ క్షీణపాప స్త్రివిధమపి కృతం కర్మ రామాయ దద్యాం
రామాదస్యం న జానే న హి కిమపి మహారామనామ్నాః సమానం
రామే పశ్యామి విశ్వం భువనమనుదినం పాహిమాం రామచంద్ర. : 17 :
తెలుగు అనువాద పద్యము:
రామేణ క్షీణపాప స్త్రివిధమపి కృతం కర్మ రామాయ దద్యాం
రామాదస్యం న జానే న హి కిమపి మహారామనామ్నాః సమానం
రామే పశ్యామి విశ్వం భువనమనుదినం పాహిమాం రామచంద్ర. : 17 :
తెలుగు అనువాద పద్యము:
మ:రాముడు ప్రోచు సంతతము రాము నుతింతును రాము చేత మ
త్కామితముల్ ఫలించు నిరతంబును రామున కేను మ్రొక్కెదన్
రామున కెక్కు డెవ్వడిక రాముని పాదము నెంతు రాముపై
ప్రేమ చెలంగు మద్హృదయపీఠి వసింపుము రామ వేడెదన్.

భావము:సీతతో గూడిన రాముడు నాహృదయమున నుండుగాక.తమ్ములతో కూడిన రాముని నుతించుచున్నాను.రామునిచే క్షీణించిన పాపముల గలవాడైనాను.మనోవాక్కాయములచే చేసిన కర్మ రామునికర్పించెదను.రాముని తప్ప నితరుల నెరుగను.రామనామమునకు సమానమైనదేదియు లేదు.సర్వలోకమును రాముని యందు చూచుచున్నాను.వీరుడవైన ఓ రామా నన్ను రక్షింపుము.
వ్యా:రామనామ ప్రాశస్త్యాన్ని గూర్చి కవి చక్కగా వివరిస్తున్నాడు.
శ్లో:రామం రాజశిఖామణిం రఘుపతుం దేవారి దర్పాపహం
లోకానాం హితకారిణం గుణనిధిం కారుణయ పుణ్యోదయమ్
ముక్తా విద్రుమ రత్న శోభిత తనుం సౌందర్య హస్తాంబుజం
కౌసల్యా తనయం భజామి సతతం శ్రీ జానకీ నాయకం. : 18 :
తెలుగు అనువాద పద్యము:
లోకానాం హితకారిణం గుణనిధిం కారుణయ పుణ్యోదయమ్
ముక్తా విద్రుమ రత్న శోభిత తనుం సౌందర్య హస్తాంబుజం
కౌసల్యా తనయం భజామి సతతం శ్రీ జానకీ నాయకం. : 18 :
తెలుగు అనువాద పద్యము:
చ:మరకత ముఖ్య రత్న సుషమాన్విత విగ్రహు గౌసలేయు దు
ర్భర దనుజ ప్రహారు రఘురాజ శిఖామణి జానకీ మనో
హరు ద్రిజగద్ధితున్ శమదమాద్య సమాన గుణాకరున్ సురే
శ్వరు నుతు రామచంద్రు బుధవత్సలు ధార్మికు నాశ్రయించెదన్.

భావము:రాజశ్రేష్టుడైనట్టి రాక్షసుల గర్వమును హరించినట్టి జగతికి హితము చేయునట్టి గుణములకు స్థానమైన దయ,పుణ్యముల అభివృద్ధి కల్గినట్టి ముత్యములు,రత్నములు,పగడములచేప్ రకాశించు శరీరము కల్గినట్టి సుందరమైన హస్తపద్మములు కల్గినట్టి కౌసల్యాసుతుడైన,సీతాపతియైన రాముని సేవించుచున్నాను.
వ్యా:జగదభిరాముని స్వభావమును వివరిస్తున్నారు.
శ్లో:రామం వీరాసనస్థం హృదయగత కరోదంచిత ఙ్ఞానముద్రం
జానున్యాసక్త హస్తం క్షితి వరతనయా భూషితం వామభాగే
షట్కోణే వ్యాహరంతం పవనసుతయుతం మానసే మానయంతం
సుగ్రీవే సేవమానే దృతశరధనుషా దక్షిణే లక్ష్మణేన. : 19 :
తెలుగు అనువాద పద్యము:
జానున్యాసక్త హస్తం క్షితి వరతనయా భూషితం వామభాగే
షట్కోణే వ్యాహరంతం పవనసుతయుతం మానసే మానయంతం
సుగ్రీవే సేవమానే దృతశరధనుషా దక్షిణే లక్ష్మణేన. : 19 :
తెలుగు అనువాద పద్యము:
మ:శరచాపాన్వితుడైన లక్ష్మణుడు నాక్ష్మాపుత్రి పార్శ్వస్థులై
కరమొప్పన్ రవిజుండు గొల్వగను వ్యాఖ్యానంబు సామీరికిన్
వరషట్కోణ నివాసియై తెలుపు సర్వఙ్ఞున్ సువీరాసన
స్థిరు హృత్సంస్థిత బోధ ముద్రకరు సంస్నిగ్ధోరుపరోజ్జవల
త్కరపద్మున్ రఘురామచంద్రు మనసాకాంక్షన్ విలోకింపుమా.

