ప్రేమతో నీ ఋషి – 11
యనమండ్ర శ్రీనివాస్
( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు.
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి.... కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు స్నిగ్ధ. అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాడు... ‘ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ కోసం పనిచేసేందుకు మాంచెస్టర్ వచ్చి, ముందుగా ఆర్ట్ గురించిన అవగాహన కోసం ప్రయత్నిస్తున్న ఋషి, ఫేస్బుక్ లో స్నిగ్ధ ప్రొఫైల్ చూసి, అచ్చెరువొందుతాడు. స్నిగ్ధకు మహేంద్ర కంపెనీ లో ఉద్యోగం వస్తుంది. ఈలోగా ఋషి మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ దర్శించేందుకు వచ్చి, స్నిగ్ధను కలిసి, ఆమెనుంచి ఆర్ట్ కు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. ఫేస్ బుక్ లో ఋషి, స్నిగ్ధ చాటింగ్ ద్వారా వారిద్దరూ మరింత చేరువ అవుతారు. కొత్తగా చేరిన ఉద్యోగంలో మృణాళ్, అప్సరల ప్రవర్తన స్నిగ్ధకు ఆశ్చర్యం కలిగిస్తుంది, అదే ఋషితో చెప్తుంది. మహేంద్రను కలిసిన ఋషి, అతని వ్యాపార ప్రతిపాదనకు అంగీకరించి, స్నిగ్దను, అప్సరను ఆఫీస్ లో కలుస్తాడు. ఇక చదవండి...)
“ మన ఆఫీస్ కు చేరుకోవడానికి 20 నిముషాలు పడుతుంది”,ఋషి కార్ ఎక్కుతుండగా అంది అప్సర. వెంటనే ఆమె తన బాగ్ నుంచి కాలినెస్స్ మాయిస్చరైజింగ్ బాడీ లోషన్ తీసి, తన ముఖానికి, చేతులకు రాసుకుంది.
“ఓహ్! అయితే మీ ముఖం యొక్క ఫ్రెష్నెస్స్ సీక్రెట్ ఇదన్నమాట ! క్లియోపాత్రా గాడిద పాలు రాసుకున్నట్లు !”ఋషి ఆ లోషన్ ను చూడగానే అన్నాడు.
“గాడిద పాలా ?” అప్సర ఒక్క క్షణం సందిగ్ధానికి గురయ్యింది.
“అవును, మీరు ఇప్పుడే రాసుకున్న లోషన్ గాడిద పాలను కలిగి ఉంది. ఇది శరీరంపై అతిగొప్ప ప్రభావాన్ని చూపిస్తూ, అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇంకో సంగతి తెలుసా మీకు ? క్లియోపాత్రా తన అందాన్ని కాపాడుకోవడం కోసం క్రమం తప్పకుండా గాడిద పాలతో స్నానం చేసేదట. నిజానికి, రోజూ ఆమె స్నానం కోసం సరిపడా పాలను అందించడానికి 700 గాడిదలను పెంచేవారట!” ఋషి ఆమెకు తెలిపాడు.
అప్సరకు ఇది తెలీదు. ఆమెకు ఇది చాలా ఆసక్తికరంగా అనిపించింది. లోషన్ ను తిరిగి బాగ్ లో పెడుతూ, ఆమె “ మంచి సమాచారం” అని, “అయితే, మీరు మహేంద్రను ఎలా కలిసారు?” అంటూ మామూలుగా సంభాషణ ఆరంభించింది.
“నేను గత కొంతకాలంగా మహేంద్రను కలవాలని అనుకుంటున్నాను, చివరికి ఇవాళ కలవగలిగాను. మేము ఒక ఆర్ట్ ఫండ్ ను ప్రారంభించనున్నాము, అందులో పెట్టుబడి పెట్టడంలో మహేంద్రకు ఆసక్తి ఉంటుందని అనుకున్నాను. ఈ విషయంగానే ఆయన్ను కలిసేందుకు వచ్చాను.”ఋషి వివరించాడు.
“అయితే మహేంద్ర ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పుకున్నారా ?” అప్సర మామూలుగా అడిగింది. కాని, ఆమె అందం అతనిపై ప్రభావం చూపించసాగింది. ప్రతిక్షణం తనను అప్సర వైపు ఎందుకు లాగుతోందో అతనికి అర్ధంకాలేదు.
