శివం – 20
(శివుడే చెబుతున్న కధలు )
రాజ కార్తీక్
9290523901
మంత్రిగారు ఉద్భవుడిని చూసి భయపడసాగారు, ఇది ఏమన్న మానసిక జాడ్యమా అని అనుకోసాగారు, కానీ రాజుకి చెప్పేవారు ఎవరు, ఇది వరకు లాగా ఉద్భవుడి మనసులేదు. ఒకనాడు ఉద్భవుడు వినయ,విదేతలు, ప్రజ్ఞాపాటవాలు నీతీనిజాయితీ చూసి మురిసిపోయిన మంత్రి నేడు ఉద్భవుడి ప్రవర్తన చూసి ఏమిచేయాలో అర్ధంకాక సతమతమవుతున్నాడు. కానీ మంత్రి, ఉద్భవుడి ఆంతరంగిక మందిరంలోకి వెళ్ళి అతగాడ్ని ఈసారి గట్టిగా మందలిద్దాం అనుకున్నాడు, మందిరం దగ్గరికి వెళ్ళిన మంత్రి చాటుగా పరికించగా “శివయ్యా శివయ్యా” అను మాటలు వినబడుతున్నాయి. కానీ మంత్రిగారు నిర్ధారించుకోలేకపోతున్నారు.”ఏమిటి ఉద్భవుడు “ శివనామస్మరణ చేస్తున్నాడా, కానీ అతనికి నమ్మశక్యం కావట్లేదు. మొత్తానికి అది ఉద్భవుడి స్వరం కాదని నిర్ణయించుకున్నాడు. కానీ, ఏమిటి ఈ పరిస్థితి అని ఆలోచిస్తున్నాడు. రాక్షసుల పాలనలలో కూడా శివనామం స్మరించేవారు, అలాంటిది ఇప్పుడు శివనిషేధం ఏంటో అర్ధం కాక ఈ సమస్యను తీర్చేదెలాగో అర్ధంకాక, ఆలోచిస్తున్నాడు మంత్రి.
మరొకవైపు, పురోహితులు ఎట్లయినను ధర్మాన్ని,భక్తిని గెలిపించాలి అని తీర్మానం చేసుకొని నా పూజను చేయుటకు సిద్ధపడుతున్నారు. రాజ్యం మొత్తం ఉద్భవుడు వేసిన చాటింపు విని ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. తమని ఎంతో బాగా చూసుకునే ఉద్భవుడు ఇలా దైవద్వేషిలా మారటానికి కారణం ఏమిటా? అని ఆలోచిస్తున్నాడు. ఉద్భవుడిని గద్దె దింపుదామనుకునేవారు. ఓఇలాంటి నాస్తికుడు రాజు అయితే ఇక పంటలు పండవు, ప్రకృతి కరుణించదు? అనే ఆలోచనలో పడ్డారు, ఆయా కారణాల ద్వారా విప్లవం రాజేద్దామనుకున్నారు. రాజ్యపాలన, తీరుతెన్నులు అన్ని సక్రమంగా సాగుతున్నాయి. తన సామంతరాజులకు జరిగిన చిన్న విప్లవంలో పాలుపంచుకున్న ఉద్భవుడు, ఆ విప్లవాన్ని అణగద్రొక్కి అందరి మన్ననలు పొందాడు. తన వీరత్వంలో శూరత్వంలో వీరభద్రుడిగా పేరు తెచ్చుకున్నాడు కానీ, ఉద్భవుడు తనని దైవనామాలతో పోల్చవద్దు అని, తనకు నేనంటే ఇష్టం ఉండదు అని హెచ్చరిక చేశాడు. అందరూ విస్మయం చెందారు. ఉద్భవుడు అన్ని గుణాల్లో సహజంగా ఉన్నాడు, కేవలం నా పూజయందు, భక్తియందు మాత్రమే తీవ్ర వ్యతిరేకతిలో ఉన్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా ఉద్భవుడు తన పట్టుదల కొనసాగిస్తున్నాడు.
*****
కార్తీకమాసం రానే వచ్చింది... కార్తీక శుద్ధ పాడ్యమి.