భావము:వీరాసనమందున్నట్టి వురమునకు సమీపము నందున్న ఙ్ఞానముద్ర గలిగిన మోకాలియందున్న హస్తము కలిగిన ఎడమవైపున సీతచే అలంకరింపబడిన షట్కోణ పీఠమందుండి హనుమంతునిచే ఙ్ఞానోపదేశమును చేయుచున్నట్టి సుగ్రీవుడు సేవించుచుండగా ధనుర్బాణములతో కూడిన లక్ష్మణునిచే సేవింప బడుచున్నట్టి రాముని మనసున తలతును.
వ్యా:ఆజానుబాహుడైన రాముని వర్ణన వివరింపబడినది.
శ్లో:రామం సౌమిత్రి మిత్రం రఘుపతి మమలం రామచంద్రం రమేశం
రమ్యం శ్రీ రాఘవేశం శుభలలిత ముఖం శుద్ధసత్త్వం సువీరమ్
సీతా సౌందర్య పాత్రం సురముని వినుతం నీరదేందీవరాభం
వందే వందారుపాలం రజనీచర హరం రమ్యకోదండపాణిమ్. : 20 :
తెలుగు పద్యానువాదము:
శా:రామున్ సత్యపరాక్రమున్ వరసుమిత్రా పుత్రమిత్రున్ రఘు
స్వామిన్ భూమిసుతాధినాథుని బుధస్తవ్యున్ బరేశున్ బరం
ధామున్ రాఘవు రామచంద్రుని సుధాధామాననున్ వారిద
శ్యామున్ దైత్యవిరాము గార్ముకధరున్ సద్భక్తి గీర్తించెదన్.
రమ్యం శ్రీ రాఘవేశం శుభలలిత ముఖం శుద్ధసత్త్వం సువీరమ్
సీతా సౌందర్య పాత్రం సురముని వినుతం నీరదేందీవరాభం
వందే వందారుపాలం రజనీచర హరం రమ్యకోదండపాణిమ్.
తెలుగు పద్యానువాదము:
శా:రామున్ సత్యపరాక్రమున్ వరసుమిత్రా పుత్రమిత్రున్ రఘు
స్వామిన్ భూమిసుతాధినాథుని బుధస్తవ్యున్ బరేశున్ బరం
ధామున్ రాఘవు రామచంద్రుని సుధాధామాననున్ వారిద
శ్యామున్ దైత్యవిరాము గార్ముకధరున్ సద్భక్తి గీర్తించెదన్.
భావము:లక్ష్మణునికి మిత్రుడైనట్టి రఘుపతియైనట్టి సుందరుడైనట్టి రఘుశ్రేష్ఠుడైనట్టి మంగళమైన సుందరమైన మొగము కలిగినట్టి పరిశుద్ధ స్వరూపుడైనట్టి వీరుడైనట్టి సీతయొక్క సౌందర్యమున కాధారమైనట్టి దేవతలచే మునులచే స్తోత్రము చేయబడుచున్నట్టి నల్లకలువ వంటి మేఘము వంటి శోభ కలిగినట్టి నమస్కరించు వారిని పాలించునట్టి రాక్షస సంహారుడైనట్టి మంచి ధనుస్సుచే మనోహరుడైనట్టి రామునికి నమస్కరించుచున్నాను.
వ్యా:దుష్టశిక్షణకై అవతరించిన రాముని కవి స్తుతించుచున్నాడు.
సశేషము.
No comments:
Post a Comment