“లేదు, ఇందుకు బదులుగా, ఆయన మరొక ప్రతిపాదన ఇచ్చారు. మేము త్వరలోనే వేలం వెయ్యబోయే పెయింటింగ్స్ అన్నింటినీ ఆయన కొంటాను అన్నారు. కొన్నేళ్ళ క్రితం మేము తీసుకున్న మరొక ఫండ్ ద్వారా ఇవన్నింటినీ సేకరించాము. ‘జాతీయ కళాఖండాలు’ గా ముద్రించిన అన్ని పెయింటింగ్స్ ను కొనేందుకు మహేంద్ర ఆసక్తి చూపారు.” ఋషి ఆమెకు ఒక్కొక్కటే వివరించాడు.
అప్సరకు అతను చెప్పిన ఫండ్ పేరు సమాహార –గతంలో భారతీయ చిత్రకారులు వేసిన 500 కళాఖండాల సేకరణ. అందులో దాదాపు 200 కళాఖండాలు భారత ప్రభుత్వంచే ‘జాతీయ కళాఖండాలు’ గా గుర్తించబడ్డాయి. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ అతి జాగ్రత్తగా పరిశీలించి, ఎంపిక చేసిన కలెక్షన్ లు కాబట్టి, వేలంలో వీటికి అత్యధిక ధర పలికే అవకాశం ఉంది. కాని, ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం వల్ల, ఆశించినట్లుగా జరగలేదు. మార్కెట్ డల్ గా ఉన్నందువల్లనే ఈ ఫండ్ ను తిరిగి చెల్లించడం వాయిదా వెయ్యబడింది.
“ఆసక్తికరంగా ఉంది. అయితే, మనం మేధావుల వ్యాపారాల్ని చూస్తూ, ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అన్నమాట ! మీకు తెలుసా, ఏ మూర్ఖుడైనా బొమ్మ వెయ్యగలడు, కాని దాన్ని అమ్మేందుకు తెలివైనవాడికే సాధ్యం.” నవ్వుతూ అంది అప్సర.
“ఆర్ట్ సేల్స్ అంటేనే ఇలా ఉంటుందని నా భావన. ఏమీలేని దాన్నుంచి, ఏదోఒకటి సృష్టించి, దాన్ని అత్యధిక ధరకు అమ్మడం,”అన్నాడు ఋషి ఆమె నవ్వులతో శృతి కలుపుతూ.
అప్సరకు ఋషి హాస్యస్పూర్తి నచ్చింది. ఆ సంభాషణ మరికాసేపు కొనసాగింది, ఋషి ఆమె మనసులో తనపట్ల సదభిప్రాయాన్ని కలిగించగలిగాడు. మరికొద్ది క్షణాల్లో వారు ఆఫీస్ కు చేరుకున్నారు.
ఋషి ఆఫీస్ కు వెళ్లి, చుట్టూ చూసాడు. బయట, అత్యంత సుందరమైన లేటెస్ట్ పెయింటింగ్స్ కలిగిన బాటిక్, అతడిని అబ్బురపరిచింది. “ పెయింటింగ్స్ తో అలంకరించిన గది, ఆలోచనలతో అలంకరించబడినట్లు “- అన్న ఒక కోట్ ఉన్నట్టుండి అతని మనసులో మెరిసింది. ఆ ఆలోచనలు ఎటువంటివో కాలమే చెప్పగలదు.
“ఏ ఆక్షన్ హౌస్ లో వేలం వేస్తున్నారు ? ఏ తేదీన ?” ఆఫీస్ రూమ్ లోకి వస్తూనే ఋషిని కూర్చోమంటూ కుర్చీ చూపి, అడిగింది అప్సర.
ఋషి ఇంకా పరిసరాలను పరికిస్తూనే ఉన్నాడు. అక్కడున్న చాలా చిత్రాల ఖరీదు కొన్ని లక్షల రూపాయిలు ఉంటుందని అతను మనసులోనే అంచనా వేసుకోసాగాడు.అప్సరకు వేలానికి సంబంధించిన వివరాలు ఇచ్చి, ఒక కాటలాగ్ కూడా ఇచ్చాడు.