ఆ ఊరిలో దేవాలయాలో..... ప్రత్యేకంగా శివాలయంలో వైభవపేతంగా పూజలు మొదలయ్యాయి. అందరిలో మహారాజు చాటింపు గుర్తుకు వస్తుంది. ఇది వరకు అందరూ నా నామస్మరణ చేశారో లేదో కానీ ఇప్పుడు శివనామ నిషేధం గూర్చి అందరూ అనుకుంటున్నారు. రాజు హెచ్చరికలు బ్రాహ్మనోత్తములు పట్టించుకోలేదు, దేవాలయాలు మూయలేదు. ప్రజలు గుడికి వెళ్ళుట ఆపలేదు. ఉద్భవుడు స్థిమితంగా ఉన్నాడులే అని అందరూ అనుకుంటున్నారు. తన చాటింపు గూర్చి దండన గూర్చి మరచిపోయాడులే ఏదో తొందరపాటులో అన్నాడులే అని మంత్రితోపాటు రాజ్యంలోఅందరూ అనుకుంటున్నారు. కానీ జరిగింది ఒకటి. తెల్లవారు ఝామున మొదలుపెట్టిన పూజలు జరుగుతుండగా, సూర్యోదయం అయ్యింది. సూర్యోదయంతో పాటు ఆ గుడి ప్రాంగణం ముందు సైన్యం నెలకొని ఉంది. ఒకానొక భటుడు వచ్చి రాజాజ్ఞను ధిక్కరించి వారికి దండన గురి చేసే హక్కు రాజుకు ఉంది. ఉద్భవరాజు వేసిన చాటింపును మీరందరూ వ్యతిరేకించారు, రాజాజ్ఞను ఉల్లంఘించారు, ఇక మీపై మా తీర్పు తప్పదు, మీ అందరూ దండనకు అర్హులు... “హాహాహాహా “ అని వికట్టహాసం, అది ఉద్భవుడి దగ్గరినుండి... ఆ దేవాలయంలోనికి వెళ్ళి అందర్ని బయటకు ఈడ్చుకురండి, మహాన్యాస అభిషేకాలను భగ్నం చేయండి, గర్భగుడి తలుపులు శాశ్వత తాళాలు వేయండి. హాయ్..పొండి తొందరగా అని ఆజ్ఞాపించాడు ఉద్భవుడు. ఆ సైన్యంలో చాలామంది సైనికులకు ఆ పని చేయటం ఇష్టం లేదు, కానీ వారు వారి తండ్రులు రాజాజ్ఞ బద్ధులుగా ఉండాలని ప్రతిజ్ఞ. అందులోనూ వాళ్ళని ఆదుకున్న ఉద్భవుడు అంటే వారికి ప్రాణం ఇచ్చేంత అభిమానం. గౌరవం, అటుగా చూస్తే మంత్రి కూడా కట్టిపడేసి ఉన్నాడు. శివనామం స్మరించి సమర్ధించిన రాజపరివారాన్ని కూడా బందీలుగా మార్చాడు.
“లోపలికి వెళ్ళి భక్తులను, పురోహితులను బయటకి తెచ్చి కట్టివేసి గుడి తలుపు కూడా మూసి ఆ తాళాలు ప్రక్కన ఉన్న కోనేరులో వేయండి” అన్నాడు బిగ్గరగా సైనికులను అయిష్టంగా అందర్ని తెచ్చి, వాళ్ళలో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నా సరే కట్టివేశారు, పురోహితులను కూడా కట్టివేశారు. క్షత్రియ ధర్మాన్ని అనుసరించే కొంతమంది యువకులు ఎదురు తిరిగిన బలిష్టమైన ఉద్భవుడి సైన్యం కట్టడి చేశారు. ఇక ఏమి చేయాలో ఎవరికీ పాలుపోవట్లేదు.
ఉద్భవుడు పైశాచికంగా మారాడు. ఏవో పేలుడు పదార్ధాలు తీసుకొని గుడి మీద వేయబోయాడు. అందరూ చూస్తుండగా పెద్ద మెరుపు మెరిసింది, గొప్ప ధ్వని జరిగింది, శివుడు రుద్రుడి లాగా సాక్షాత్తుగా దర్శనం ఇచ్చాడు. అందరూ “హరహరమహాదేవ” అంటున్నారు. ఒక్కసారిగా త్రిశూలం వచ్చి ఉద్భవుడికి గుచ్చుకుంది. ఉద్భవుడు ఎగిరి ఎంతో దూరంలో పడ్డాడు. ఉద్భవుడు కన్నుమూశాడు, భోళాశంకరుడి చేతిలో హతమయ్యాడు” ఏమిటి నిజమా?......
No comments:
Post a Comment