“తొలి అడుగులు”
దినవహి సత్యవతి
తల్లిదండ్రులు, పెద్దలు అనుభవంతో
ఇచ్చిన సలహాలను శిరసావహించి
నడవడికను సరిదిద్దుకొనడం,
గురువుల సద్భోధనలను
మార్గదర్శకాలుగా భావించి
సత్ప్రవర్తనతో ఉత్తమ పౌరులుగా మెలగడం,
సామాజిక శ్రేయస్సు కోసం,
నిర్దేశించబడిన కట్టుబాట్లను గౌరవిస్తూ,
జీవితాన్ని సన్మార్గంలోకి మళ్ళించుకోవడం,
మంచీ చెడూ మధ్య తారమ్యాన్ని తెలుసుకుని,
జీవన మార్గాన్ని సుగమం చేసుకోవడం,
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని,
దానిని సాధించడంకోసం,
అమూల్యమైన కాలాన్ని,
వృథా చేయకుండా శ్రమించడం...
ఇవే మానవుడిని,
విజయపథం వైపు నడిపించే “తొలి అడుగులు”.
No comments:
Post a Comment