“హా...కలెక్షన్ చాలా బాగుంది. ఇందులో చాలా భారతీయ చిత్రాలు ఉన్నాయి కూడా.” అంటూ కేటలాగ్ తిరగేస్తూ, “కాని, ధరే చాలా ఎక్కువగా ఉంది”, అంది అప్సర.
ఈ మధ్యకాలంలో చాలామంది భారతీయ చిత్రకారుల పెయింటింగ్స్ అంతర్జాతీయ ఆక్షన్ హౌస్ లలో కోటి రూపాయల పైనే అమ్ముడు అయ్యాయి. ఆర్ట్ ధరలకు సంబంధించి, ఈ చిత్రాల వేలాలు అనేవి ముఖ్యమైన సూచికలు.
“నాకు తెలుసు. కాని, చిత్రకళ అనేది శృంగారం వంటిది. ఇందులో చాలావరకు బాగోదు,బాగుండే వన్నీ సామాన్యుడికి అందుబాటులో ఉండవు.” ఋషి గతంలో చదివిన సామెతను గుర్తు తెచ్చుకుంటూ వెంటనే స్పందించాడు. కాని, దీన్ని అప్సర ఎలా తీసుకుంటుందో తెలీకుండా తొందరపద్దందుకు కాస్త బాధపడ్డాడు.
కాని అప్సర బిగ్గరగా నవ్వసాగింది. “ బాగా చెప్పావు ఋషి. నాకు నచ్చింది. కాని, ఇది ప్రతి ఆర్టిస్ట్ విషయంలోనూ నిజం కాదు.”
“నేను ఏకీభవిస్తున్నాను.పికాసో ఒకసారి ఇలా అన్నారు – కొంతమంది చిత్రకారులు సూర్యుడిని ఒక పసుప్పచ్చ చుక్కగా మారుస్తారు, మరికొందరు పసుప్పచ్చ చుక్కనే సూర్యుడిగా మారుస్తారు. మార్కెట్ లో విలువను పొందగాలవారు మాత్రం రెండవ కోవకు చెందినవారే. ఈ విషయంలో మీరు నిష్ణాతులు.” బదులిచ్చాడు ఋషి.
అప్సర అంగీకరిస్తూ తలూపింది.మరి రెండు నిముషాలు వేలానికి సంబంధించిన విషయాలు మాట్లాడింది. చివరికి, వారు ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ కోసం కొనదగ్గ పెయింటింగ్స్ జాబితాను నిర్ణయించారు. అవన్నీ షార్ట్ లిస్టు చెయ్యగానే, ఆమె ఆ లిస్టు ను స్నిగ్ధకు ఈమెయిలు చేసింది.
సంభాషణ మొత్తంలో ఋషి చాలా చురుకుగా పాల్గొన్నాడు. ఋషి చెప్పిన ప్రతి అంశంలోనూ ఏదోఒక ఆసక్తికరమైన సమాచారం ఉంది. అప్సరకు అతనితో మాట్లాడడం ఎంతో నచ్చింది.
పెళ్ళికాని, స్త్రీలు, పురుషులు తమ భాగస్వాములను ఎంపిక చేసుకునే ఎంతో తేడా ఉంది. బ్రహ్మచారులు ఒకే విధమైన లక్షణాలు కలవారిని ఎంపిక చేసుకుంటూ, చివరికి వారిలో ఒకరిని భార్యగా స్వీకరిస్తారు. కాని ఒకమ్మాయికి డజను మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా, ఏ ఒక్కరూ మరొకరిని పోలి ఉండరు, చివరికి ఆమె పెళ్లి చేసుకునే వాడు కూడా మిగతావారిని పోలి ఉండడు.
ఋషి విషయంలో, అతనికున్న హాస్య స్పూర్తి, అతనిపై అప్సర కన్ను పడేలా చేసింది. మేధస్సు, హాస్యం కలిసిన పురుషుడితో ఆమె ఎప్పుడూ అనుబంధం కలిగి ఉండలేదు. ఆమె వృత్తి రీత్యా, ఆమె జీవితం అంటే తీవ్రమైన వ్యాపారంగా మాత్రమే పరిగణించే వారినే అప్పటిదాకా కలిసింది.
(సశేషం)
No comments:
Post a Comment